వివాదం: మెరీనాబీచ్‌లో కరుణానిధి అంత్యక్రియలకు పళని నో

First Published 7, Aug 2018, 8:28 PM IST
Tamil Nadu Govt Denies Space for Karunanidhi's Burial at Marina Beach
Highlights

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకె చీఫ్ కరుణానిధి అంత్యక్రియలను మెరీనా బీచ్‌లో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. మెరీనాబీచ్‌లో కాకుండా  గాంధీ మండపం వద్ద  స్థలం కేటాయించనున్నట్టు ప్రభుత్వం  ప్రకటించింది.
 


చెన్నై:తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకె చీఫ్ కరుణానిధి అంత్యక్రియలను మెరీనా బీచ్‌లో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. మెరీనాబీచ్‌లో కాకుండా  గాంధీ మండపం వద్ద  స్థలం కేటాయించనున్నట్టు ప్రభుత్వం  ప్రకటించింది.

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన కరుణానిధి అంత్యక్రియలను మెరీనా బీచ్‌లోనే చేయాలని కుటుంబసభ్యులు భావిస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే  మెరీనా బీచ్‌లో కరుణానిధి అంత్యక్రియలు చేసే విషయంలో తమిళనాడు సర్కార్ అంగీకరించడం లేదు

మెరీనా బీచ్‌లో కరుణానిధి అంత్యక్రియలకు స్థలం కేటాయించకుండా గాంధీ మండపం వద్ద స్థలాన్ని కేటాయించనున్నట్టు తమిళనాడు సీఎం పళనిస్వామి ప్రకటించారు.  మెరీనా బీచ్ లో  కరునా స్మారక చిహ్నానికి ఇబ్బందులు ఉంటాయని  పళనిస్వామి చెబుతున్నారు.

అయితే మెరీనా బీచ్‌లోనే జయలలిత, ఎంజీఆర్ ల ను ఖననం చేశారు. కానీ, మెరీనాబీచ్‌లో  కరుణానిధి అంత్యక్రియల నిర్వహణకు మాత్రం సర్కార్  అనుమతించలేదు.దీంతో  ఈ విషయమై  తమిళనాడులో రాజకీయంగా వివాదం చోటు చేసుకొంది.

loader