ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులోని సౌత్ గ్రూప్ తో సంబంధాలు ఉన్నాయని మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుఖేష్ చంద్రశేఖర్ అన్నారు. తన మాటలను నిరూపించేందుకు నార్కో టెస్టుకైనా సిద్ధమని తెలిపారు.
మనీలాండరింగ్ కేసులో నిందితుడు, పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సుఖేష్ చంద్రశేఖర్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయంలో తాను నార్కో టెస్ట్, పాలిగ్రాఫ్ చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఆ తర్వాత చట్టమే ఏం చేయాలో నిర్ణయిస్తుందని అన్నారు. ‘‘అప్పుడు నేనేమీ మాట్లాడను. చట్టాన్నే నిర్ణయించనివ్వండి.. 2015 - 2023 వరకు నేను నా ప్రతీ ప్రకటనకు సాక్ష్యాలు, ఆధారాలు ఇస్తున్నాను’’ అని ఆయన పేర్కొన్నారు.
అయోధ్య రామమందిరం అంశాన్ని కోర్టులో కాంగ్రెస్ పొడిగిస్తూ వచ్చింది.. అప్పుడే మోడీ వచ్చారు.. - అమిత్ షా
ప్రస్తుతం జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ జైలు నుంచి తన న్యాయవాది అనంత్ మాలిక్ ద్వారా ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారని వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’ నివేదించింది. అందులో అరవింద్ కేజ్రీవాల్ పై, బీఆర్ఎస్ పై అనేక ఆరోపణలు చేశారు. తనకు, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ కేజ్రీవాల్‌కు మధ్య జరిగిన చాట్‌ల స్క్రీన్‌షాట్‌లు ఉన్నాయని సుకేష్ పేర్కొన్నాడు. ఆ చాట్‌లు టీఆర్ఎస్ కార్యాలయానికి రూ. 15 కోట్ల డెలివరీకి సంబంధించినవని తెలిపారు. అవి కేజ్రీవాల్ సూచనలు, అంగీకారం, ధృవీకరణలు చూపిస్తాయని తెలిపారు. కేజ్రీవాల్, సత్యేందర్ జైన్‌తో సహా ఆప్ నేతలు తనకు సూచనలిచ్చారని సుఖేష్ చంద్రశేఖర్ ఆరోపించారు.
తక్కువ చదువుకున్న ప్రధాని దేశానికి ప్రమాదకరం - ఆప్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా
‘‘లిక్కర్ గేట్‌లో విచారణలో ఉన్న సౌత్ గ్రూప్, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) లీడర్‌తో మీ (కేజ్రీవాల్) అనుబంధాన్ని చాట్ స్పష్టంగా చూపిస్తుంది. అలాగే టీఆర్ఎస్ లీడర్ 15 ఆర్డర్ డెలివరీ ఎలా ఉందో చాట్ చూపిస్తుంది.’’ అని సుకేష్ చంద్రశేఖర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అరవింద్ కేజ్రీవాల్ తో మొత్తం 700 పేజీల వాట్సాప్, టెలిగ్రామ్ చాట్లు తన వద్ద ఉన్నాయని, 2020లో టీఆర్ఎస్ కార్యాలయానికి రూ.75 కోట్లు అందజేశానని సుఖేష్ తెలిపారు.
గౌతమ్ అదానీకి చైనా సంస్థతో, పౌరులతో సంబంధాలున్నాయ్ - కాంగ్రెస్ సంచలన ఆరోపణలు
కాగా.. ఇటీవల సుకేష్ చంద్రశేఖర్ కోర్టు హాజరు సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కేజ్రీవాల్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైందని, త్వరలో కేజ్రీవాల్‌ను తీహార్ క్లబ్‌లో స్వాగతిస్తానని అన్నారు. అలాగే వచ్చే వారం తాను కేజ్రీవాల్ కు సంబంధించిన ఓ పెద్ద విషయం బయటపెడతానని తెలిపారు.
