Asianet News TeluguAsianet News Telugu

టాయిలెట్ ఫ్లష్ ట్యాంక్ లో శిశువు మృతదేహం.. పెళ్లి కాకుండానే తల్లైన ఓ యువతి ఘాతుకం...

ఆ ఫ్లష్ ట్యాంక్ లో ఒక పసిబిడ్డ శవం కనిపించింది. వెంటనే అతను ఈ విషయాన్ని ఆస్పత్రి యాజమాన్యానికి తెలియజేశాడు. వాళ్లు హుటాహుటిన అక్కడికి చేరుకుని చూశారు. తరువాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సిబ్బందిని విచారణ చేయడం మొదలుపెట్టారు. 

23 years woman arrested for killing and dumping her newborn in hospitals flush tank in tamilnadu
Author
Hyderabad, First Published Dec 7, 2021, 10:45 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

తమిళనాడు లో ఒక మహిళా దారుణానికి పాల్పడింది. పెళ్లి కాకుండానే ఒక childకు జన్మనిచ్చిన ఆమె hospitalకి వెళ్లి తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరో ఘోరం చేసింది ఇంతకీ ఆమె ఏం చేసిందంటే…

క్షణిక సుఖం కోసం తెలిసీ, తెలియని వయసులో చేసిన చిన్న పొరపాటు ఆమె జీవితాన్ని నాశనం చేసింది. తనతో పాటు కడుపుచించుకుని పుట్టిన పసికందుకు లోకం తెలియకముందే నూరేళ్లు నిండేలా చేసింది. తను చేస్తుంది తప్పో, ఒప్పో తెలుసుకునే విచక్షణ కూడా కోల్పోయేలా చేసి.. నేరానికి పాల్పడేలా చేసింది. దీంతో ఇప్పుడా సంఘటన స్థానికంగా కలకలం రేపాంది.

Tamil Naduలోని Thanjavur Medical College లోని ఐసీయూ వార్డులో కొన్ని రోజుల క్రితం  ఒక పారిశుధ్య కార్మికుడు ఆస్పత్రి బాత్ రూమ్ క్లీనింగ్ చేసేందుకు వెళ్ళాడు. అక్కడ Toilet flush tank సరిగా పనిచేయడం లేదు. దీంతో అతను దానిని తెరవడానికి ప్రయత్నించారు. మూత గట్టిగా వేసి ఉంది. కాసేపు ప్రయత్నించడంతో మూత తెరవగలిగాడు. కానీ అందులో కనిపించిన దృశ్యం అతన్ని షాక్ కు గురి చేసింది. 

ఆ ఫ్లష్ ట్యాంక్ లో ఒక పసిబిడ్డ Corpse కనిపించింది. వెంటనే అతను ఈ విషయాన్ని ఆస్పత్రి యాజమాన్యానికి తెలియజేశాడు. వాళ్లు హుటాహుటిన అక్కడికి చేరుకుని చూశారు. తరువాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సిబ్బందిని విచారణ చేయడం మొదలుపెట్టారు. 

ఈ విచారణలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. అది మెడికల్ కాలేజీ ఆస్పత్రే అయినా ఆ ఆస్పత్రిలో అసలు Maternity ward లేదని ఆస్పత్రి వర్గాలు బాంబు పేల్చాయి. మరి ఇంతకీ ఆ పసికందు మృతదేహం ఎక్కడి నుంచి వచ్చింది? చనిపోయాక అక్కడ వదిలి వెళ్లారా? లేక బతికుండగానే సజీవంగా సమాధి చేశారా? అని అనుమానాలు మొదలయ్యాయి. 

మహారాష్ట్రలో ఒమిక్రాన్ అలజడి.. విదేశాల నంచి వచ్చినవారిలో 100 మంది ఆచూకీ లేదు: అధికారులు

ఇక ఆస్పత్రి వర్గాలు తమ దగ్గర మెటర్నటీ వార్డు లేదు కాబట్టి ఆ  శిశువు అక్కడ జన్మించే అవకాశం లేదని.. ఇది బయటివారి పనే అయి ఉంటుందని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. దీంతో పోలీసులు ముందు తలలు పట్టుకున్నారు. ఆ తరువాత కేసు విచారణను ముమ్మరం చేయడానికి సీసీటీవీ వీడియోలను పరిశీలించారు. అందులో అసలు విషయం బయటపడింది.

చేతిలో పసికందుతో వచ్చిన ఒక యువతి ఖాళీ చేతులతో వెళ్లడం గమనించారు. ఆ యువతిని గాలించి అరెస్టు చేశారు. ఆమె చెప్పిన విషయాలు పోలీసులను దిగ్భ్రాంతికి గురి చేశాయి.  పోలీసుల కథనం ప్రకారం తమిళనాడులోని బుదలూర్ పట్టణానికి చెందిన  ప్రియదర్శిని(23) అనే యువతి marriage కాకుండానే ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చింది. 

ఈ విషయం బయటకు తెలిస్తే తన జీవితం నాశనమవుతుందని భయంతో ఆ పసిబిడ్డను వదిలించుకునేందుకు నిర్ణయించుకుని..  ఆమె దగ్గరలోని తంజావూర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి వెళ్ళింది.  అక్కడ దొంగచాటుగా బాత్ రూమ్ కి వెళ్ళి టాయిలెట్ ఫ్లష్ ట్యాంకులో ఆ పసిబిడ్డని పెట్టేసి ట్యాంకు మూత పెట్టి మూసేసింది. దీంతో ఆ బిడ్డ ఊపిరాడక చనిపోయింది.

Follow Us:
Download App:
  • android
  • ios