తమిళనాడులోని ఓ ప్రైవేట్ కాలేజీ క్యాంటీన్‌లో వేలాది మంది విద్యార్థులు కర్రలు, రాడ్‌లు చేతిలో పట్టుకుని ఒక చోటు నుంచి మరో చోటుకు పరుగెత్తిన దృశ్యాలతో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్ పై ఈ ఉభయ వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. 

చెన్నై: తమిళనాడులోని ఓ ప్రైవేట్ కాలేజీ క్యాంటీన్‌లో ఘర్షణ వీడియో వైరల్ అవుతున్నది. కాలేజీ విద్యార్థులకు, తమిళయేతర మెస్ వర్కర్లకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ప్రస్తుతం పరిస్థితులు కంట్రోల్‌లోనే ఉన్నాయి. కాలేజీ యాజమాన్యం అంతర్గత దర్యాప్తు ప్రారంభించింది. ఈ ఘటన కోయంబతూర్‌లోని ఓ ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీలో జరిగింది.

కోయంబతూర్‌లో సూలూర్ సమీపంలోని ఆర్‌వీఎస్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్‌లో నిన్న రాత్రి ఈ ఘటన జరిగింది. లోకల్ స్టూడెంట్లు, టెంపరరీ మెస్ వర్కర్లకు మధ్య ఈ ఘర్షణలు జరిగాయి. వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని మెస్‌లో నియమించుకున్నారు. వందలాది మంది విద్యార్థులు క్యాంటీన్‌లో ఒక చోటి నుంచి మరో చోటకు పరుగులు పెడుతున్న దృశ్యాలు ఆ వీడియోలో కనిపించాయి. కర్రలు, రాడ్‌లు చేతిలో పట్టుకుని విద్యార్థులు ఇలా పరుగు పెట్టడం కలకలం రేపింది.

Scroll to load tweet…

విద్యార్థులు నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్ ఎక్కువగా అడిగినట్టు కథనాలు తెలుపుతున్నాయి. కానీ, మెస్‌లో పని చేయడానికి వచ్చిన ఇతర రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులు అందుకు తిరస్కరించారు. ఇది ఇరు వర్గాల మధ్య వాగ్వాదాన్ని లేపింది. అది వెంటనే హింసాత్మక రూపం దాల్చింది. అక్కడే ఉన్న కొందరు విద్యార్థులు ఘటనను రికార్డు చేశారు. కొందరు ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. 

Also Read: Adani Row: దాచ‌డానికి ఏమీ లేకుంటే.. జేపీసీ ఏర్పాటుపై భ‌య‌మెందుకు? : అమిత్ షా కు జైరామ్ రమేష్ కౌంట‌ర్

ఈ ఘటన జరగ్గానే పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే స్పాట్ వద్దకు వచ్చారు. సిటుయేషన్‌ను కంట్రోల్‌ లోకి తెచ్చారు. కాలేజీ అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ఈ ఘటన మెస్‌లో జరిగినట్టు తెలుస్తున్నది.