భారత వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీకి చైనా కంపెనీతో, అక్కడి పౌరులతో సంబంధాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. గౌతమ్ అదానీ చేపట్టిన అనేక కీలక ప్రాజెక్టుల్లో చైనా సంస్థతో వ్యాపార సంబంధాలు ఉన్నాయని తెలిపింది. 

గౌతమ్ అదానీ, ఆయన సంస్థపై కొంత కాలంగా విమర్శలు చేస్తూ వస్తున్న కాంగ్రెస్ పార్టీ.. తాజాగా మరింత సంచలన ఆరోపణలు చేసింది. భారత వ్యాపార దిగ్గజానికి చైనా కంపెనీతో, అక్కడి పౌరులతో సంబంధాలు ఉన్నాయిని పేర్కొంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో చైనా కంపెనీ, పౌరులతో ఆదానీకి వ్యాపార సంబంధాలు ఉన్నాయని తెలిపారు. 

పరువు హత్య : పెళ్లి కాకుండానే గర్భవతైందని.. కూతురిని చంపి, నదిలో విసిరేసిన తండ్రి.. !

రోడ్లు, రైల్వేలు, ఓడరేవులు, విమానాశ్రయాల రంగాల్లోని అన్ని మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో అదానీ గ్రూప్ నకు చైనా సంస్థతో వ్యాపార సంబంధాలు ఉన్నాయని జైరాం రమేష్ ఆరోపించారు. ఇది దేశ భద్రతకు ముప్పుగా పరిణమించిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘చైనాపై ప్రధాని మౌనానికి కారణం ప్రతిరోజూ స్పష్టమవుతోంది. చైనాతో అదానీకి ఉన్న సన్నిహిత సంబంధాలే ఇందుకు ప్రధాన కారణం. ‘హమ్ అదానీకే హై కౌన్’ సిరీస్ లో మార్చి 3న ఈ విషయాన్ని ప్రస్తావించాం. నేడు మరిన్ని విషయాలు వెల్లడయ్యాయి’’ అని అన్నారు.

చదవలేక పారిపోయాడు.. సరిహద్దు దాటి పాక్ నుంచి ఇండియాలో అడుగుపెట్టాడు.. తర్వాత ఏం జరిగిందంటే?

ఇది దేశ వ్యతిరేక చర్య - సుప్రియా శ్రీనాటే
ఇంత వరకు ప్రధాని మోడీకి మాత్రమే చైనాతో సంబంధాలు ఉన్నాయని అనుకున్నామని, కానీ ఇప్పడు ఆయన స్నేహితుడి అదానీకి కూడా సంబంధాలు ఉన్నాయని తెలిసిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాటే ఆరోపించారు. గురువారం ఆమె ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. అదానీకి చెందిన పలు ప్రాజెక్టుల్లో చైనా సంస్థ పాలుపంచుకుందని, వీటిలో చాలా ప్రాజెక్టులు వ్యూహాత్మకంగా ముఖ్యమైనవని అన్నారు. అదానీ గ్రూప్, చైనా కంపెనీ సహకారంతో దేశంలోని మౌలిక సదుపాయాల్లో జోక్యం చేసుకుంటోందని, ఇది దేశ వ్యతిరేక చర్య అని తెలిపారు. 

Scroll to load tweet…

ఆ చైనీస్ సంస్థ పేరు ‘పీఎంసీ ప్రాజెక్ట్స్’ అని, అది అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఆధ్వర్యంలో కొనసాగుతుందని ఆమె ఆరోపించారు. ఈ కంపెనీకి చైనా పౌరుడైన మోరిస్ చాంగ్ యాజమానిగా ఉన్నారని తెలిపారు. మోరిస్ చాంగ్ తండ్రి చాంగ్ చుంగ్-లింగ్.. గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీకి దగ్గరి మిత్రుడని, వ్యాపార భాగస్వామి అని ఆరోపించారు. కాగా.. కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ ఆరోపణలపై అదానీ గ్రూప్ నుంచి ఇంకా ఎలాంటి స్పందనా రాలేదు.