నేటి వార్తల్లోని ముఖ్యాంశాలివే

Sunday 25th September Telugu News Live

తెలుగు రాష్ట్రాల్లోని తాజా వార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, క్రీడా, సినీ, క్రైమ్, బిజినెస్ వార్తలను ఎప్పటికప్పుడు ఏషియానెట్ తెలుగు లైవ్ అఫ్ డేట్స్ ద్వారా అందిస్తున్నాం. జస్ట్ వన్ క్లిక్‌తో నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు మీ కోసం...

10:05 PM IST

రాజస్థాన్‌లో హైడ్రామా

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల వేళ రాజస్థాన్ రాజకీయాల్లో హైడ్రామా నెలకొంది. కాంగ్రెస్ చీఫ్‌గా అశోక్ గెహ్లాట్ ఎన్నికైతే... ఆయన స్థానంలో ఎవరిని ముఖ్యమంత్రిని చేయాలనే దానిపై సీఎల్పీ సమావేశం జరగనుంది. అయితే దీనికి ముందే రాష్ట్రంలో పరిణామాలు వేరు వేరుగా మారిపోతున్నాయి

9:03 PM IST

భారత్ లక్ష్యం 187

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో భారత్ - ఆస్ట్రేలియాల మధ్య జరుగుతోన్న మూడో టీ20లో ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. 

8:23 PM IST

పెరిగిన భారత రక్షణ ఉత్పత్తులు

గడిచిన ఐదేళ్లలో రక్షణ రంగ ఎగుమతులు 334 శాతం మేరకు పెరిగాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పరస్పర సమన్వయంతో కలిసి పని చేయడం ద్వారా భారత్ ఇప్పుడు సుమారు 75 దేశాలకు ఈ రక్షణ ఎగుమతులు చేస్తున్నట్టు ప్రభుత్వం ఆదివారం తెలిపింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఈ విషయాన్ని ఓ ట్వీట్‌లో వెల్లడించింది.

7:45 PM IST

బతుకమ్మ ఆడిన తమిళిసై

రాజ్‌భవన్‌లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొన్నారు. ఆడపడుచులతో కలిసి బతుకమ్మల చుట్టూ చేరి ఉయ్యాల పాటలు పాడారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. 
 
6:56 PM IST

ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగుతున్న భారత్ - ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్ ఒక మార్పు చేసింది. రిషబ్ పంత్ స్థానంలో భువనేశ్వర్ కుమార్ జట్టులోకి వచ్చాడు.

6:19 PM IST

బంగ్లాదేశ్‌లో పడవ ప్రమాదం.. 24 మంది మృతి

బంగ్లాదేశ్‌లో ఘోర పడవ ప్రమాదం సంభవించింది. పంచ్‌గఢ్‌ జిల్లాలో కరాటోవ నదిలో పడవ మునిగి 24 మంది మరణించగా.. మరో 30 మంది గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. పరిమితికి మించి ప్రయాణికులు పడవను ఎక్కడం వల్లే ఈ ఘటన జరిగిందని పోలీసులు చెబుతున్నారు. 
 
5:26 PM IST

భారత్- ఆస్ట్రేలియా మ్యాచ్‌ను వీక్షించనున్న తమిళిసై

ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్ - ఆస్ట్రేలియాల మధ్య జరగనున్న టీ20 మ్యాచ్‌ను తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ వీక్షించనున్నారు. బతుకమ్మ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆమె నేరుగా ఉప్పల్‌ స్టేడియానికి చేరుకోనున్నారు. 
 
3:25 PM IST

భారత్ - ఆసీస్ మ్యాచ్‌పై బెట్టింగ్‌లు

ఉప్పల్‌లో జరగనున్న భారత్ - ఆస్ట్రేలియా చివరి టీ 20 మ్యాచ్‌పై భారీగా బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. ఆసీస్ గెలుస్తుందని రూ.1000కి 4 వేలు , టాస్ ఇండియానే గెలుస్తుందని బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. మరోవైపు బెట్టింగ్ యాప్‌లు, బెట్టింగ్ రాయుళ్లపై పోలీసులు నిఘా పెట్టారు. 

2:49 PM IST

ఐరాసలో భారత్‌కు అండగా నిలిచిన రష్యా

ఐక్యరాజ్యసమితిలో భారత్‌కు మరోసారి రష్యా అండగా నిలిచింది. భారత్‌కు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వంపై రష్యా తన మద్ధతును ప్రకటించింది. ఈ మేరకు ఐరాస సర్వప్రతినిధి సభలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ప్రకటించారు. భారత్‌తో పాటు బ్రెజిల్‌కు కూడా శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని ఆయన కోరారు. 

1:43 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ పై వైఎస్ షర్మిల ఫైర్

 తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్సార్ టిపి అధినేత్రి వైఎస్ షర్మిల విరుచుకుపడ్డారు. ఊసరవెల్లిలా రంగులుమార్చే కేసీఆర్ పచ్చి మోసగాడని షర్మిల అన్నారు. సంగారెడ్డి జిల్లాలో మహాప్రస్థాన పాదయాత్ర చేపట్టిన షర్మిల ప్రజలతో ముచ్చటిస్తూ సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. 

12:58 PM IST

హాస్పిటల్లో చేరిన కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణా

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణా అనారోగ్యంతో హాస్పిటల్లో చేరారు. బెంగళూరులోని మణిపాల్ హాస్పిటల్లో మాజీ ముఖ్యమంత్రి చికిత్స పొందుతున్నారు. 
 
12:15 PM IST

చండీఘడ్ విమానాశ్రయానికి భగత్ సింగ్ పేరు..: ప్రధాని మోదీ ప్రకటన

చండీఘడ్ విమానాశ్రయానికి భారత స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ పేరు పెడుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన భగత్ సింగ్ కు నివాళిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రధాని ప్రకటించారు. 

11:17 AM IST

ప్రశ్నించిన వ్యక్తిని దుర్భాషలాడిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే

మెదక్ జిల్లా నర్సాపూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఓ వ్యక్తిని అసభ్యంగా దూషించాడు. కళ్యాణ లక్ష్మి డబ్బులు రాలేవని అడిగిన వ్యక్తిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేసారు. తననే ప్రశ్నిస్తావా అంటూ లబ్దిదారున్ని దూషించడమే కాదు జైల్లో పెట్టాలని పోలీసులకు ఎమ్మెల్యే ఆదేశించారు. 
 
10:23 AM IST

అంతర్జాతీయ క్రికెట్ కు జులన్ గుడ్ బై

టీమిండియా వుమెన్ క్రికెటర్ జులన్ గోస్వామి అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. ఇంగ్లాండ్ తో జరిగిన మూడో వన్డేలోనూ విజయం సాదించిన సీరిస్ ను 3-0 తో కైవసం చేసుకున్న భారత జట్టు జులన్ కు ఘనంగా వీడ్కోలు పలికింది. ఇలా ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో చివరి వన్డే మ్యాచ్ ఆడింది జులన్. 

Read More  Jhulan Goswami: చెక్డా టు లార్డ్స్.. జయహో జులన్.. ఆ ప్రయాణం ఆద్యంతం స్ఫూర్తివంతమే..

9:11 AM IST

రేణిగుంట హాస్పిటల్లో అగ్నిప్రమాదం... డాక్టర్ ఇంట్లోని ఇద్దరు చిన్నారులు మృతి

తిరుపతి జిల్లా రేణిగుంట పట్టణంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. హాస్పిటల్ పై అంతస్తులో నివాసముంటున్న డాక్టర్ కుటుంబంలోని ఇద్దరు చిన్నారులు ఈ మంటల్లో చిక్కుకుని మృతిచెందగా ఇద్దరిని రెస్క్యూ బృందాలు కాపాడాయి. 

9:05 AM IST

సిరియా తీరంలో ఘోరం... జలసమాధైన 77మంది వలసదారులు

సిరియా తీరంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తమ దేశంలో తీవ్ర సంక్షోభం నేపథ్యంలో లెబనాన్ కు చెందిన 150 మంది మధ్యధరా సముద్రం గుండా ఓ పడవలో సిరియాకు బయలుదేరారు. అయితే మరికొద్దిసేపట్లో గమ్యానికి చేరుతారనగా సిరియా తీరంలో పడవ సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 77 మంది మృతిచెందగా మిగతావారిలో కొందరు గల్లంతవగా మరికొందరు ప్రాణాలతో బయటపడ్డారు. 
 
10:05 PM IST:

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల వేళ రాజస్థాన్ రాజకీయాల్లో హైడ్రామా నెలకొంది. కాంగ్రెస్ చీఫ్‌గా అశోక్ గెహ్లాట్ ఎన్నికైతే... ఆయన స్థానంలో ఎవరిని ముఖ్యమంత్రిని చేయాలనే దానిపై సీఎల్పీ సమావేశం జరగనుంది. అయితే దీనికి ముందే రాష్ట్రంలో పరిణామాలు వేరు వేరుగా మారిపోతున్నాయి

9:03 PM IST:

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో భారత్ - ఆస్ట్రేలియాల మధ్య జరుగుతోన్న మూడో టీ20లో ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. 

8:23 PM IST:

గడిచిన ఐదేళ్లలో రక్షణ రంగ ఎగుమతులు 334 శాతం మేరకు పెరిగాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పరస్పర సమన్వయంతో కలిసి పని చేయడం ద్వారా భారత్ ఇప్పుడు సుమారు 75 దేశాలకు ఈ రక్షణ ఎగుమతులు చేస్తున్నట్టు ప్రభుత్వం ఆదివారం తెలిపింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఈ విషయాన్ని ఓ ట్వీట్‌లో వెల్లడించింది.

7:45 PM IST:

రాజ్‌భవన్‌లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొన్నారు. ఆడపడుచులతో కలిసి బతుకమ్మల చుట్టూ చేరి ఉయ్యాల పాటలు పాడారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. 
 
7:18 PM IST:

ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగుతున్న భారత్ - ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్ ఒక మార్పు చేసింది. రిషబ్ పంత్ స్థానంలో భువనేశ్వర్ కుమార్ జట్టులోకి వచ్చాడు.

6:19 PM IST:

బంగ్లాదేశ్‌లో ఘోర పడవ ప్రమాదం సంభవించింది. పంచ్‌గఢ్‌ జిల్లాలో కరాటోవ నదిలో పడవ మునిగి 24 మంది మరణించగా.. మరో 30 మంది గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. పరిమితికి మించి ప్రయాణికులు పడవను ఎక్కడం వల్లే ఈ ఘటన జరిగిందని పోలీసులు చెబుతున్నారు. 
 
5:26 PM IST:

ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్ - ఆస్ట్రేలియాల మధ్య జరగనున్న టీ20 మ్యాచ్‌ను తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ వీక్షించనున్నారు. బతుకమ్మ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆమె నేరుగా ఉప్పల్‌ స్టేడియానికి చేరుకోనున్నారు. 
 
3:25 PM IST:

ఉప్పల్‌లో జరగనున్న భారత్ - ఆస్ట్రేలియా చివరి టీ 20 మ్యాచ్‌పై భారీగా బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. ఆసీస్ గెలుస్తుందని రూ.1000కి 4 వేలు , టాస్ ఇండియానే గెలుస్తుందని బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. మరోవైపు బెట్టింగ్ యాప్‌లు, బెట్టింగ్ రాయుళ్లపై పోలీసులు నిఘా పెట్టారు. 

2:49 PM IST:

ఐక్యరాజ్యసమితిలో భారత్‌కు మరోసారి రష్యా అండగా నిలిచింది. భారత్‌కు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వంపై రష్యా తన మద్ధతును ప్రకటించింది. ఈ మేరకు ఐరాస సర్వప్రతినిధి సభలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ప్రకటించారు. భారత్‌తో పాటు బ్రెజిల్‌కు కూడా శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని ఆయన కోరారు. 

1:43 PM IST:

 తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్సార్ టిపి అధినేత్రి వైఎస్ షర్మిల విరుచుకుపడ్డారు. ఊసరవెల్లిలా రంగులుమార్చే కేసీఆర్ పచ్చి మోసగాడని షర్మిల అన్నారు. సంగారెడ్డి జిల్లాలో మహాప్రస్థాన పాదయాత్ర చేపట్టిన షర్మిల ప్రజలతో ముచ్చటిస్తూ సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. 

12:58 PM IST:

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణా అనారోగ్యంతో హాస్పిటల్లో చేరారు. బెంగళూరులోని మణిపాల్ హాస్పిటల్లో మాజీ ముఖ్యమంత్రి చికిత్స పొందుతున్నారు. 
 
12:15 PM IST:

చండీఘడ్ విమానాశ్రయానికి భారత స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ పేరు పెడుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన భగత్ సింగ్ కు నివాళిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రధాని ప్రకటించారు. 

11:17 AM IST:

మెదక్ జిల్లా నర్సాపూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఓ వ్యక్తిని అసభ్యంగా దూషించాడు. కళ్యాణ లక్ష్మి డబ్బులు రాలేవని అడిగిన వ్యక్తిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేసారు. తననే ప్రశ్నిస్తావా అంటూ లబ్దిదారున్ని దూషించడమే కాదు జైల్లో పెట్టాలని పోలీసులకు ఎమ్మెల్యే ఆదేశించారు. 
 
10:24 AM IST:

టీమిండియా వుమెన్ క్రికెటర్ జులన్ గోస్వామి అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. ఇంగ్లాండ్ తో జరిగిన మూడో వన్డేలోనూ విజయం సాదించిన సీరిస్ ను 3-0 తో కైవసం చేసుకున్న భారత జట్టు జులన్ కు ఘనంగా వీడ్కోలు పలికింది. ఇలా ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో చివరి వన్డే మ్యాచ్ ఆడింది జులన్. 

Read More  Jhulan Goswami: చెక్డా టు లార్డ్స్.. జయహో జులన్.. ఆ ప్రయాణం ఆద్యంతం స్ఫూర్తివంతమే..

9:11 AM IST:

తిరుపతి జిల్లా రేణిగుంట పట్టణంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. హాస్పిటల్ పై అంతస్తులో నివాసముంటున్న డాక్టర్ కుటుంబంలోని ఇద్దరు చిన్నారులు ఈ మంటల్లో చిక్కుకుని మృతిచెందగా ఇద్దరిని రెస్క్యూ బృందాలు కాపాడాయి. 

9:05 AM IST: