తమిళనాడులోని కళ్లకురిచి పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తమ బిడ్డ చావుకు టీచర్లే కారణం అంటూ తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. ఇవి హింసాత్మకంగా మారాయి. 

టీచ‌ర్ల‌ వేధింపులు తాళ‌లేక ఓ స్టూడెంట్ సూసైడ్ చేసుకుంది. దీంతో త‌ల్లిదండ్రులు, బంధువులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. స్కూల్ కు వ‌చ్చి నిర‌స‌న తెలిపారు. అయితే ఈ నిర‌స‌న‌లు హింసాత్మ‌కంగా మారాయి. స్కూల్ ఆవ‌ర‌ణ‌లో పార్క్ చేసి ఉన్న బ‌స్సుల‌ను త‌గుల‌బెట్టారు. దీంతో తీవ్ర ఉద్రిక్త‌త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఈ ఘ‌ట‌న త‌మిళ‌నాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది.

గుజరాత్ అల్లర్లు : అహ్మద్ పటేల్‌పై కక్ష సాధింపే.. బీజేపీపై చిదంబరం ఆగ్రహం

పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. త‌మిళ‌నాడు రాష్ట్రం కళ్లకురిచి సమీపంలోని చిన్న సేలం వద్ద ఉన్న ప్రైవేట్ హయ్యర్ సెకండరీ పాఠశాలలో 12వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. అయితే త‌న‌ను ఇద్దరు ఉపాధ్యాయులు చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ నోట్‌ను వదిలిపెట్టింది. బాధితురాలి మృతదేహాన్ని జులై 13వ తేదీన స్కూల్‌ వాచ్‌మెన్‌ మైదానంలో గుర్తించాడు. దీంతో స్కూల్‌ అడ్మినిస్ట్రేషన్‌ని అప్రమత్తం చేసి పోలీసుల‌కు స‌మాచారం అందించాడు. వెంటనే ఆమెను హాస్పిట‌ల్ కు తీసుకెళ్లినా ఫ‌లితం లేకుండా పోయింది. ఆమె అప్ప‌టికే మృతి చెందింద‌ని డాక్ట‌ర్లు నిర్ధారించారు. 

Scroll to load tweet…

వేధింపుల వ‌ల్లే స్టూడెంట్ ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌నే విష‌యాన్ని ఉపాధ్యాయులు ఖండించారు. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు గ‌త బుధ‌వారం కళ్లకురిచ్చి-సేలం రహదారిని దిగ్బంధించి, పాఠశాల యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అలాగే ఆదివారం నిరసనకారులు రెసిడెన్షియల్ పాఠశాల ఆవరణకు చేరుకున్నారు. టీచ‌ర్ల‌పై ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ఆరోపిస్తూ నినాదాలు చేశారు. ఆవ‌ర‌ణ‌లో ఉన్న బ‌స్సుల‌ను, ఇత‌ర ఆస్తులను తగులబెట్టారు. ప‌లు వ‌స్తువుల‌ను ధ్వంసం చేశారు. తీవ్ర ఉద్రిక్త‌త ప‌రిస్థితులు ఏర్ప‌డ‌టంతో పోలీసులు అక్క‌డికి చేరుకున్నారు. 

Parliament Session: అఖిలపక్ష సమావేశానికి ప్రధాని మోడీ డుమ్మా.. కాంగ్రెస్ ఫైర్

హింసకు పాల్పడిన దుండగులు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని స్థానిక పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. అయితే ఈ విష‌యంలో మృతురాలి త‌ల్లి మాట్లాడుతూ.. బాలిక గాయపడిందని పాఠశాల యాజమాన్యం మొదట తనకు సమాచారం అందించిందని తెలిపారు. త‌రువాత చ‌నిపోయింద‌ని చెప్పార‌ని అన్నారు. బాలిక రక్తస్రావం, గాయాల కారణంగా షాక్‌కు గురై మృతి చెందినట్లు పోస్ట్‌మార్టం నివేదిక వెల్లడించింది. గాయాలకు మూలం ఏమిటని ఆరా తీస్తున్న తల్లిదండ్రులు మరోసారి పోస్టుమార్టం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.