Asianet News TeluguAsianet News Telugu

ఎలక్టోరల్ బాండ్లను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్.. వచ్చే నెల 6న విచారణ

ఎలక్టోరల్ బాండ్లను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు వచ్చే నెల 6వ తేదీన విచారించనుంది. సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించనున్నట్టు సుప్రీంకోర్టు మంగళవారం తెలిపింది.
 

supreme court to hear petitions against electoral bonds december 6
Author
First Published Nov 22, 2022, 6:32 PM IST

న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్లను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కాంగ్రెస్ నేత పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. డిసెంబర్ 6వ తేదీన ఈ పిటిషన్ విచారించనుంది. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ జేబీ పర్దివాలాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించనుంది. ఈ మేరకు సుప్రీంకోర్టు మంగళవారం వెల్లడించింది.

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్న సంవత్సరంలో ఎలక్టోరల్ బాండ్ల కొనుగోలును మరో 15 రోజులపాటు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ కాంగ్రెస్ లీడర్ జయ ఠాకూర్ పిటిషన్ వేశారు. దీనితోపాటు 2018 ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ వ్యాలిడిటీని సవాల్ చేస్తూ ఇతర పిటిషన్లూ దాఖలయ్యాయి. ఈ పిటిషన్లు అన్నింటినీ సుప్రీంకోర్టు విచారించనుంది.

Also Read: హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికలు.. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా పార్టీలకు రూ.545 కోట్ల విరాళాలు

రాజకీయ విరాళాల్లో మరింత పారదర్శకత తేవడానికి క్యాష్‌కు బదులు ఎలక్టోరల్ బాండ్లను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. 2018 జనవరి 2న కేంద్ర ప్రభుత్వం ఈ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్‌ను నోటిఫై చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios