AP Corona : ఏపీలో క‌రోనా త‌గ్గుముఖం .. ఈ రోజు కేసులేన్నంటే..?

AP Corona cases:  ఏపీలో క‌రోనా విజృంభ‌న త‌గ్గుముఖం ప‌ట్టింది. నిన్న‌టితో పోలిస్తే.. కేసుల సంఖ్య గ‌ణ‌నీయంగా ప‌డిపోయింది. గడిచిన 24 గంటల్లో 18వేల 788 కరోనా పరీక్షలు నిర్వహించగా,  122 మందికి పాజిటివ్ నిర్థారణ అయ్యింది.
 

covid update andhra pradesh reports 122 corona cases in last 24 hours

AP Corona cases: ఏపీలో కరోనా కేసులు క్రితం రోజుతో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 18వేల 788 కరోనా పరీక్షలు నిర్వహించగా,  కొత్తగా 122 మందికి పాజిటివ్​గా (Corona cases in AP) వచ్చినట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ తాజా బులిటెన్ ప్ర‌కారం.. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 31 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరులో 18, గుంటూరులో 18 కేసులు వెలుగులోకి వ‌చ్చాయి.  ప్రకాశం జిల్లాలో కొత్త కేసులు న‌మోదు కాక‌పోవ‌టం ఊర‌ట‌నిచ్చే ఆంశం. 

ఇక కరోనా మృతుల విషయానికొస్తే.. గడిచిన 24 గంటల్లో కరోనాతో ఒక మరణం సంభవించింది. కృష్ణా జిల్లాలో ఒకరు కోవిడ్ తో చనిపోయారు. ఇదిలా ఉండగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 213 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నట్లు వెల్లడించింది ఆరోగ్య శాఖ.  

Read Also: https://telugu.asianetnews.com/gallery/entertainment/nandamuri-balakrishna-opens-up-ntr-backstab-incident-r3otkq

రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 3,05,88,808 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది. ఇప్ప‌టి వ‌ర‌కు 20,73,852 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 20,57,369 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 2,030 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,453కి పెరిగింది.కరోనా కొత్త కేసులు, మరణాలు గణనీయంగా తగ్గడం ఊరటనిచ్చే అంశం. 
 
మరోవైపు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. వేగంగా వ్యాపిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. క‌రోనా త‌గ్గుతోంది అనుకునే లోపే.. ఒమిక్రాన్ విజృంభిస్తోంది. ద‌క్షిణాఫ్రికాలో వెలుగులోకి వ‌చ్చిన రెండు వారాల లోపే ఈ వేరియంట్ 46 దేశాలకు పాకింది.  కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ 6 రెట్లు వేగంగా వ్యాప్తి చెందడం ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 941కి పెరిగింది. అత్య‌ధికంగా యూకేలో 246 కేసులు నమోదు కాగా, దక్షిణాఫ్రికాలో 228, జింబాబ్వేలో 50, అమెరికాలో 39 ఒమిక్రాన్‌ కేసులు న‌మోదు అయ్యాయి. మ‌న దేశంలో కూడా ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 23 కి చేరింది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios