న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీకి సుప్రీం కోర్టు సోమవారం నాడు నోటీసులు జారీ చేసింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీని చౌకీదార్ దొంగ అన్న వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.ఎన్నికల ప్రచార సభలతో పాటు, పలు మీడియా సమావేశాల్లో కూడ ప్రధానమంత్రి మోడీపై కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ చౌకీదారు దొంగ  అంటూ విమర్శలు గుప్పించారు.

చౌకీదారు దొంగ అనే వ్యాఖ్యలను సుప్రీంకోర్టు కూడ సమర్ధించిందని ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయమై బీజేపీ నేత మీనాక్షి లేఖి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.ఈ విషయమై సుప్రీంకోర్టులో ఈ పిటిషన్‌పై సోమవారం నాడు విచారణ చేసింది. ఈ వ్యాఖ్యల విషయమై వచ్చే సోమవారం లోపుగా వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు  ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

ఎన్నికల కమిషన్‌పై సుప్రీం అసంతృప్తి