అస్సాం బీజేపీ ఎంపీ ఒకరింట్లో ఓ పదేళ్ల చిన్నారి అనుమానాస్పద మృతి చర్చనీయాంశంగా మారింది. ఆ చిన్నారి తల్లి ఎంపీ ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తోంది.
అస్సాం : అస్సాం బిజెపి ఎంపీ ఒకరు వివాదాల్లో చిక్కుకున్నారు. అస్సాం రాష్ట్రంలోని సిల్చార్ బిజెపి ఎంపీ రాజ్దీప్ రాయ్ ఇంట్లో రెండేళ్లుగా పనిచేస్తున్న ఓ పనిమనిషి కుమారుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీంతో ఈ వార్త రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పదేళ్ల బాలుడు ఉరికి వేలాడుతూ కనిపించాడు. ఉరి వేసుకున్న గది తలుపులు బయట నుంచి పెట్టి ఉన్నాయి. దీంతో బాలుడి మృతిపై పలురకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలలోకి వెళితే… ఎంపీ రాజ్ దీప్ రాయ్ ఇంట్లో ధోలాయ్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ రెండున్నరేళ్లుగా పనిచేస్తోంది. రాజ్ దీప్ రాయ్ ఇంటి భవనంలోని మొదటి అంతస్తులోని వాటాలో పదేళ్ల కొడుకు, కూతురుతో కలిసి ఆమె ఉంటుంది. కాగా, శనివారం సాయంత్రం భోజనాలు అయిన తర్వాత ఆ చిన్నారి తల్లి ఫోను అడిగి తీసుకున్నాడు.
షాకింగ్ : డాక్టర్ ను కారుతో గుద్ది.. బానెట్ మీద 50 మీటర్లు ఈడ్చుకెళ్లిన దుండగులు.. వీడియో వైరల్...
భోజనాలు చేసిన తర్వాత తల్లి, సోదరి మొదటి అంతస్తు నుండి పై అంతస్తులోని యజమాని ఇంట్లో పని చేయడానికి వెళ్లారు. పని అయిపోయిన తర్వాత కిందికి తిరిగి వచ్చి చూసేసరికి.. తాముంటున్న గదిలో ఫ్యాన్ కు వేలాడుతూ బాలుడు కనిపించాడు. వెంటనే గట్టిగా కేకలు వేస్తూ మిగతా వారిని అలర్ట్ చేసింది తల్లి.
అక్కడ ఉన్న మిగతా పనివారు వచ్చి చూసేసరికి బాలుడు మృతి చెందాడు. విషయం యజమాని రాజ్ దీప్ రాయ్ కు తెలియజేశారు. దీనిమీద ఎంపీ రాజ్ దీప్ రాయ్ మాట్లాడుతూ… ‘ఘటనకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులు నాకు తెలిపారు. నేను హుటాహుటిన అక్కడికి వెళ్లి చూశాను. బాలుడు గదిలోపల ఉరివేసుకుని కనిపించగా గది బయట గడియ వేసి ఉందని పోలీసులు చెప్పారు. ఈ ఘటన మీద నిష్పాక్షికంగా దర్యాప్తు చేయాలని నేను పోలీసులను కోరాను’ అని తెలిపారు.
