Asianet News TeluguAsianet News Telugu

ఆ పామును తినడమే కరోనాకు విరుగుడట... తమిళనాడు వాసి వీడియో వైరల్

ఎలాంటి ఖర్చు లేకుండానే కరోనా వైరస్ ధరికి చేరకుండా వుంటుందంటే ఏకంగా ప్రమాదకరమైన పామునే తినేశాడు తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి.  

tamilnadu man eats dead snake to ward off Covid19 akp
Author
Madurai, First Published May 30, 2021, 7:57 AM IST

మధురై: కరోనా భయం మనుషులను ఎలాంటి పనులయినా చేయిస్తోంది. ఆస్తులు అమ్ముకుని మరీ కార్పోరేట్ హాస్పిటల్స్ లో వైద్యం చేయించుకుంటున్నారు. అలాంటిది ఎలాంటి ఖర్చు లేకుండానే వైరస్ ధరికి చేరకుండా వుంటుందంటే ఏకంగా ప్రమాదకరమైన పామునే తినేశాడు తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి.  పామును తింటే వైరస్ బారినుండి భయటపడవచ్చని... ఇదే కరోనా మహమ్మారికి విరుగుడని ఎవరు చెప్పారో ఏమో గానీ చచ్చిన పామును తిని కటకటాలపాలయ్యాడు. 

తమిళనాడులోని మధురై జిల్లా పెరుమపట్టికి చెందిన వడివేలు(50) వ్యవసాయ కూలీ. కరోనా వైరస్ వ్యాప్తి, మరణాలను చూసి భయపడిపోయిన అతడు దారుణానికి పాల్పడ్డాడు. కరోనా నుండి బయటపడాలంటే పామును తినాలని ఎవరు చెప్పారో గానీ దాన్ని గుడ్డిగా ఫాలోఅయ్యాడు. ప్రమాదకరమైన ఓ పామును తింటూ వీడియో తీయించుకున్నాడు. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇరకాటంలో పడ్డాడు.

read more   ఒకే వ్యక్తిలో బ్లాక్, వైట్, యెల్లో ఫంగస్‌... రక్తం మొత్తం విషపూరితం, చికిత్స పొందుతూ మృతి

ఈ వీడియో అటవీ అధికారుల దృష్టికి వెళ్ళడంతో వారు వడివేలు జంతుహింసకు పాల్పడ్డాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు వడివేలును అరెస్ట్ చేశారు. అంతేకాకుండా అతడికి రూ.7వేలు జరిమానా విధించారు. 

పాములో విషం వుండే భాగాన్ని కాకుండా ఇతర భాగాన్ని తినడంవల్లే వడివేలు బ్రతికిపోయాడని తెలిపారు. ఇలా కరోనాకు విరుగుడటని ఏది చెబితే అది నమ్మొద్దని... వ్యాక్సిన్ ను తీసుకుని తమను తాము కాపాడుకోవాలని అధికారులు సూచించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios