Asianet News TeluguAsianet News Telugu

NEET: తమిళనాడుకు నీట్ వద్దు.. మంత్రుల నిరాహార దీక్ష

నీట్ పరీక్ష నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇవ్వాలని డీఎంకే ప్రభుత్వం కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. తాజాగా, నీట్ పరీక్షను క్రాక్ చేయలేకపోయామని విద్యార్థులు మరణించడంతో రాష్ట్ర మంత్రులు చెన్నైలో నిరాహార దీక్ష చేపట్టారు. 
 

tamilnadu minister begin hunger strike in chennai demanding neet exemption for taminadu kms
Author
First Published Aug 20, 2023, 1:09 PM IST

చెన్నై: తమిళనాడులో నీట్ పరీక్ష విషాద వాతావరణాన్ని సృష్టించింది. నీట్ పరీక్షలు రాసి ఫలితాలు వచ్చాకే కాదు.. రాక ముందు కూడా మనస్తాపంతో ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతూ పోతున్నది. ప్రతియేటా నీట్ కారణంగా విద్యార్థులు మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమిళనాడు ప్రభుత్వం నీట్ పరీక్ష నుంచి తమకు (తమిళనాడు) మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నది. 

తాజాగా, నీట్ పరీక్ష క్రాక్ చేయనందుకు ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన కాసేపటికి ఆ విద్యార్థి తండ్రి కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో అధికార ద్రవిడ మున్నేట్ర కజగం చెన్నై మొత్తం నిరసనకు పిలుపు ఇచ్చింది. ఆదివారం మొత్తం నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయించింది.

రాష్ట్రంలో వైద్యవిద్య అభ్యసిద్దామని ఆశపడ్డ విద్యార్థులు మరణించడం వెనుక గల కారణం నీట్ అని తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఎక్స్(ట్విట్టర్)లో పేర్కొన్నారు. నీట్ నుంచి తమిళనాడును మినహాయించకపోవడంపై కేంద్ర ప్రభుత్వాన్ని నిరసించారు. కేంద్రం తీరును ఖండించారు.

Also Read: ఫ్రమ్ ది గేట్: అదంతా మోడీకే తెలుసు.. తెలంగాణలో కేసీఆర్ వర్సెస్ కేసీఆర్.. సావర్కర్ కామ్రేడ్ అంటా..!

ఆత్మహత్యలకు పాల్పడ్డ నీట్ యాస్పిరెంట్ల ఫొటోలకు పూలమాలలు వేసి మంత్రి స్టాలిన్ నివాళులు అర్పించారు. ఆ తర్వాత తమిళనాడు మంత్రులు నిరాహార దీక్షకు కూర్చున్నారు.

ఈ నిరాహార దీక్షలో డీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు ఉదయనిధి స్టాలిన్ సహాయ వ్యవసాయ మంత్రి దురైమురుగన్, దేవాదాయ శాఖ పీకే శేఖర్ బాబు, ఆరోగ్య మంత్రి మా సుబ్రమణియన్‌లు కూడా నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఈ నిరాహార దీక్షకు ఉదయనిధి స్టాలిన్ నేతృత్వంలో సాగుతున్నది.

Follow Us:
Download App:
  • android
  • ios