కరోనా వైరస్ దేశంలో రోజు రోజుకీ పెరిగిపోతోంది. ముందుగానే ప్రమాదాన్ని పసిగట్టి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించినప్పటికీ..కేసులు అమాంతం పెరిగిపోతున్నాయి. దీంతో.. చాలా రాష్ట్రాల్లో లాక్ డౌన్ పొడిగించారు కూడా. కేంద్రం కూడా ఈ మేరకు నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది.

Also Read  లాక్ డౌన్: తండ్రి గడ్డాన్ని ట్రిమ్ చేస్తూ కేంద్ర మంత్రి తనయుడు, వీడియో వైరల్...

ఇదిలా ఉంటే.. కరోనా సోకిన రోగులకు కాపాడేందుకు వైద్యులు ప్రాణాలకు తెగించి, కుటుంబాలను వదిలేసి సేవలు చేస్తున్నారు. అలాంటి వారిని గౌరవించాల్సింది పోయి.. కొందరు రోగులు నీచంగా ప్రవర్తిస్తున్నారు. ప్రాణాలకు తెగించి వైద్యం చేస్తున్న డాక్టర్ లనే కొందరు ప్రబుద్ధులు భయాందోళనకు గురిచేస్తున్నారు. ఇదివరకు ఢిల్లి క్వారంటైన్ లో కరోనా అనుమానితులు వైద్యులపై ఉమ్మివేస్తూ వికృత చర్యలకు పాల్పడగా తాజాగా అలాంటి ఘటనే తమిళనాడు తిరుచురాపల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చోటు చేసుకుంది.

 వైద్యుడు బాధితుడికి చికిత్స అందిస్తున్న సమయంలో డాక్టరుపై దురుసుగా ప్రవర్తిస్తూ మాస్కును విసిరేసి డాక్టర్ ముఖం పై ఉమ్మివేసాడు. దీంతో ఆస్పత్రి సిబ్బంది డాక్టర్లు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే మన రాష్ట్రంలో గాంధీలో డాక్టర్ పై దాడి చేయగా వారికి రక్షణ కల్పించాలని డాక్టర్లు కోరారు. మళ్ళీ దేశం లో ఇలాంటి ఘటనలే పునరావృతం కావడం విషాదకరం.