న్యూఢిల్లీ: రాఫెల్‌పై దాఖలైన  రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు  గురువారం నాడు కొట్టివేసింది. రాఫెల్ యుద్ద విమానాల  కొనుగోలులో సీబీఐ విచారణ అవసరం లేదని  సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

గురువారం నాడు  సుప్రీంకోర్టు రాఫెల్ యుద్ద విమానాల కొనుగోలు విషయమై  దాఖలైన రివ్యూ పిటిషన్లను కొట్టివేసింది.ఇకపై రాహుల్ గాంధీ నోరు జారకూడదని కూడ సుప్రీంకోర్టు సూచించింది.

ALSO READ:Sabarimala case: స్టేకు సుప్రీం నిరాకరణ, విస్తృత ధర్మాసనానికి కేసు

 కాంగ్రెస్ పార్టీ  మాజీ చీఫ్ రాహుల్ గాంధీ పై ఉన్న కోర్టు ధిక్కరణ కేసును కూడ సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాహుల్‌గాందీ క్షమాపణలను కూడ సుప్రీంకోర్టు అంగీకరించింది. చౌకీదార్ చోర్ వ్యాఖ్యలను తమకు రాహుల్ గాంధీ ఆపాదించడం సరైంది కాదని కూడ సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. రాఫెల్ పై ఇక కోర్టు పర్యవేక్షణ అవసరం లేదని సుప్రీంకోర్టు  తేల్చి చెప్పింది.

 ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా చౌకీదార్ చోర్ అని ప్రధాని నరేంద్ర మోడీపై అప్పటి కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ విమర్శలు చేశారు.

ఈ విమర్శలపై బీజేపీకి చెందిన ఎంపీ మీనాక్షిలేఖి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాఫెల్ యుద్ద విమానాల కొనుగోలు విషయమై రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు చేశారు.

ప్రధాని నరేంద్ర మోడీని చౌకీదార్ చోర్ అంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలను తాము ఎప్పుడు సమర్ధించామో చెప్పాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీన ప్రశ్నించారు.

ఈ విషయమై రాహుల్ ‌గాంధీ ఇచ్చిన వివరణతో సుప్రీంకోర్టు సంతృప్తి చెందలేదు.  రాహుల్ గాంధీ రెండోసారి దాఖలు చేసిన అఫిడవిట్‌లో పశ్చాత్తాపం వ్యక్తం చేసినట్టుగా లేదని సుప్రీంకోర్టు  అభిప్రాయపడింది.

తాను చేసిన వ్యాఖ్యలకు సంబంధించి రాహుల్ గాంధీ రెండు అఫిడవిట్లను ఎందుకు దాఖలు చేశారని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. చౌకీదార్ వ్యాఖ్యలపై తమను తప్పుదోవ పట్టించేలా రాహుల్ వ్యాఖ్యలు ఉన్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. 

ఈ మేరకు ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీన రాహుల్ గాంధీపై  సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు  మాత్రం రాఫెల్ యుద్ద విమానాల కొనుగోలుపై  సీబీఐ విచారణ కోరాయి విపక్షాలు. ఈ మేరకు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.

సంబంధిత వార్తలు

చౌకీదార్ చోర్ వ్యాఖ్యల ఎఫెక్ట్: రాహుల్‌పై మరోసారి సుప్రీం సీరియస్

చౌకీదార్ చోర్ వివాదం: రాహుల్ గాంధీకి సుప్రీం షాక్

విచారం: చౌకీదార్ చోర్ కామెంట్స్‌‌పై దిగొచ్చిన రాహుల్‌

మీనాక్షి లేఖి ఫిర్యాదు: రాహుల్‌గాంధీకి సుప్రీం నోటీసులు

రాహుల్‌కు ఈసీ నోటీసుషాక్: 24 గంటల్లో వివరణ ఇవ్వాలి