గుజరాత్ అల్లర్ల వెనుక అహ్మద్ పటేల్ కుట్ర చేశారంటూ సిట్ బృందం ఆరోపణలపై కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం మండిపడ్డారు. ఇదంతా కక్ష సాధింపు లాగే కనిపిస్తోందని ఆయన ఆరోపించారు. 

గుజరాత్ అల్లర్ల (gujarat riots) వ్యవహరం మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో దివంగత కాంగ్రెస్ (congress) నేత అహ్మద్ పటేల్‌పై (ahmed patel) గుజరాత్ పోలీసులు చేసిన ఆరోపణలపై మాటల యుద్ధం నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరం (p chidambaram) స్పందించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలేనని ఆరోపించారు. గుజరాత్ పోలీసు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇటీవల సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్‌ను అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో పి చిదంబరం ఓ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశాల మేరకు పటేల్ పనిచేశారని ఆరోపించడం దారుణమన్నారు. సిట్ బృందం ప్రత్యేకంగా ఆదేశాలు పొందిన బృందంలా కనిపిస్తోందని పి.చిదంబరం మండిపడ్డారు. 

మరోవైపు.. అహ్మద్ పటేల్ తనయుడు ఫైసల్ పటేల్ కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ హైకమాండ్ తీరుపై ఆయ‌న అసంతృప్తితో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఆయ‌న రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని వీడే అవ‌కాశ‌ముంద‌నే సంకేతాలు పంపారు. తాజాగా ఫైజ‌ల్ ప‌టేల్ ట్విట్ట‌ర్ లో స్పందిస్తూ.. కాంగ్రెస్ అధినాయ‌క‌త్వంపై అసంతృప్తిని.. నిరాశ‌ను వ్య‌క్తం చేశారు. కాంగ్రెస్ హైక‌మాండ్ నుంచి త‌న‌కు ఎలాంటి ప్రొత్సాహం ల‌భించ‌డం లేద‌ని తెలిపారు. చాలా కాలం నుంచి వేచి చూసిచూసి.. అల‌సిపోయాన‌ని పేర్కొన్నారు. త‌న భ‌విష్య‌త్ ఎంపిక‌ల‌ను తెరిచి ఉంచానంటూ.. కాంగ్రెస్ ను వీడే ఆలోచ‌న‌ను వెల్ల‌డించారు. 'నేను వేచి చూస్తూ.. అలసిపోయాను. అగ్రనాయకత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం లేదు. అన్ని ఎంపికలు మా వైపు నుండి తెరిచి ఉంచబడ్డాయి' అని ట్వీట్ చేశారు. 

ALso REad:కాంగ్రెస్ తీరుపై అహ్మద్ పటేల్ కుమారుని అసంతృప్తి.. పార్టీని వీడే యోచ‌న‌లో ఫైస‌ల్ ప‌టేట్ !

కాగా, కాంగ్రెస్ లో బ‌ల‌మైన నాయకుడిగి ఎదిగ‌న‌ అహ్మద్ పటేల్ దీర్ఘకాలిక అనారోగ్యంతో 2020 నవంబర్ లో మరణించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి విధేయుడిగా పరిగణించబడుతున్న అహ్మద్ పటేల్, గాంధీ కుటుంబం తర్వాత పార్టీలో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా పరిగణించబడ్డారు. అటువంటి పరిస్థితిలో, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఫైసల్ పటేల్ కాంగ్రెస్ నాయకత్వంపై ప్రశ్నలు లేవనెత్తడం ద్వారా పార్టీ ఆందోళనను పెంచారు. గుజరాత్‌లో గత 27 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ తిరిగి అధికార పీఠం ద‌క్కించుకోవ‌డానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటి నుంచే ఎన్నిక‌ల వ్యూహాలు ర‌చిస్తోంది.

అయితే, అహ్మద్ పటేల్ తనయుడు ఫైసల్ పటేల్ రాజకీయాల్లోకి రావ‌డంపై స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న రాలేదు. లాంఛనంగా రాజకీయాల్లోకి రావడంపై తనకు ఇంకా నమ్మకం లేదని గత నెలలో ట్వీట్ చేశారు. అయితే, ఆయన తన సొంత జిల్లా భరూచ్ మరియు నర్మదాలో 'పుర్దే కే పేచే సే' పార్టీ కోసం పని చేస్తారు. అలాగే, ఏప్రిల్ 1 నుంచి భరూచ్, నర్మదా జిల్లాల్లోని 7 అసెంబ్లీ స్థానాల్లో పర్యటిస్తానని ఫైసల్ చెప్పారు. అదే సమయంలో ఆయన చేసిన ట్వీట్‌తో ఇప్పుడు రాజకీయ చర్చ జోరందుకుంది.