కేంద్రం ప్రభుత్వం తీసుకురావాలని భావిస్తున్న ‘యూనిఫాం సివిల్ కోడ్’ ను ఈశాన్య రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఎన్డీఏ మిత్రపక్షాలు వ్యతిరేసిస్తున్నాయి. యూసీసీ భారతదేశం ఆలోచన కు విరుద్ధంగా ఉందని, భిన్నత్వమే మన దేశానికి బలమని మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా అన్నారు.
దేశంలో ప్రస్తుతం యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ)పై తీవ్ర చర్చ జరుగుతోంది. దీనిపై అనేక వర్గాలు తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నాయి. ప్రతిపక్షాలు ఈ యూసీసీని వ్యతిరేకిస్తుండగా.. అధికార బీజేపీ, దాని మిత్రపక్షాలు దీనిని సమర్థిస్తున్నాయి. అనేక విషయాల్లో బీజేని వ్యతిరేకించే ఢిల్లీ అధికార పార్టీ అయిన ఆప్.. ఈ విషయంలో మాత్రం బీజేపీకి అనుకూలంగా అభిప్రాయాన్ని తెలిపింది. అయితే ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్న ఈశాన్య రాష్ట్రాల పార్టీలు మాత్రం దీనిని వ్యతిరేకించడం కొసమెరపు
పెళ్లి వేడుకల్లో అత్త సిగరెట్ తాగుతూ, డ్యాన్స్ చేసిందని వివాహాన్ని రద్దు చేసిన వరుడు.. ఎక్కడంటే ?
ఈ విషయంలో మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా శనివారం మాట్లాడుతూ.. ‘‘ ఇది (యూసీసీ) భారతదేశం ఆలోచన కు విరుద్ధం, అయితే వాస్తవ ముసాయిదాను చూడకుండా దాని వివరాలలోకి వెళ్లడం కష్టం’’ అని ఆయన వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’తో అన్నారు. యూసీసీ దేశం స్థాపించిన మూల సూత్రాలు, ఆలోచనలకు వ్యతిరేకంగా ఉందని తమ పార్టీ అభిప్రాయపడుతోందని చెప్పారు. భిన్నత్వమే భారతదేశానికి ఎప్పుడూ బలమని, అయితే తుది యూసీసీ ముసాయిదా ఎలా ఉంటుందో తెలియదని అన్నారు. ఈ విషయంలో ఇప్పుడే చర్చ మొదలైందని, కాబట్టి అసలు ముసాయిదా చూడకుండా దాని వివరాలలోకి వెళ్లడం కష్టమని తెలిపారు.
ఈశాన్య రాష్ట్రాలు, ఆ ప్రాంతంలోని సంస్కృతిపై సీఎం మాట్లాడుతూ.. ‘‘మనది మాతృస్వామ్య సమాజం. ఇది ఎప్పుడూ మన బలం, మన సంస్కృతిలో అంతర్భాగం. మన సాంస్కృతిక అస్తిత్వం మారదు.’’ అని అన్నారు. నేలలో పాతుకుపోయిన రాజకీయ పార్టీగా ఈశాన్య రాష్ట్రాలకు ఒక ప్రత్యేకమైన సంస్కృతి ఉందని, దానిని ఏ చట్టం మార్చజాలదని తాము గుర్తించామన్నారు.
మణిపూర్ జాతి హింసలో విదేశీ హస్తం ఉండొచ్చు - సీఎం బీరెన్ సింగ్
‘‘మన సంస్కృతి, మన పద్ధతులు మారవు. అయితే యూసీసీ ముసాయిదాలో అసలు మాటేమిటో వేచి చూడాల్సిందేనని అన్నారు. ఈ కాన్సెప్ట్ భారత్ ఆలోచనకు సరిపోదు. ఈ దేశం దాని వైవిధ్యం ద్వారా నిర్వచించబడింది. భారత్ ఈ ఆలోచనకు యూసీసీ ముప్పు తెస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ విషయంలో మా పార్టీ వైఖరి ఇదే’’ అని సంగ్మా స్పష్టం చేశారు.
కాగా.. యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ) బీజేపీ ఎన్నికల అజెండాలో ఉందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. ‘‘ఉమ్మడి పౌరస్మృతిపై చర్చలను రేకెత్తించడం సంఘ్ పరివార్ మతపరమైన విభేదాలను మరింత తీవ్రతరం చేసే మెజారిటీ ఎజెండాను నొక్కడానికి చేసిన ఎన్నికల ఎత్తుగడ. భారతదేశ బహుళత్వాన్ని బలహీనపరిచే ఏ ప్రయత్నాలనైనా వ్యతిరేకిద్దాం. సమాజాలలో ప్రజాస్వామ్య చర్చల ద్వారా సంస్కరణలకు మద్దతు ఇద్దాం’’ అని కేరళ సీఎం ట్వీట్ చేశారు.
ట్విట్టర్ యూజర్లకు షాక్.. చదివే పోస్టులపై పరిమితులు విధించిన ఎలాన్ మస్క్.. ఎవరెవరికీ ఎంతంటే ?
యూసీసీపై జరుగుతున్న చర్చకు జూన్ 27వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ మొదలుపెట్టారు. భాతర రాజ్యాంగం కల్పించిన సమానత్వపు హక్కులపై ప్రధాని మాట్లాడుతూ.. రెండు చట్టాలతో దేశాన్ని నడపలేమని అన్నారు. ‘‘ఒకే ఇంట్లో సభ్యులకు రెండు వేర్వేరు నియమాలు ఉంటే కుటుంబం పనిచేస్తుందా? అలాంటప్పుడు దేశాన్ని ఎలా నడపాలి? మన రాజ్యాంగం కూడా మతం, కులం, మతం ప్రజలకు సమాన హక్కులను కల్పించింది' అని ప్రధాని మోడీ అన్నారు.
