ఛత్తీస్‌గడ్‌లోని ఓ ఉపాధ్యాయుడు విద్యార్థులతో మస్సాజ్ చేయించుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఆ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు. 

న్యూఢిల్లీ: చదువులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు విద్యార్థులతో చాకిరి చేయించుకోవడానికి ప్రయత్నించాడు. క్లాసు రూమ్‌లో మస్సాజ్‌లకు తెరలేపాడు. తన ఒళ్లు మర్దనం చేయాలని విద్యార్థులను ఆదేశించాడు. ఒక వేళ తిరస్కరిస్తే వారిని కొట్టడం మొదలు పెట్టాడు. ఈ ఘటన వెలుగులోకి రాగానే ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు. ఈ ఘటన ఛత్తీస్‌గడ్‌లోని జష్‌పూర్ జిల్లాలో చోటుచేసుకున్నట్టు అధికారులు శుక్రవారం వెల్లడించారు.

సెంద్రిముంద గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో అసిస్టెంట్ టీచర్‌గా నిందితుడు విధుల్లో ఉన్నాడు. అయితే, విద్యార్థులకు విద్యాబోధన చేయకుండా వారితో మస్సాజ్ చేయించుకున్నాడు. మస్సాజ్ చేయించడానికి నిరాకరించిన విద్యార్థులను కొట్టేవాడు. ఈ విషయం విద్యార్థులు తమ తల్లిదండ్రులకు చెప్పారు. 

Also Read: మణిపూర్ హింసపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలి.. ఎందుకంటే..: సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్

సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసినట్టు జిల్లా విద్యాశాఖ అధికారి సంజయ్ గుప్తా తెలిపారు. బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఈ ఘటనపై దర్యాప్తు చేసి జిల్లా విద్యా శాఖ అధికారికి నివేదిక సమర్పించారు. ఈ సమర్పించిన అందిన తర్వాత ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసినట్టు డీఈవో తెలిపారు.

అంతేకాదు, సంబంధిత క్లస్టర్ ఎడ్యుకేషనల్ కోఆర్డినేటర్ కూ నోటీసులు పంపించామని, తదుపరి దర్యాప్తు చేపడుతున్నట్టు గుప్తా తెలిపారు.