Asianet News TeluguAsianet News Telugu

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఉత్తీర్ణత సాధించిన కూలీ కొడుకు..రెండేళ్ల క్రితం వరకు ఐఐటీ గురించి వినని కుగ్రామం నుంచి..

ప్రతిభకు పేదరికం అడ్డురాదని  మరోసారి  నిరూపితమైంది. రెండేళ్ల వరకు ఐఐటీ గురించి వినని.. తమిళనాడు తిరుచ్చిలోని మారుమూల కుగ్రామం అది. కానీ అక్కడి  ఓ 17 ఏళ్ల విద్యార్థి.. బలమైన సంకల్పం, ప్రతిభ‌తో మొదటి ప్రయత్నంలోనే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలో విజయం సాధించాడు.

Tamil Nadu labourers son beats odds to ace JEE advanced in first attempt
Author
Chennai, First Published Oct 23, 2021, 10:00 AM IST

ప్రతిభకు పేదరికం అడ్డురాదని  మరోసారి  నిరూపితమైంది. రెండేళ్ల వరకు ఐఐటీ గురించి వినని.. తమిళనాడు తిరుచ్చిలోని మారుమూల కుగ్రామం అది. కానీ అక్కడి  ఓ 17 ఏళ్ల విద్యార్థి.. బలమైన సంకల్పం, ప్రతిభ‌తో మొదటి ప్రయత్నంలోనే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలో విజయం సాధించాడు. ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించిన అతడు ఎన్నో ఆటంకాలను దాటుకుని.. JEE Advanced పరీక్షలో ఆల్  ఇండియా ర్యాంక్ 12,175, ఓబీసీ-ఎన్సీఎల్ కేటగిరిలో  2,503 ర్యాంక్  సాధించాడు. దీంతో అతని కళ నెరవేరింది. తర్వలోనే అతడు ప్రతిష్టాత్మక ఐఐటీల్లో అడగుపెట్టనున్నాడు. ఈ విజయం వెనక అతడి కష్టం, కృషి ఎంత ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. 

తిరుచ్చి నగరానికి 50 కిలో మీటర్ల దూరంలో ఉన్న కరాడిపట్టి  గ్రామానికి చెందిన ఎన్ పొన్నాలగన్  కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతడి కొడుకు అరుణ్ కుమార్.. 2019లో జేఈఈ కోచింగ్ కోసం పాఠశాల విద్యా శాఖ, తిరుచ్చి జిల్లా యంత్రాంగం సంయుక్తంగా  నిర్వహించిన  పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. ఆ తర్వాత అరుణ్ కుమార్ జీవితం మారిపోయింది. ఈ కార్యక్రమాన్ని ఆర్థికంగా వెనకబడిన విద్యార్థులు competitive examsలో రాణించడానికి సహాయపడటానికి IGNITTE ఆధ్వర్యంలో ఎన్‌ఐటీ తిరుచ్చి విద్యార్థులు  నిర్వహిస్తున్నారు. 

ఇక, అరుణ్  విసయానికి వస్తే అతడు తల్లిదండ్రులు, ఇద్దరు  సోదరీమణులు, గ్రాండ్ పెరేంట్స్‌తో కలిసి పెకుంటిట్లో నివసించేవాడు. అనేక ఆర్థిక ఇబ్బందులు, ఆటంకాలు  ఎదురైనప్పటికీ అతడు పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. అరుణ్ తొలుత తన  వద్ద  చిన్న  ఫోన్‌తో రోజుకు 30 నిమిషాల పాటు కాల్స్ ద్వారా ఆన్‌లైన్  క్లాసులకు హాజరయ్యేవాడు. తర్వాత అరుణ్ తండ్రి  పొన్నాలగన్.. రూ. 10 వేలు వెచ్చించి అతడికి స్మార్ట్ ఫోన్ కొనిచ్చాడు. అయితే ప్రభుత్వం ఉచితంగా  ల్యాప్‌ ట్యాప్  ఇచ్చినప్పటికీ అందులో ఆడియో పరమైన సమస్యలు  ఉన్నాయని అరుణ్ తండ్రి తెలిపారు. 

Also read: సెక్స్ వర్కర్‌తో ఉండగా పట్టుబడ్డ పియానిస్ట్.. ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు..!

కాంచీపురంలో రెస్టారెంట్లలో హెల్పర్‌గా పని చేస్తున్నప్పటికీ తన  కొడుకుకు మాత్రం  సరైన విద్యాను అందించాలని అనుకున్నట్టుగా పొన్నాలగన్  పేర్కొన్నాడు. ‘ఆరేళ్ల క్రితం ప్రైవేట్ స్కూల్ ఫీజు కట్టలేక.. నా కొడుకు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాను. అతను ప్రతిభ గల విద్యార్థి కావడంతో.. ఎప్పుడూ పనికి తీసుకెళ్లడం వంటి వాటి గురించి ఆలోచించలేదు’అని పొన్నాలగన్ చెప్పాడు.

ఇక, గత ఏడాది సీట్ల కేటాయింపును పరిశీలిస్తే.. అరుణ్ ఈ సారి ఏదో ఒక ఐఐటీలో సీటు పొందుతాడని ఐజీఎస్‌ఐటీటీఈ కో ఆర్డినేటర్ ఎస్  రోహిత్  చెప్పారు. రాష్ట్రంలోని ఏ ఇతర ప్రభుత్వ పాఠశాల విద్యార్థి జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఉత్తీర్ణత సాధించలేదని అరుణ్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అముత భారతి పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios