Asianet News TeluguAsianet News Telugu

బంగ్లాదేశ్ మహిళతో తమిళనాడు యువతి వివాహం.. సంప్రదాయ బద్ధంగా పెళ్లి చేసిన ఇరు కుటుంబాలు..

చెన్నైలో ఓ లెస్బియన్ వివాహం జరిగింది. అది కూడా సంప్రదాయ బద్ధంగా ఇరు కుటుంబాల అంగీకారంతో వారి ఆద్వర్యంలో జరిగింది. 

Tamil Nadu woman marries Bangladeshi girl in 'traditional' wedding in Chennai
Author
First Published Sep 3, 2022, 11:00 AM IST

చెన్నై : చెన్నైలో సంప్రదాయ పద్ధతిలో ఇద్దరు మహిళలు వివాహం చేసుకున్నారు. వధువు సుభిక్షా సుబ్రమణి నిజమైన తమిళ బ్రాహ్మణ శైలిలో తన తండ్రి ఒడిలో కూర్చుని, తన భాగస్వామి టీనా దాస్‌తో దండలు మార్చుకుంది. బుధవారం చెన్నైలో ఈ ఇద్దరు మహిళల 'సాంప్రదాయ' వివాహం జరిగింది. ఆ తరువాత వారిద్దరు ఒకరి చేతిలో మరొకరు చేయి వేసి నడిచారు. వీరిద్దరూ భార్యాభార్యాలుగా జీవితాన్ని ప్రారంభించారు.  

సుభిక్ష తల్లిదండ్రులు కెనడాలోని కాల్గరీలో స్థిరపడిన తమిళ బ్రాహ్మణులు. సుభీక్ష మాట్లాడుతూ "ఇది మేము ఎప్పుటినుంచో కలలుగన్న క్షణం. అయితే ఇది సాధ్యం అవుతుందని అనుకోలేదు’ అంటూ సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఇక ఈమే భాగస్వామి టీనా, బంగ్లాదేశ్‌లోని సంప్రదాయవాద హిందూ కుటుంబానికి చెందిన యువతి. ఆమె కూడా కాల్గరీలోనే ఉంటుంది. 

‘ఆరేళ్ల సుదీర్ఘ పోరాటం తరువాత తమ కుటుంబాలు తమవైపు నిలబడేలా చేయగలిగామని.. దీనివల్లే వారు తమను అర్థం చేసుకుని.. సంప్రదాయ బద్ధంగా ఆచారాల ప్రకారం.. రెగ్యులర్ పెళ్లిలాగే ప్రతీ ఆచారాన్ని నెరవేర్చాం. మా కుటుంబాలు, తల్లిదండ్రులు మమ్మల్ని ఆశీర్వదించారు’ అని తనను తాను ద్విలింగ సంపర్కురాలిగా చెప్పుకునే చార్టర్డ్ అకౌంటెంట్ సుభిక్ష చెప్పుకొచ్చారు.

సుభిక్ష తన 19 సంవత్సరాల వయస్సులో తన సెక్సువాలిటీని గుర్తించింది. ఆ విషయాన్ని తన తల్లిదండ్రుల దగ్గర మనసు విప్పింది. ప్రస్తుతం కెనడాలోని కాల్గరీలో ఉంటున్న సుభిక్ష తల్లి మాట్లాడుతూ "నేను మదురైలో పెరిగాను. పెళ్లి తరువాత మేము ఖతార్ లో ఉన్నాం. ఆ తరువాత కెనడాకు వెళ్లాకే మేము క్వీర్ కమ్యూనిటీ గురించి తెలుసుకున్నాం" అని ప్లేస్కూల్ నడుపుతున్న సుబిక్ష తల్లి పూర్ణపుష్కళ సుబ్రమణి అన్నారు. "మా అమ్మాయి తన గురించి చెప్పినప్పుడు మొదట భయపడింది మా కుటుంబానికి. ఈ విషయం తెలిస్తే భారత్ లోని మా పెద్ద కుటుంబం మాతో సంబంధాలు తెంచుకుంటుందని విపరీతంగా భయాందోళనలకు గురయ్యాం. ఆ తరువాత భయం ఏమిటంటే, సుభిక్ష సమాజంలో ఎలా జీవిస్తుంది. ఆమెకు మాతృత్వం ఎలా?’’ అనేది అని చెప్పుకొచ్చారు. 

అయితే,  సుభిక్ష తన తల్లిదండ్రుల నుండి ప్రతిసారి ఇలా 'ఎందుకు' అని ప్రశ్నవచ్చినప్పుడల్లా..  'ఎందుకు కాదు' అని ఎదురు ప్రశ్నించేది. చివరికి తనలో ఏం జరుగుతుందో తల్లిదండ్రులు అర్థం చేసుకునేవరకు ఆగలేదు. దీంతో తల్లిదండ్రులు కౌన్సెలింగ్ కు వెళ్లాల్సి వచ్చింది. దాంతో వారి ప్రపంచ దృష్టికోణం క్రమంగా మారిపోయింది.మా కూతురు సంతోషం కంటే కుటుంబం కలిసి ఉండడం, సమాజం ఏమనుకుంటుందో అనేది ముఖ్యం కాదని గ్రహించాం అని పూర్ణపుష్కళ అన్నారు. 

టీనా తాను లెస్బియన్‌ అని గుర్తించాక.. ఆమెకు వివాహం అయ్యింది. భర్త హెటిరో సెక్సువల్.. నాలుగు సంవత్సరాల వారి వైవాహిక జీవితం తరువాత ఇద్దరూ విడిపోయారు. ఈ వివాహం గురించి టీనా మాట్లాడుతూ "నేను ఈశాన్య బంగ్లాదేశ్‌లోని చిన్న పట్టణమైన మౌల్విబజార్‌లో పెరిగాను. 2003లో నా తల్లిదండ్రులతో నేను మాంట్రియల్‌కు వచ్చాం, వివాహం తర్వాత ఇక్కడ నివసిస్తున్న నా సోదరి ఆతిథ్యం ఇచ్చింది" అని టీనా చెప్పింది.

కోవిడ్ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్ తో మ‌హిళ మృతి.. బిల్ గేట్స్, సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌కు బాంబే హైకోర్టు నోటీసులు

"నా తల్లిదండ్రులకు LGBTQI+ కమ్యూనిటీకి ఏ మాత్రం తెలియదు. దీంతో లెస్బియన్ అంటే అదేదో వ్యాధి అనుకుని.. నాకు 19 ఏళ్ల వయసులోనే ఒక వ్యక్తితో వివాహం చేశారు. దీంతో సమస్య పరిష్కారం అవుతుందనుకున్నారు.." అని టీనా చెప్పింది. ప్రైడ్ మంథ్ వేడుకల తర్వాత ఈ జంట ఆరేళ్ల క్రితం కాల్గరీలో ఒక యాప్‌లో కలుసుకున్నారు. ఇది తెలిసి టీనా అక్క ఆమెతో అన్ని కమ్యూనికేషన్లను కట్ చేసుకుంది.  ఆమె కుటుంబం దూరం పెట్టింది. కానీ మేము ఓపిగ్గా ఉండడం వల్ల.. కాలం వారిలో మార్పు తెచ్చింది. 

దీంతో టీనా కుటుంబం సుభిక్షను అంగీకరించారు. సంస్కృత పండితుడు, ప్రొఫెసర్ అయిన ఆమె బంధువు సౌరభ్ బోంద్రే వీరికి అండగా ఉన్నారు. పెళ్లికి వచ్చిన అతిథులలో సుభిక్ష  84 ఏళ్ల అమ్మమ్మ పద్మావతి కూడా ఉన్నారు, ఆమె కొత్త కోడలు గురించి హిందీ, ఇంగ్లీషులలో మాట్లాడుతూనే ఉంది. "అనుమానం వచ్చినప్పుడు, భయం కంటే ప్రేమను ఎంచుకోండి" అని అమ్మమ్మ చెప్పింది. "దూరంగా ఉండి జీవితాంతం బాధపడేకంటే వారు కోరుకునే విధంగా.. మా పిల్లలు ఇక్కడ సంతోషంగా ఉండాలని మేుమ కోరుకున్నాం" అని చెప్పుకొచ్చింది. కెనడాలో తమ వివాహాన్ని నమోదు చేసుకున్నఈ  జంట.. కాల్గరీకి తిరిగి వెళ్లే ముందు ఆగ్నేయాసియా అంతటా తిరగాలని అనుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios