రైల్వే ప్లాట్ ఫారమ్ పై పడుకున్న ప్రయాణికులపై రైల్వే పోలీసు అమానవీయంగా ప్రవర్తించాడు. వారిపై నీళ్లు చల్లి నిద్రలో నుంచి లేపాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. 

తోటి మనుషుల పట్ల గౌరవం, సున్నితత్వం, దయ అనేవి సామాజిక హోదాతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరిలోనూ ఉండాల్సిన రెండు లక్షణాలు. కానీ దురదృష్టవశాత్తూ నేటి కాలంలో ఈ లక్షణాలు చాలా మందిలో కనిపించడం లేదు. వాటిని పెంపొందించుకోవడానికి కూడా చాలా మంది ప్రయత్నించడం లేదు. పెరిగిన సాంకేతికత వల్లనో లేకపోతే పశ్చాత సంస్కృతి వల్లనో తెలియదు గానీ.. ఇతరుల పట్ల కనీస మానవత్వాన్ని ప్రదర్శించడం లేదు. తాజాగా అలాంటి వీడియోనే ప్రస్తుతం నెటింట్లో వైరల్ గా మారింది. తోటి మనుషుల పట్ల దయ లేకుండా ఓ రైల్వే పోలీసు అధికారి అమానవీయంగా ప్రవర్తించాడు. రైల్వే ప్లాట్ ఫాంపై నిద్రిస్తున్న వారిపై నీళ్లు పోసి, నిద్రలో నుంచి లేపారు.

యూసీసీని వ్యతిరేకిస్తున్న ఎన్డీయే ఈశాన్య మిత్రపక్షాలు.. ఎందుకంటే ?

ఈ ఘటన మహారాష్ట్రలోని పూణె రైల్వే స్టేషన్ లో చోటు చేసుకుంది. ఇటీవల రైలు కోసం ఎదురు చూస్తు పలువురు ఆ రైల్వే ప్లాట్ ఫారమ్ పై నిద్రపోయారు. ఇందులో వృద్ధులు, యువకులు కూడా ఉన్నారు. అయితే అక్కడే విధుల్లో ఉన్న ఓ ప్రభుత్వ రైల్వే పోలీస్ (జీఆర్పీ) అధికారి రైల్వే ప్లాట్ ఫామ్ పై తిరుగుతూ వృద్ధులు, యువకులపై ఎలాంటి ఆలోచనా లేకుండా నీళ్లు చల్లారు. దీంతో వాళ్లు నిద్రలో నుంచి లేచి కూర్చుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది. ‘ఆర్ఐపీ హ్యుమానిటీ’ అనే క్యాప్షన్ తో ఈ వీడియో ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ లో వైరల్ అవుతోంది. ఈ వీడియోకు కేవలం ట్విట్టర్ లోనే 4 మిలియన్లకు పైగా వ్యూవ్స్ వచ్చాయి.

Scroll to load tweet…

ఈ వీడియో అనేక మంది దృష్టిని ఆకర్షించింది. దీనిపై నెటిజన్లు వెంటనే తమ అసహనాన్ని కామెంట్ల రూపంలో వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేయగా, మరికొందరు ప్లాట్ ఫాంలపై నిద్రిస్తున్న ప్రయాణికుల సమస్యను పరిష్కరించే మార్గాలను కనుగొనాలని సూచించారు. ఓ యూజర్ ‘‘ఇది దారుణం. రైలు కోసం వేచి ఉన్నప్పుడు ప్రయాణికులు విశ్రాంతి తీసుకోవడానికి ప్రదేశాలను ఏర్పాటు చేయాలి. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడం అమానుషం.’’ అని అన్నారు. 

మణిపూర్ జాతి హింసలో విదేశీ హస్తం ఉండొచ్చు - సీఎం బీరెన్ సింగ్

‘‘అక్కడ నిద్రించడానికి ఆప్షన్ లేకపోతే, విశ్రాంతి తీసుకునే ప్రదేశాన్ని ఎందుకు అందించరు’’ అని మరో యూజర్ కామెంట్ చేశారు. అయితే మరి కొంత మంది యూజర్లు ఆ పోలీసులకు మద్దతుగా నిలిచారు. ప్లాట్ ఫారమ్ పై పడుకునే చర్య తప్పు అని భావించారు. ‘‘ఇంత సృజనాత్మకంగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించిన ఈ పోలీసుకు సెల్యూట్. ప్లాట్ ఫారమ్ లు, మెట్లు వంటి వాటిపై నిద్రపోవడం మొదలుపెడితే, హడావిడిగా ఉన్న ప్రయాణికులు ఎలా నడుస్తారు ’’ అని ఓ యాజర్ పేర్కొన్నారు. 

పెళ్లి వేడుకల్లో అత్త సిగరెట్ తాగుతూ, డ్యాన్స్ చేసిందని వివాహాన్ని రద్దు చేసిన వరుడు.. ఎక్కడంటే ?

ఈ వీడియోపై పుణె డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎం) ఇందు దూబే స్పందించారు. ప్లాట్ ఫారమ్ పై పడుకోవడం వల్ల ఇతరులకు అసౌకర్యం కలుగుతుందని, అయితే ప్రయాణికులకు ఇలా చెప్పడం సరైన పద్దతి కాదని ఆమె ట్వీట్ చేశారు. ప్రయాణీకులతో హుందాగా, మర్యాదగా వ్యవహరించాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. ఈ సంఘటన పట్ల తాను తీవ్రంగా విచారం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు.