చాలా కాలం తరువాత ఉత్తరప్రదేశ్ లో మొదటి స్వైన్ ఫ్లూ కేసు వెలుగులోకి వచ్చింది. బాధితుడు పది రోజుల నుంచి పలు ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నాడు. దీంతో ఆయనకు పరీక్షలు నిర్వహించగా వ్యాధి నిర్ధారణ అయ్యింది.
స్వైన్ ఫ్లూ మళ్లీ వచ్చేసింది. గత కొంత కాలంగా ఈ కేసులు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. కరోనా సమయంలో అందరూ మాస్కులు, భౌతిక దూరం పాటించడం, అలాగే చేతుల పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఈ కేసులు దాదాపుగా కనిపించకుండా పోయాయి. అయితే తాజాగా ఉత్తరప్రదేశ్ లో ఓ కేసు పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఆ రాష్ట్రంలోని ఫతేపూర్‌లో నివసిస్తున్న రాంబాబు స్వైన్ ఫ్లూ పాజిటివ్ గా తేలింది. దీంతో ఆయనను కాన్పూర్‌లోని రీజెన్సీ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నారు.
సీబీఎస్ఈ 12 వ తరగతి బోర్డు ఫలితాల విడుదల: బాలికలదే పై చేయి
పేషెంట్ రాంబాబు దాదాపు 10 రోజులుగా జ్వరం, జలుబు, దగ్గు, వెన్నునొప్పితో బాధపడుతున్నారు. దీంతో ఆయనకు పరీక్షలు నిర్వహించగా స్వైన్ ఫ్లూగా తేలింది. చీఫ్ మెడికల్ ఆఫీసర్ (CMO) అలోక్ రంజన్ దీనికి సంబంధించిన నివేదికలను ప్రభుత్వంతో పాటు ఫతేపూర్ అడ్మినిస్ట్రేషన్ కు పంపించారు. రాంబాబు కుటుంబాన్ని క్వారంటైన్ చేయాలని సూచించారు. ప్రతీ ఒక్కరూ మాస్కులు ధరించాలని, రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లవద్దని రంజన్ కోరారు. పరిస్థితి అదుపులోనే ఉందని ఆయన తెలిపారు.
భారత నూతన రాష్ట్రపతిగా గిరిజన మహిళ... ద్రౌపది ముర్ముకు అభినందనల వెల్లువ (ఫోటోలు)
కాగా.. ఉత్తరప్రదేశ్‌లో పందుల మరణాల సంఖ్య మరింత పెరిగింది. మునిసిపల్ కార్పొరేషన్ వెటర్నరీ అధికారి చనిపోయిన పందుల మల విసర్జన నమూనాను పరీక్ష కోసం భోపాల్ ల్యాబొరేటరీకి పంపారు. అయితే ఈ పందులకు ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ ప్రారంభ దశలో ఉన్నట్లు అనుమానించారు. దీన్ని నిర్ధారించేందుకు చనిపోయిన ఐదు పందుల అవయవాలను పరీక్షలకు పంపించారు. పందుల అనుమానాస్పద నమూనాలను పరిశీలించి నివేదికను సిద్ధం చేసేందుకు పశువైద్యాధికారి నలుగురు సభ్యులతో కూడిన కమిటీని కూడా ఏర్పాటు చేశారు.
యువతిని దారుణంగా హత్య చేసి, తలతో పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన ప్రేమోన్మాది..
ఈ కమిటీ మెంబర్ కౌన్సిలర్ గిరీష్ చంద్ర మాట్లాడుతూ.. 4-5 రోజుల నుండి సమీప ప్రాంతాల్లో చాలా మంది వ్యక్తులు మరణిస్తున్నారని తెలిపారు. ఈ వ్యాధి మనుషులకు కూడా సంక్రమిస్తుందని తాము ఆందోళన చెందుతున్నామని చెప్పారు.
