Asianet News TeluguAsianet News Telugu

లింగమార్పిడి శస్త్రచికిత్సతో యువతి అవతారం: ఆ ప్రశ్నలతో టీచర్‌కు వేధింపులు

యువతికి వేధింపులు

Teacher moves WBHRC over transgender taunt


కోల్‌కతా: పుట్టుకతోనే పురుషుడిగా పుట్టినా  30 ఏళ్ళ వయస్సులో సెక్స్ రీ అసైన్‌మెంట్ శస్త్ర చికిత్స ద్వారా  ఓ యువకుడు యువతిగా మారింది.  అధ్యాపక వృత్తిలో పదేళ్ళ అనుభవం  కలిగిన హీరాన్యమ్ డే కు కష్టాలు చుట్టుముట్టాయి.

హీరాన్యమ్ డే  పురుషుడుగానే పుట్టాడు. అధ్యాపక వృత్తిలో ఆయన కొనసాగాడు.  ఆంగ్లం, భూగోళ శాస్త్రాల్లో డబుల్ ఎంఏ చేశాడు.  30 ఏళ్ళ వయస్సులో  హీరాన్యమ్ డే శస్త్రచికిత్స చేసుకొని  సుచిత్ర డే మారాడు. 

అయితే లింగమార్పిడి శస్త్ర చికిత్స తర్వాత సుచిత్ర డే కు ఉద్యోగం దొరకలేదు. ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలకు హజరైన  సుచిత్ర డేకు  ఇబ్బందులు ఎదురయ్యాయి.బ్రెస్ట్, సెక్సువాలిటీ, పిల్లలు పుట్టే సామర్ధ్యానికి సంబంధించిన ప్రశ్నలను ఇంటర్వ్యూలు చేసినవారు అడిగారు.   ఒక ప్రిన్సిపాల్ ఏకంగా తనను సెక్స్ తర్వాత పిల్లలను కనగలవా అని ప్రశ్నించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఉద్యోగం కోసం లింగమార్పిడి శస్త్రచికిత్స చేసుకొన్నావని తనను నిందించావని  ఆమె తనకు ఎదురైన అవమానాలను చెప్పారు.  కోల్ కతాలోని పలు స్కూళ్ల ప్రిన్సిపాళ్లు తనను  బోధించాల్సిన సబ్జెక్టులకు బదులుగా జండర్‌కి సంబంధించిన ప్రశ్నలతో వేధించారని ఆమె  పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios