Asianet News TeluguAsianet News Telugu

భార్యపై అనుమానం.. రోజుల చిన్నారికి విషపు ఇంజెక్షన్ ఇచ్చిన తండ్రి..

భార్యకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో రోజుల పసికందుకు విషపు ఇంజక్షన్ ఇచ్చాడో కసాయి తండ్రి. దీంతో ఆ చిన్నారి పరిస్థితి విషమంగా మారింది.

Suspicion on wife, Father injected pesticide to child in odisha - bsb
Author
First Published May 30, 2023, 4:15 PM IST

బాలాసోర్ : తన భార్యకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఓ వ్యక్తి నవజాత కుమార్తెకు విషపూరిత ఇంజక్షన్‌ను ఎక్కించిన ఘటన ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. పసికందును సోమవారం బాలాసోర్‌లోని జిల్లా ప్రధాన ఆసుపత్రిలో చేర్చగా, చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి అధికారులు తెలిపారు.

మంగళవారం వరకు ఎలాంటి ఫిర్యాదు నమోదు కానందున సూమోటుగా కేసు నమోదు చేస్తున్నామని బాలాసోర్ పోలీసు సూపరింటెండెంట్ సాగరిక నాథ్ తెలిపారు. సాగరిక మాట్లాడుతూ, "ప్రాథమిక విచారణలో వ్యక్తి తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని అనుమానిస్తున్నట్లు తేలింది.

మైనర్ 'ఫేస్‌బుక్ ఫ్రెండ్'ని రెండేళ్లపాటు బంధించి, అత్యాచారం...వ్యక్తి అరెస్ట్

"చందన్ మహానాగా నిందితుడిని గుర్తించారు. అతను ఆ శిశువు తాను తండ్రిని కాదని అనుమానించాడు... దీంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. కాగా.. గ్రామస్తులు ఈ విషయం మీద సమాచారం ఇవ్వడంతో చందన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.

చందన్, తన్మయిలకు గతేడాది వివాహమై మే 9న ఓ పాప జన్మించిందని పోలీసులు తెలిపారు. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత, తన్మయిని ఆమె అత్తమామలు నీలగిరి పోలీసు పరిధిలోని సింఘిరి గ్రామంలోని ఆమె తల్లిదండ్రుల ఇంటికి పంపించారు.

చందన్ సోమవారం తన అత్తమామ ఇంటికి వచ్చినప్పుడు ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. పాప ఏడుపు విన్న తన్మయి వాష్‌రూమ్‌ నుంచి బయటకు వచ్చి చూడగా భర్త చేతిలో సిరంజి, క్రిమిసంహారక బాటిల్‌ కనిపించాయి.

ఆమె తన భర్తను నిలదీయగా, మొదట అతను ఎటువంటి తప్పు చేయలేదని తిరస్కరించాడు, కాని తరువాత నవజాత శిశువుకు పురుగుమందును ఇంజెక్ట్ చేసినట్లు అంగీకరించాడని తన్మయి చెప్పారు. ‘‘నా బిడ్డ, భర్త చేతుల్లో రక్తపు ఆనవాళ్లు కనిపించాయి’’ అని చెప్పింది.

వెంటనే ఆ మహిళ జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు పసికందును సమీపంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. శిశువు పరిస్థితి విషమించడంతో గ్రామానికి 10 కిలోమీటర్ల దూరంలోని బాలాసోర్‌లోని ఆసుపత్రికి తరలించారు.

ఇదిలాఉండగా, తెలంగాణలోని ఓ ప్రభుత్వాసుపత్రిలో దారుణమైన ఘటన వెలుగు చూసింది. డాక్టర్ ఆస్పత్రికి రాలేదని నర్సులు కాన్పు చేయడంతో నవజాత శిశువు మృతి చెందింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడలో వెలుగు చూసింది. కాన్పు వికటించడంతో ఈ దారుణ ఘటన జరిగింది. బంధువులు, కుటుంబసభ్యులు దీనికి సంబంధించి నర్సుల మీద ఆరోపణలు గుప్పించారు. వారు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. నడిగూడెం మండలం వెంకట రామాపురానికి చెందిన మానస గర్భిణి. నొప్పులు రావడంతో కాన్సు కోసం ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. 

మంగళవారం తెల్లవారుజామున ఆమెకు నొప్పులు వచ్చాయి. దీంతో కుటుంబసభ్యులు ఆమెను సూర్యాపేట జిల్లా కోదాడ ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. అక్కడి సిబ్బంది డాక్టర్ కు విషయం చెప్పారు. కానీ ఆమె రాలేనని చెప్పింది. దీంతో నర్సులో కాన్పు చేయాలని నిశ్చయించుకున్నారు. కానీ నిర్లక్షం కారణంగా శిశువు మృతి చెందింది. అయితే, కాన్పు చేసిన నర్సులు.. శిశువు పరిస్థితి ప్రమాదంగా ఉందని.. ప్రైవేట్ ఆస్రత్రికి తీసుకెళ్లాలని హడావుడి చేశారు. 

ప్రభుత్వాసుపత్రిలో చిన్న పిల్లల వైద్యులు కూడా అందుబాటులో లేరు. దీంతో శిశువును ప్రభుత్వాసుపత్రి నుంచి ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లమని చెప్పారు. అయితే, అంబులెన్స్ డ్రైవర్ కూడా ప్రైవేట్ ఆస్పత్రికి రానని చెప్పాడు. దీంతో శిశువు మృతి చెందిందని బంధువలు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. బంధువులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కన్నీరుమున్నీరుగా రోధిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios