Asianet News TeluguAsianet News Telugu

రూ. 200 కోట్ల స్కామ్.. కేంద్ర మంత్రులు, పార్టీ ఫండ్ పేరిట వసూళ్లు.. సంచలనాల కేసు

సుకేశ్ చంద్రశేఖర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రూ. 200 కోట్లు వసూలు చేసిన కేసు సహా పలు కేసుల్లో ఆయన జైలులో ఉన్నాడు. కేంద్ర మంత్రి అమిత్ షా, మాజీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ల పేర్లు చెప్పి పార్టీ ఫండ్‌కు డబ్బు ఇవ్వాల్సిందిగా ఫోన్‌లో డిమాండ్ చేశాడు.. అలా చేస్తేనే తన భర్తకు బెయిల్ ఇప్పిస్తామని నమ్మబలికాడు. 
 

sukesh used union ministers names.. called for party fund in 200 cr scam
Author
New Delhi, First Published Nov 14, 2021, 1:53 PM IST

న్యూఢిల్లీ: ఆ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ. 200 కోట్ల స్కామ్(200 Crore Scam) చేశాడు. దీనికోసం కేంద్ర మంత్రుల పేర్లనే వాడాడు. ఫోన్‌లో మాట్లాడుతూ కేంద్ర హోం మంత్రి(Union Ministers) వింటున్నాడు.. జగ్రత్త అంటూ బెదిరించి మరీ సొమ్ము లాక్కున్నాడు. Party Fundకు ఇవ్వాలనీ డిమాండ్ చేసి డబ్బు గుంజాడు. బాలీవుడ్ సెలెబ్రిటీలను ప్రశ్నించడానికి పిలిచిన ఈ కేసులో ప్రధాన నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్. జైలులో ఉన్నప్పుడే ఇంత మొత్తాన్ని తన నెట్‌వర్క్ ద్వారా Sukesh Chandrashekar కైవసం చేసుకున్నాడు. తోటి ఖైదీనే మోసం చేశాడు. ఆ ఖైదీ భార్యను అప్రోచ్ అయి.. తన భర్తకు బెయిల్ ఇప్పిస్తానని మోసం చేసి ఈ డబ్బు వసూలు చేశాడు.

సుకేశ్ చంద్రశేఖర్ చదివింది 12వ తరగతే. కానీ, మోసాల్లో తనది అందెవేసిన చేయి. హై ఎండ్ టెక్నాలజీని వాడుతూ మోసాలకు పాల్పడ్డాడు. నేర సామ్రాజ్యంలోకి 17ఏళ్లలోనే ప్రవేశించాడు. 17ఏళ్ల వయసులోనే తొలిసారి 2007లో అరెస్టు అయ్యాడు. ఓ బిజినెస్‌మెన్‌ను రూ. 1.15 కోట్లు చీట్ చేసి జైలుకెళ్లాడు. మూడేళ్ల తర్వాత యాక్టర్ లీనా పాల్‌ను కలిశాడు. ఐదేళ్ల తర్వా పెళ్లి చేసుకున్నాడు. కానీ, లీనా పాల్ లైఫ్‌స్టైల్‌కు కావాల్సినవి సమకూర్చి పెట్టడానికి సులువుగా డబ్బు సంపాదించే మార్గాల కోసం ప్రయత్నించాడని, తర్వాత లీనా కూడా తన నేరాల్లో భాగస్వామ్యం పంచుకున్నట్టు సుకేశ్ పోలీసులకు వెల్లడించారు.

Also Read: మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌పై ఈడీ ప్రశ్నలు.. 5 గంటలపాటు విచారణ

మాజీ ఫోర్టిస్ హెల్త్‌కేర్, ర్యాన్‌బాక్సీ ల్యాబ్ ప్రమోటర్లు శివిందర్, మల్విందర్ సింగ్ కుటుంబాన్ని సుకేశ్ చీట్ చేసి రూ. 200 కోట్లను వసూలు చేశాడు. శివిందర్ సింగ్‌ను సుకేశ్ తొలిసారి తిహార్ జైలులో కలిశాడు. శివిందర్‌కు బెయిల్ ఇప్పిస్తాననే మాటతో ఆయన కుటుంబాన్ని మోసం చేయాలనే ప్లాన్ అక్కడే మొదలైంది. శివిందర్ సింగ్ సతీమణి అదితీ సింగ్‌కు గతేడాది జూన్ 15న సుకేశ్ తొలిసారి ఫోన్ చేశాడు. హై టెక్నాలజీ యాప్‌లు వాడుతూ తన ఫోన్ నెంబర్ స్థానంలో ప్రముఖుల ల్యాండ్‌లైన్ నెంబర్లు వచ్చేలా ప్లాన్ చేశాడు. ఆ ఫోన్ కాల్‌లో తనను తాను కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి అనూప్ కుమార్‌గా పరిచయం చేసుకుని ఆమె భర్తకు బెయిల్ ఇవ్వడానికి ఉన్నతాధికారుల సూచనల మేరకు కాల్ చేస్తున్నట్టు ఆమెను ట్రాప్‌లో ఇరికించాడు. ఆ కాల్ నిజమని నమ్మగానే పార్టీ కోసం ఫండ్ ఇవ్వాల్సిందిగా ఆమె నుంచి డిమాండ్ చేశాడు. 

అదే యాప్‌తో ఆగస్టు 19న మరోసారి కాల్ చేశాడు. ఈసారి అప్పటి కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇంటి నుంచి ల్యాండ్‌లైన్ కాల్ వచ్చినట్టుగా నమ్మించాడు. తర్వాతి రోజే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇంటి నుంచి ఫోన్ వచ్చినట్టు యాప్ ద్వారా మోసం చేశాడు. అంతేకాదు, ఈ ఫోన్ సంభాషణ కేంద్ర హోం మంత్రి అమిత్ షా వింటున్నాడని, జాగ్రత్తగా మాట్లాడాలని సూచనలూ చేశాడు. ఫోన్ కాల్ అయిపోగానే చివరన జై హింద్ అని ముగించేవాడు. జూన్ 2020 నుంచి ఆగస్టు 2021 వరకు సుకేశ్ చంద్రశేఖర్ రూ. 201.75 కోట్ల సొమ్మును వసూలు చేశాడు.  

Also Read: ఎట్టకేలకు ఈడీ ముందుకు జాక్వెలిన్.. రూ.200 కోట్ల చీటింగ్ లో అతడి నుంచి లగ్జరీ కారు, షాకింగ్

జైలులో ఉన్న యూనిటెక్ ప్రమోటర్ సంజయ్ చంద్ర పరిచయం చేసిన హవాలా నెట్‌వర్క్ ద్వారా ఆ సొమ్మను తన వద్దకు తెచ్చుకున్నాడు. చంద్ర పరిచయం చేసిన దీపక్ రమ్నాని.. ఆ డబ్బును 53 షెల్ కంపెనీల ద్వారా ట్రాన్స్‌ఫర్ చేయాల్సిందిగా అవతార్ సింగ్‌ కొచార్‌ను ఆదేశించాడు. రూ. 90 కోట్ల నుంచి రూ. 100 కోట్ల వరకు విదేశాలకు పంపాడని, రూ. 10 నుంచి 12 కోట్ల వరకు పూణె, చెన్నై, హైదరాబాద్‌లకు పంపినట్ట కొచార్ పోలీసులకు తెలియజేశాడు. ఇందులో కొంత మొత్తాన్ని క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేసినట్టు సుకేశ్ పోలీసులకు తెలిపాడు. మరికొన్నింటిని చెన్నైలోని బంగ్లాను కొనడానికి, విలాసవంతమైన కార్లు కొనడానికి ఖర్చు చేసినట్టు వివరించాడు.

Follow Us:
Download App:
  • android
  • ios