Asianet News TeluguAsianet News Telugu

Madhya Pradesh: మతం మార్పిడి.. క్రిస్టియన్‌ పాఠశాలపై భజరంగ్‌ దళ్ దాడి

Madhya Pradesh: దేశంలో మూక‌దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఓ  క్రిస్టియన్‌ పాఠశాల  భజరంగ్‌దళ్‌ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. ఈ పాఠశాలలో చదివే విద్యార్థులను యాజమాన్యం బ‌ల‌వంతంగా మత మార్పిడి చేస్తోంద‌ని ఆరోపించింది భజరంగ్‌దళ్‌.  
 

Students Barely Escape As Right-Wing Mob Attacks Madhya Pradesh School
Author
Hyderabad, First Published Dec 7, 2021, 11:13 AM IST

Madhya Pradesh: దేశంలో మూక‌దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజా మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని ఒక క్రిస్టియన్‌ పాఠశాలపై  భజరంగ్‌దళ్‌ కార్యకర్తలు విరుచక‌ప‌డ్డారు. వంద‌లాది మంది కార్య‌క‌ర్త‌లు క్రైస్తవ క్రైస్తవ మిషనరీ సంస్థపై రాళ్లతో దాడికి పాల్ప‌డ్డారు. ఈ హింసాత్మ‌క ఘ‌ట‌న విదిశ జిల్లాలోని గంజ్‌ బసోదా నగరంలోని క్రిస్టియన్‌ మిషనరీకి చెందిన సెయింట్‌ జోసెఫ్‌ పాఠశాలలో జ‌రిగింది.  

వివరాల్లోకెళ్తే..  విదిషా జిల్లా  సెయింట్‌ జోసెఫ్‌ పాఠశాలలో ఎనిమిది విద్యార్థులను బ‌ల‌వంతంగా మత మార్పిడి చేశారని సోషల్‌ మీడియాలో ఓ వార్త వైర‌ల్ అయ్యింది. ఈ వార్త తెలుసుకున్న స్థానిక హిందూ సంస్థ కార్య‌కర్త‌లు ఆగ్ర‌హ ఆవేశాల‌తో ఊగిపోయారు. సోమ‌వారం నాడు వంద‌లాది మంది హిందూ కార్య‌క‌ర్త‌లు పాఠశాల వెళ్లి రాళ్ల‌తో దాడి చేశారు. ఈ దాడి స‌మ‌యంలో విద్యార్థులు ప‌రీక్ష రాస్తున్నారు. ఈ దాడితో భయాందోళ‌న గురి విద్యార్థులు పాఠ‌శాల నుంచి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వారిని చెదరగొట్టారు. దాడి నుంచి విద్యార్థులు, పాఠశాల సిబ్బంది తృటిలో తప్పించుకున్నారు. 

Read Also: https://telugu.asianetnews.com/coronavirus-andhra-pradesh/covid-update-andhra-pradesh-reports-122-corona-cases-in-last-24-hours-r3p5zp

ఈ ఘ‌ట‌న‌పై పాఠశాల మేనేజర్, బ్రదర్ ఆంటోనీ స్పందించారు. దాడి చేస్తార‌నీ స్థానిక మీడియా ద్వారా  ఒక రోజు ముందుగానే తనకు సమాచారం అందిందని, ఆ సమాచారాన్ని పోలీసులకు అందించమ‌ని తెలిపారు. కానీ, పోలీసులు సరైన భద్రతా ఏర్పాట్లు చేయడం లేదని, వారు భ‌ద్ర‌తా ఏర్పాటు చేసి ఉంటే.. ఈ ఘ‌ట‌న జ‌రిగేది కాద‌నీ ఆరోపించారు. విద్యార్థులు భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌య్యార‌ని తెలిపారు. పాఠ‌శాల‌లో మత మార్పిడులు జ‌రిగాయ‌ని వ‌చ్చిన క‌థ‌నాల‌ను ఆయ‌న ఖండించారు. ఫిర్యాదులో పేర్కొన్న పేర్లు ఏవీ కూడా త‌మ విద్యార్థులతో సరిపోలడం లేదని పేర్కొన్నారు.

ఈ ఘ‌ట‌న‌పై స్థానిక బజరంగ్ దళ్ నాయకుడు నీలేష్ అగర్వాల్ మాట్లాడుతూ.. మత మార్పిడిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మ‌త మార్పిడి చేసిన‌ట్టు తేలితే.. పాఠశాల అనుమ‌తిని రద్దు చేయాల‌ని డిమాండ్ చేశారు. ఘటన తర్వాత ఆ ప్రాంతంలోని ఇతర మిషనరీ పాఠశాలల్లో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ విధ్వంసానికి పాల్పడిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పోలీసులు తెలిపారు. 

Read Also: https://telugu.asianetnews.com/national/23-years-woman-arrested-for-killing-and-dumping-her-newborn-in-hospitals-flush-tank-in-tamilnadu-r3qbxy

ఈ ఘ‌ట‌న‌ను చాలా సీరియ‌స్ గా తీసుకున్నామ‌నీ, మత మార్పిడిపై విచారణ ప్రారంభించామని, పాఠశాల యాజమాన్యాన్ని ప్రశ్నిస్తామని సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ రోషన్ రాయ్ ప్ర‌క‌టించారు. మ‌రోవైపు పాఠశాలపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించాలని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కు  విదిశ జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. 

యునైటెడ్‌ క్రిస్టియన్‌ ఫోరం (యుసిఎఫ్‌) గణాంకాల ప్రకారం ఈ ఏడాదిలో భార‌త్ లో ఇలాంటి 35 సంఘటనలు జరిగాయి. ఈ ఘ‌ట‌న‌లు ప్ర‌ధానంగా బీజీపీ పాలిత ప్రాంత‌లైనా..  వారణాసి, ప్రయాగ్‌ రాజ్‌ (అలహాబాద్‌), నోయిడా, అయోధ్య, రాంపూర్‌, బారైచ్‌, లఖింపూర్‌ ఖేరి లలో ఎక్కువ‌గా జ‌రిగిన‌ట్టు నివేదికలున్నాయి. 'ఉత్తరప్రదేశ్‌లో మత మార్పిడి వ్యతిరేక చట్టం ముస్లింలతో పాటు క్రైస్తవులకు కూడా వర్తిస్తుంది. ఇటీవల ఇలాంటి ఘ‌ట‌న‌లే ఉత్తరప్రదేశ్‌ లోని మావ్‌ జిల్లా, ఉత్తరాఖండ్‌ లోని రూర్కీలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అల్లరిమూకలు చర్చిల మీద దాడి చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios