Asianet News TeluguAsianet News Telugu

షాకింగ్ : డాక్టర్ ను కారుతో గుద్ది.. బానెట్ మీద 50 మీటర్లు ఈడ్చుకెళ్లిన దుండగులు.. వీడియో వైరల్...

రోడ్డుమీద స్పీడ్ గా వెడుతున్న ఓ కారు అటుగా వెడుతున్న డాక్టర్ ను గుద్దింది. ఆ తరువాత అతడిని తమ కారు బానెట్ పై 50మీటర్ల మేర ఈడ్చుకెళ్లారు. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. 

Doctor dragged For 50 Metres On Car Bonnet In haryana, shocking video viral - bsb
Author
First Published Aug 28, 2023, 11:40 AM IST

హర్యానా : హర్యానాలోని పంచకులలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ డాక్టర్ ను ఢీ కొట్టిన కారు కారు బానెట్‌పై 50 మీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. ఈ ఘటన పంచకులలో శనివారం చోటుచేసుకుంది. రోడ్డుపై జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

పంచకులలోని ఎండీసీ నివాసి అయిన డాక్టర్ గగన్ ప్రమాదం జరిగిన సమయంలో తన కొడుకును ట్యూషన్ నుండి ఇంటికి తీసుకువెళుతున్నాడు. దీనిమీద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రవి దత్ మాట్లాడుతూ, "సెక్టార్ 8, పంచకుల ట్రాఫిక్ జంక్షన్‌లో డాక్టర్ గగన్ వెడుతున్న వాహనాన్ని ఓవర్‌టేక్ చేయడానికి ఓ కారు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆ కారు డాక్టర్ బండిని ఢీకొట్టింది. 

ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల చేసిన రాష్ట్రపతి ముర్ము.. హాజరైన నడ్డా, చంద్రబాబు, పురందేశ్వరి..
ఢీకొట్టడంతో కారులోని వ్యక్తుల్ని ప్రశ్నించాలని డాక్టర్ బండి ఆపి.. కారు దగ్గరికి వెళ్లాడు.. కారులోని వ్యక్తి డాక్టర్ ను బానెట్ తో గుద్ది కారుమీద పడగానే.. దాదాపు 50 మీటర్ల వరకు బానెట్‌ పై అలాగే ఎత్తి ఈడ్చుకెళ్లారు. దీనిమీద ఎఫ్‌ఐఆర్ నమోదయ్యింది. దర్యాప్తు కొనసాగుతోంది... అని తెలిపారు. 

50 మీటర్లు ఈడ్చుకెళ్లిన తరువాత దుండగులు అక్కడి నుండి పారిపోయారు. ఘటన చూసిన స్థానికులు వెంటనే డాక్టర్ గగన్‌ను సెక్టార్ 6లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ అతనికి చికిత్స అందించి డిశ్చార్జ్ చేశారు. డాక్టర్ గగన్ ఫిర్యాదుతో పంచకుల పోలీసులు కారు యజమానిపై కేసు నమోదు చేశారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలో ఈ దృశ్యం నమోదయ్యింది. దీంతో ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. 

Follow Us:
Download App:
  • android
  • ios