మంకీపాక్స్ వ్యాధి లక్షణాలు ఆఫ్రికా ప్రాంతాల్లో వెలుగు చూసిన వాటి కంటే భిన్నంగా ఉన్నాయని కొత్త అధ్యయనం వెల్లడించింది. ఈ అధ్యయనం సారాంశం బ్రిటిష్ మెడికల్ జర్నల్ లో ప్రచురితం అయ్యింది. 

ఇప్పుడు ప్ర‌పంచ దేశాల‌ను వెంటాడుతున్న భ‌యం మంకీపాక్స్. ఈ వైర‌స్ అనేక దేశాల్లో వెలుగులోకి వ‌స్తోంది. అయితే ఈ వైర‌స్ ఆఫ్రికన్ ప్రాంతాలలో గతంలో వ్యాప్తి చెందినప్పుడు క‌నిపించిన ల‌క్ష‌ణాల కంటే ఇప్పుడు మ‌రిన్ని కొత్త ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయ‌ని, వాటి కంటే చాలా భిన్నంగా ఉన్నాయ‌ని బ్రిటిష్ మెడికల్ జర్నల్ (BMJ)లో ప‌బ్లిష్ అయిన ఒక అధ్యయనం వెల్ల‌డించిందని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ఓ కథనంలో పేర్కొంది. 

ఈ అధ్య‌యంలో 197 మందిపై జ‌రిపారు. వారిపై జ‌రిగిన విశ్లేష‌ణ ఆధారంగానే దీనిని రూపొందించారు. మొత్తంగా ఈ వైర‌స్ సోకిన 197 మంది పురుషుల‌పై లండ‌న్ లో ఈ ప‌రిశోధ‌న జ‌రిగింది. ఇందులో 196 మంది స్వలింగ సంపర్కులుగా, ద్విలింగ సంపర్కులుగా లేదా పురుషులతో లైంగిక సంబంధం కలిగి ఉన్న ఇతర పురుషులుగా ఉన్నార‌ని గుర్తించారు.

యువతి ప్రాణం తీసిన అనుమానం.. పెళ్లి చేసుకోవాల్సిన ప్రేయసిని హతమార్చిన ప్రియుడు

ఈ అధ్యయనం ప్రకారం.. 2007-11లో డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో, 2017-18లో నైజీరియాలో గతంలో సంభవించిన వ్యాప్తితో పోలిస్తే ప్ర‌స్తుతం వ్యాప్తిలో మల నొప్పి, పురుషాంగం వాపు (ఎడెమా) సాధారణంగా కనిపిస్తుంది. అందువల్ల ఈ లక్షణాలతో ఉన్న రోగులలో మంకీపాక్స్ సంక్రమణను వైద్యులు పరిగణిం చాలని పరిశోధకులు సిఫార్సు చేస్తున్నాన్నారు. పురుషాంగానికి విస్తృతమైన గాయాలు, తీవ్రమైన మల నొప్పితో బాధ‌ప‌డుతూ మంకీపాక్స్ ఇన్ఫెక్షన్ ఉన్నవారిని ‘‘ఇన్ పేషెంట్ గా తీసుకొని వారిని అబ్జ‌ర్వేష‌న్ లో ఉంచాలి’’ అని వారు అంటున్నారు.

BMJ అధ్యయనంలో లండన్ కోహోర్ట్ లో నాలుగింట ఒక వంతు (26.5 శాతం) మందికి మాత్రమే మంకీపాక్స్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు నిర్ధారించబడిన వారితో పరిచయం ఉందని, లక్షణ రహితంగా లేదా కొన్ని లక్షణాలు ఉన్న వ్యక్తుల నుండి సంక్రమించే అవకాశం ఉందని కనుగొన్నారు. ‘‘ ఈ ఫలితాలను అర్థం చేసుకోవడం కాంటాక్ట్ ట్రేసింగ్, పబ్లిక్ హెల్త్ అడ్వైస్, కొనసాగుతున్న ఇన్ఫెక్షన్ నియంత్రణ, ఐసోలేషన్ చర్య లకు ప్రధాన చిక్కులను కలిగి ఉంటుంది ’’ అని BMJ ఒక ప్రకటనలో తెలిపింది.

తీవ్రవాదులకు కేరళ స్వర్గధామంగా మారింది: కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్

1970లో కాంగోలో మంకీపాక్స్ ను తొలిసారిగా మనుషుల్లో గుర్తించారు. కానీ ఆ తర్వా త దాదాపు 50 సంవత్సరాల వరకు వైరల్ ఇన్ఫెక్ష‌న్ అనారోగ్యం కొన్ని కేసులు ఆఫ్రికన్ ప్రాంతాల వెలుపల నుంచి స్థానికంగా నివేదించబడ్డాయి. అందుకే యూఎస్, యూకే, యూరప్, ఇండియాతో పాటు ఇతర ప్రాంతాలకు ఈ వ్యాధి అకస్మాత్తుగా వ్యాపించడం అందరినీ ఆశ్చర్యా నికి గురి చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవలే ప్రస్తుత వ్యాప్తిని అంతర్జాతీయ ఆందోళన యొక్క పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. BMJ పరిశోధకులు ఈ వ్యాప్తి నిరంతర పెరుగుదల అంటే రోగనిరోధక శక్తి లేని వ్యక్తులు, పిల్లల‌తో పాటు హాని కలిగించే జనాభాకు వ్యాప్తి చెందడం సాధ్యమవుతుందని తెలిపింది. 

మంకీపాక్స్ పొదిగే కాలం ప్రస్తుతం 12 రోజులు (పరిధి 5-24 రోజులు) గా ఉంద‌ని అర్థం అవుతోంది. మంకీపాక్స్ ఇన్ఫెక్ష‌న్ ల‌క్ష‌ణాల్లో ముఖ్యంగా జ్వరం, అనారోగ్యం, చెమటలు, వాపు, కణుపులు, తలనొప్పి, చ‌ర్మం విస్ఫోటనం వంటివి జ‌రిగే అవ‌కాశాలు ఉన్నాయి. కాగా ఈ వైర‌స్ వ్యాప్తిపై WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ బుధవారం మాట్లాడారు. ప్రస్తుతం వ్యాప్తిని త‌గ్గించ‌వ‌చ్చ‌ని తెలిపారు. దేశాలు, సంఘాలు, వ్యక్తులు ఎవ‌రికి వారు ఈ వైర‌స్ ను సీరియ‌స్ గా తీసుకోవాల‌ని చెప్పారు. ‘‘ పురుషుల‌తో సెక్స్ చేసే పురుషులు ప్ర‌స్తుతానికి మీ లైంగిక భాగస్వా ముల సంఖ్యను తగ్గించుకోవాలి. కొత్త భాగస్వా ములతో సెక్స్ విషయంలో ఒక సారి పునఃపరిశీలించాలి. ’’ అని ఆయన చెప్పారు.