Asianet News TeluguAsianet News Telugu

సెక్స్ వర్కర్‌తో ఉండగా పట్టుబడ్డ పియానిస్ట్.. ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు..!

చైనాలో ప్రిన్స్  ఆఫ్ పియానోగా  పేరుగాంచిన  లి యుండి చిక్కకులో పడ్డాడు. అతడిని  వ్యభిచార ఆరోపణలపై పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం రాత్రి  లి యుండి ఓ  సెక్స్  వర్కర్‌ ఉండగా పట్టుబడినట్టుగా అక్కడి పోలీసులు తెలిపారు. 

China prince of pianist Li Yundi arrested for soliciting sex worker
Author
Beijing, First Published Oct 22, 2021, 5:40 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

చైనాలో ప్రిన్స్  ఆఫ్ పియానోగా  పేరుగాంచిన  లి యుండి చిక్కకులో పడ్డాడు. అతడిని  వ్యభిచారం కేసులో ( prostitution charges) పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం రాత్రి  లి యుండి ఓ  సెక్స్  వర్కర్‌ ఉండగా పట్టుబడినట్టుగా అక్కడి పోలీసులు తెలిపారు. బీజింగ్ జిల్లాలోని చావోయాంగ్ పోలీసులు ఈ అరెస్ట్ చేశారు. ఓ వ్యక్తి.. మహిళను ఎంగేజ్ చేసుకున్నట్టు తమకు సమాచారం అందడంతో  పోలీసులు  అక్కడికి  చేరుకున్నట్టుగా తెలుస్తోంది. అక్కడ పోలీసులు చెన్ అనే 29 ఏళ్ల మహిళను, 39 ఏళ్ల లిని అరెస్ట్ చేశారు. లి యుండితో పాటు సెక్స్ వర్కర్‌ను  పోలీసులు  అరెస్ట్ చేసినట్టుగా చైనాలో అధికార కమ్యూనిస్ట్  పార్టీకి చెందిన పీపుల్స్ డైలీ గురువారం  అర్ధరాత్రి సోషల్ మీడియా ద్వారా  వెల్లడించింది. 

‘కొంతమంది ప్రముఖులు తరచూ సామాజిక మనస్సాక్షి, నైతికత, చట్టం యొక్క గౌరవాన్ని కూడా సవాలు చేస్తున్నారు’అని చైనా ప్రభుత్వ మీడియా సీసీటీవీ  పేర్కొంది. క్రమశిక్షణ, చట్టాలకు కట్టుబడి ఉండటం అతి ముఖ్యమైనదని  తెలిపింది. ఇక, ప్రభుత్వ క్రమశిక్షణను సవాల్ చేస్తే ఎవరికైనా ఇలాంటి పరిస్థితి తప్పదని చైనా ప్రభుత్వ వర్గాలు హెచ్చరించాయి.

బీజింగ్ పోలీసులు సోషల్ మీడియాలో పియానో ​​చిత్రాన్ని పోస్ట్ చేశారు. ‘ఈ ప్రపంచంలో నలుపు, తెలుపు కంటే ఎక్కువ రంగులే ఉన్నాయి. కానీ నలుపు, తెలుపును వేరు చేయాలి. ఇది కచ్చితంగా  గందరగోళానికి గురికాదు’అని పోలీసులు  పేర్కొన్నారు. అయితే పలువురు పోలీసులకు కాల్  చేయగా..  వారి వద్ద నుంచి ఎలాంటి సమాధానం  లభించలేదు. 

Also read: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మృతి

2000లో 24వ ఇంటర్నేషనల్ చోపిన్ పియానో పోటీలో Li Yundi విజేతగా నిలిచాడు.  తన 18 వయసులో ఈ ఘనత సాధించాడు. చైనాలో లి యుండికి  చాలా మంది  అభిమానులు ఉన్నారు. తన  కళను  పలు  ప్రపంచ దేశాల్లో కూడా లి యుండి ప్రదర్శించారు. చైనా  ప్రభుత్వ మీడియా సీసీటీవీ వేడుకల్లో, పలు ప్రోగ్రామ్స్‌లో కూడా తన ప్రదర్శనతో మెప్పించాడు.

Follow Us:
Download App:
  • android
  • ios