Asianet News TeluguAsianet News Telugu

'ఆజాద్ ఇప్ప‌డే స్వ‌తంత్రుడ‌య్యాడు.. కానీ, చాలా కాలం కిత్ర‌మే ఆమేథీకి విముక్తి ల‌భించింది'

గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. అమేథీ చాలా కాలం క్రితమే స్వతంత్రం అయిందని రాహుల్ గాంధీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

Smriti Irani says Azad Became Free Now, But Amethi Liberated Long Back
Author
First Published Aug 28, 2022, 4:24 PM IST

కాంగ్రెస్ పార్టీకి గులాం నబీ ఆజాద్ రాజీనామా చేసిన తర్వాత రాజకీయ వర్గాల్లో గుబులు రేగుతోంది. ఈ క్రమంలో గులాంనబీ ఆజాద్ రాజీనామాపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. కాంగ్రెస్, గాంధీ కుటుంబ స‌భ్యుల నాయకత్వంపై మంత్రి స్మృతి ఇరానీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గులాం నబీకి ఇప్పుడే నిజ‌మైనా విముక్తి లభించిందని, అయితే అమేథీకి చాలా కాలం క్రితం విముక్తి లభించిందని అన్నారు. 

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తన పార్లమెంటరీ నియోజకవర్గ ఆమేథీలో శ‌నివారం పర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా ఏర్పాటు చేసిన  మీడియా సమావేశంలో గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ నుంచి వైదొలగడం, కాంగ్రెస్ పార్టీ జోడో యాత్రపై విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకత్వం, గాంధీ కుటుంబ రాజ‌కీయం గురించి ప్ర‌త్యేకంగా వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదని అన్నారు.

అలాగే.. కాంగ్రెస్ నుంచి  గులాం న‌బీ ఆజాద్ వైదొల‌గడంపై రాహుల్ గాంధీని స్మృతి ఇరానీ ఎద్దేవా చేశారు. గులాం నబీకి ఇప్ప‌డే అస‌లైన స్వేచ్ఛ ల‌భించింద‌నీ, అయితే.. అమేథీ కి మాత్రం చాలా కాలం క్రితమే స్వతంత్ర ల‌భించింద‌ని అన్నారు. మునుపటి అమేథీకి,  నేటి అమేథీ మధ్య చాలా వ్యత్యాసం ఉంద‌ని, ఇంతకుముందు ఇక్కడి ప్రజలు  అధికారాన్ని తమ దౌర్జన్యంగా భావించేవారని, అయితే నేటి అమేథీలో అధికారమంటే..సేవా భావం భావ‌న ఏర్పడిందని స్మృతి ఇరానీ అన్నారు.

విశేషమేమిటంటే..  2019 లోక్‌సభ ఎన్నికల్లో అమేథీ పార్లమెంట్ స్థానం నుంచి రాహుల్ గాంధీ పోటీ చేసి..బీజేపీ స్మృతి ఇరానీ చేతిలో ఓట‌మి పాల‌య్యారు. అప్ప‌టి వ‌ర‌కూ అమేథీ గాంధీ కుటుంబానికి కంచుకోట‌గా ఉండేది. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ప్రాతినిధ్యం వహించారు.

అంతకుముందు.. గులాం న‌బీ ఆజాద్ రాజీనామాపై కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ.. చివరకు గులాం నబీ కూడా తనను తాను విముక్తి చేసుకున్నాడు. కాంగ్రెస్‌కు సంబంధించినంత వరకు, దాని అంతర్గత స్థితి ఏమిటో స్పష్టంగా తెలుస్తుందనీ, బీజేపీ  కార్యకర్త, సానుకూల ఆలోచన, భావజాలంతో అభివృద్ధి, పురోగతిలో నిమగ్నమై ఉంటుంది. కానీ ఖచ్చితంగా గులాం నబీ జీ కూడా చివరికి ఆజాద్ అయ్యాడని అన్నారు. 2020లో కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పినా సింధియా  బీజేపీలో చేరని విష‌యం తెలిసిందే.

ఆజాద్ ఆరోప‌ణ‌లు

ఆజాద్ శుక్రవారం పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో సహా అన్ని పదవులకు రాజీనామా చేశారు. అంతర్గత ఎన్నికల పేరుతో పార్టీ పెద్ద ఎత్తున ద్రోహం చేసిందని ఆరోపించారు. పార్టీ మారాలని డిమాండ్ చేస్తున్న G-23 గ్రూపులో భాగమైన ఆజాద్ మాట్లాడుతూ.. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC)ని నడుపుతున్న కొంతమంది వ్యక్తులచే నియంత్రించబడుతున్న కాంగ్రెస్ భారతదేశానికి సంబంధించిన సమస్యలపై పోరాడే సంకల్పం, సామర్థ్యాన్ని కోల్పోయిందని అన్నారు. 'భారత్ జోజో యాత్ర' కంటే ముందే పార్టీ నాయకత్వం 'కాంగ్రెస్ జోడో యాత్ర' చేపట్టి ఉండాల్సిందని ఆయన లేఖలో పేర్కొన్నారు. పార్టీ బలహీనతలను దృష్టిలో ఉంచుకుని లేఖలు రాసిన 23 మంది నేతలను దుర్భాషలాడారని, అవమానించారని ఆజాద్ అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios