ఆర్థిక మోసాల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సుఖేశ్ చంద్రశేఖర్ ఢిల్లీ సీఎంపై సంచలన ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్ కు ఢిల్లీలో మూడు ఫ్లాట్లు ఉన్నాయని, వాటిని ఇప్పుడు అమ్మాలని చూస్తున్నారని ఓ లేఖలో ఆరోపించారు.
పలు ఆర్థిక మోసాలకు పాల్పడి ఢిల్లీలోని మండోలీ జైలులో శిక్ష అనుభవిస్తున్న సుఖేష్ చంద్రశేఖర్ మరో బాంబు పేల్చాడు. ఈ సారి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై సంచలన ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్ కు దుబాయ్ లో మూడు ఫ్లాట్లు ఉన్నాయని ఆరోపిస్తూ ఓ లేఖ విడుదల చేశారు. తనకు వచ్చిన కమీషన్ డబ్బుతో కేజ్రీవాల్ తరఫున తాను ఈ ఫ్లాట్లు కొన్నానని చంద్రశేఖర్ పేర్కొన్నారు.
అమానవీయం..రైల్వే ప్లాట్ ఫామ్ పై నిద్రపోతున్న ప్రయాణికులపై నీళ్లు పోసిన పోలీసు.. వీడియో వైరల్
''కేజ్రీవాల్ జీ, 2020లో హైదరాబాద్ లోని ఫార్మా కాంట్రాక్టర్ నుంచి మీరు అందుకున్న కమీషన్లతో నా ద్వారా కొనుగోలు చేసిన జుమైరా పామ్స్ లో ని మూడు అపార్ట్మెంట్లను అత్యవసరంగా 65 మిలియన్ దిర్హామ్స్ (ఏఈడీ)కు అమ్మమని మీరు దుబాయ్ లోని మీ సహచరుడు మనోజ్ జైన్ను కోరినట్లు నాకు తెలిసింది.’’ అని అందులో సుఖేష్ పేర్కొన్నారు. ‘‘మీరు నిజం మాట్లాడరు కాబట్టి, నాకు, సత్యేందర్ జైన్ కు మధ్య జరిగిన మూడు పేజీల వాట్సాప్ చాట్లను విడుదల చేస్తాను. ఇందులో దుబాయ్ లోని మూడు అపార్ట్మెంట్ల కొనుగోలు లావాదేవీలు ఉన్నాయి. ’’ అని పేర్కొన్నారు.
వచ్చే ఏడు రోజుల్లో ఈడీ (ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్), యాంటీ కరప్షన్ విజిలెన్స్ కు కూడా ఒక కాపీని పంపుతాని సుఖేష్ తన లేఖలో పేర్కొన్నారు. ఢిల్లీలోని న్యాయపాలనకు సంబంధించిన అంశాలను తరచూ లేవనెత్తే కేజ్రీవాల్, ఆయన భాగస్వాములు తనకు, తన కుటుంబానికి ముప్పు తెస్తున్నారని చంద్రశేఖర్ లేఖలో పేర్కొన్నారు.
యూసీసీని వ్యతిరేకిస్తున్న ఎన్డీయే ఈశాన్య మిత్రపక్షాలు.. ఎందుకంటే ?
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సన్నిహితుడు తన తల్లిని బెదిరించాడని ఆరోపించారు. ‘‘నేను ఇలాంటి చర్యలు ఆపకపోతే నా ఆహారంలో విషం వడ్డిస్తానని బెదిరించాడు. కేజ్రీవాల్ గారూ.. మీరు నాపై, నా కుటుంబంపై చేస్తున్న ఒత్తిడికి గట్టి సమాధానం లభిస్తుంది. మీరు కచ్చితంగా తీహార్ క్లబ్ లో చేరతారని మర్చిపోవద్దు’’ అని తెలిపారు.
పెళ్లి వేడుకల్లో అత్త సిగరెట్ తాగుతూ, డ్యాన్స్ చేసిందని వివాహాన్ని రద్దు చేసిన వరుడు.. ఎక్కడంటే ?
కాగా.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఉన్న విలాసవంతమైన ఫర్నిషింగ్ కు నిధులు సమకూర్చినట్లు పేర్కొంటూ మే 6న ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు సుఖేష్ చంద్రశేఖర్ లేఖ రాసిన సంగతి తెలిసిందే. అందులో విలాసవంతమైన ఫర్నిషింగ్ కోసం తాను వ్యక్తిగతంగా డబ్బు చెల్లించానని, జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు సత్యేందర్ జైన్ తో కలిసి వాటిని అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా ఎంపిక చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు.
