Asianet News TeluguAsianet News Telugu

సూపర్ టెక్ ఫ్లాట్ కొనుగోలుదారులకు డ‌బ్బులు పూర్తిగా వాప‌స్ ఇవ్వాలి - సుప్రీంకోర్టు

నోయిడా ట్విట్ టవర్స్ లో ప్లాట్ కొనుగోలు చేసిన ప్రతీ ఒక్కరికి డబ్బులు రిఫండ్ చేయాలని సుప్రీంకోర్టు ఆ సంస్థను ఆదేశించింది. వచ్చే నెల 30వ తేదీ వరకు రూ.1 కోటిని సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో డిపాజిట్ చేయాలని పేర్కొంది. 

Super Tech flat buyers should be given full refund - Supreme Court
Author
First Published Aug 28, 2022, 4:48 PM IST

నోయిడాలోని రియల్‌ ఎస్టేట్‌ సంస్థ సూపర్‌టెక్‌కు చెందిన 40 అంతస్తుల జంట టవర్లను నేడు కూల్చేశారు. ఈ కూల్చివేత ప్రక్రియ అంతా రెప్పపాటులో పూర్తయ్యింది. ఈ కూల్చివేత‌కు ముందు అధికారులు అన్ని ఏర్పాట్లు ప‌క‌డ్బంధీగా చేశారు. ఆ ప్రాంతంలోని రోడ్లనుడ్ల మూసివేశారు. చుట్టుపక్కల ప్రజలను కూడా ఉద‌యం 7 గంట‌ల‌కే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరారు.

అయితే సూపర్‌టెక్‌ ట్విన్‌ టవర్స్‌లో ఫ్లాట్‌లు కొనుగోలు చేసేందుకు డబ్బులు చెల్లించి ఇంకా వాపసు పొందని వారి సంఖ్య అధికంగానే ఉంది. వాస్తవానికి, ట్విన్ టవర్స్ లో 711 మంది ఫ్లాట్లను కొనుగోలు చేశారు, అందులో 652 మందితో అన్ని డ‌బ్బులు సెటిల్ మెంట్ చేసేశారు. 59 మంది కస్టమస్టర్లకు ఇంకా ఎలాంటి డ‌బ్బులూ అంద‌లేదు.

'ఆజాద్ ఇప్ప‌డే స్వ‌తంత్రుడ‌య్యాడు.. కానీ, చాలా కాలం కిత్ర‌మే ఆమేథీకి విముక్తి ల‌భించింది'

దీనిపై ఇటీవల సుప్రీంకోర్టులో విచారణ కూడా జరిగింది. జ‌స్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ అంశాన్ని విచారిస్తూ సూపర్ టెక్ లో ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారికి పూర్తి డ‌బ్బులు చెల్లించాల‌ని ఆదేశించారు. అయితే వారికి కొంత చెల్లింపులు చేయ‌డానికి అయినా సెప్టెంబర్ 30లోగా ఐపీఆర్ ను సుప్రీంకోర్టు రిజిస్ట్రీ లో డిపాజిట్ చేయాలని పేర్కొంది. ఇదే స‌మ‌యంలో కొనుగోలుదారులకు సంబంధించి మొత్తం రూ.5.15 కోట్లు పెండింగ్ లో ఉన్నాయని పిటిషనర్ల తరఫు న్యాయవాది తెలిపారు. ఈ విషయమై సీఆర్ బీ, సూపర్ టెక్ అధికారుల‌తో చ‌ర్చించారు. 

ఈ కూల్చివేతకు ముందే ఆ ట‌వ‌ర్ల‌లో ప్లాట్ కొనుగోలు చేసిన వారికి ఎలాంటి న‌ష్టం క‌ల‌గ‌కుండా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ ట్విన్ ట‌వ‌ర్ల‌లో ప్లాట్ కొనుగోలుదారులు బిల్డర్ వద్ద డిపాజిట్ చేసిన పూర్తి మొత్తాన్ని వాపసు చేయిస్తామ‌ని సుప్రీంకోర్టు పేర్కొంది. దివాలా ప్రక్రియను ఎదుర్కొంటున్న ఆ సంస్థకు చెందిన మధ్యంతర రిజల్యూషన్ ప్రొఫెషనల్ (IRP)ని కూడా రిజిస్ట్రీలో రూ. 1 కోటి డిపాజిట్ చేయాలని కోరింది. 

అమికస్ క్యూరీ గౌరవ్ అగర్వాల్, అక్టోబర్ మొదటి వారంలో ఐఆర్‌పీతో కలిసి కూర్చుని గృహ కొనుగోలుదారుల బకాయిలను పరిష్కరిస్తారని, తదుపరి విచారణ తేదీలోపు వివరాలను సమర్పిస్తారని సుప్రీంకోర్టు పేర్కొంది. దీని వ‌ల్ల కొంత మొత్తాన్ని పంపిణీ చేయవచ్చని బెంచ్ తెలిపింది. కాగా.. 711 మంది కస్టమస్టర్లు ఈ ట్విన్ ట‌వ‌ర్ ల‌లో ఫ్లాట్లను బుక్ చేసుకున్నారు. అయితే సూపర్ టెక్ 652 మంది కస్టమస్టర్లకు బుకింగ్ డ‌బ్బులు, దానికి వ‌డ్గీని క‌లిపి అందించారు. మిగిలిన వారికి ఇంకా డ‌బ్బులు చేర‌లేదు. 

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక షెడ్యూల్ ఖరారు.. పూర్తి వివరాలు ఇవే..

ఢిల్లీలోని కుతుబ్ మినార్ కంటే కూడా ఎత్తైన ఈ సూపర్ టెక్ ట్విన్ టవర్స్ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని నోయిడా సెక్టార్ 93ఏలో నిర్మించారు. అక్కడి నివాసుల అభ్యంతరంతో ఈ టవర్‌ను కూల్చాల్సి వచ్చింది. ఈ ట్విన్ టవర్స్ నిర్మాణంపై వారు కోర్టుకు ఎక్కడంతో వారి అభ్యంతరాలు సమంజసం అయినవేనని కోర్టు భావించింది. ఈ ట్విన్ టవర్స్‌ను కూల్చేయాలని ఆదేశించింది. ఈ ట్విన్ టవర్స్ కూల్చివేతకు రూ. 20 కోట్లు ఖర్చు పెట్టారు. క్షణాల్లో ఈ ట్విన్ టవర్స్ నేలమట్టం అయింది. దుమ్ము దూళిగాలో క‌లిసిపోయింది. భారత దేశ చరిత్రలో ఇంత ఎత్తైన నిర్మాణాన్ని ఇది వరకు కూల్చివేసిన‌ట్టు రికార్డుల్లో లేదు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios