ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు అయి, జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మాజీ డిప్యూటీ సీఎం ఓ లేఖ విడుదల చేశారు. అందులో ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్హతలపై విమర్శలు గుప్పించారు. 

తక్కువగా చదువుకున్న వ్యక్తి ప్రధానిగా ఉండటం దేశానికే ప్రమాదకరం అని ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జైలులో రిమాండ్ లో ఉన్న ఆయన ఓ లేఖ విడుదల చేశారు. అందులో విద్య ప్రాముఖ్యత దేశానికి అర్థం కావడం లేదని, సైన్స్ కూడా అర్థం చేసుకోవడం లేదని అందులో ఆరోపించారని ‘టైమ్స్ నౌ’ నివేదించింది. గత కొన్నేళ్లలో 60 వేల పాఠశాలలు ఆయన పేర్కొన్నారు. భారతదేశ పురోగతికి విద్యావంతులైన ప్రధాని ఉండాల్సిన అవసరం ఉందని మనీష్ సిసోడియా అన్నారు.

ప్రధానిని పొగడాలని నాకెవరూ చెప్పలేదు.. నా మనసులో ఉన్నది మాట్లాడాను - పద్మ అవార్డు గ్రహీత క్వాద్రీ

ఇప్పుడు రద్దు అయిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22 రూపకల్పన, అమలులో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై సిసోడియాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్టు చేసిన తరువాత ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఆయనను ఈ ఏడాది ఫిబ్రవరి 26వ తేదీన అరెస్టు చేశారు.

Scroll to load tweet…

విద్యార్హతలపై ప్రశ్నలు గుప్పిస్తున్న ఆప్ 
కాగా.. గత కొంత కాలంగా ప్రధాని విద్యార్హతలపై ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. విచారణ జరిపితే నరేంద్ర మోడీ డిగ్రీలు నకిలీవని తేలిపోతుందని అంటున్నారు. మోడీ డిగ్రీకి సంబంధించిన సమాచారాన్ని కేజ్రీవాల్ కు అందించాలని గుజరాత్ విశ్వవిద్యాలయాన్ని కోరిన కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) ఉత్తర్వులను గుజరాత్ హైకోర్టు కొట్టివేసినప్పటి నుండి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆ పార్టీకి చెందిన నేతలు ప్రధాని మోడీపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. 

గౌతమ్ అదానీకి చైనా సంస్థతో, పౌరులతో సంబంధాలున్నాయ్ - కాంగ్రెస్ సంచలన ఆరోపణలు

ఇటీవల అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. నిరక్షరాస్యులుగా ఉండటం నేరం కాదని, వనరుల కొరత కారణంగా చాలా మంది విద్యార్థులు నాణ్యమైన విద్యకు దూరంగా ఉంటున్నారని అన్నారు. కానీ ప్రస్తుతం దేశానికి చదువుకున్న ప్రధాని అవసరమని, ఒక ప్రధాని ఒక్క రోజులో వందల నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ప్రధానికి చదువు లేకపోతే ఆయన చుట్టూ ఉన్న అధికారులు ఆయనను ప్రభావితం చేస్తారని ఆయన అన్నారు. నోట్లరద్దు దేశాన్ని కుదిపేసిందని, దేశాభివృద్ధిని పదేళ్ల ముందుకు తీసుకెళ్లిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని చదువుకొని ఉంటే నోట్ల రద్దు ఎప్పటికీ అమలు అయ్యేది కాదన్నారు.