వీధికుక్కులు వెంటపడడంతో స్కూటీమీద వెడుతున్న మహిళ కారును గుద్ది.. దారుణంగా కిందపడిన ఘటన న్యూఢిల్లీలో వెలుగు చూసింది.
న్యూఢిల్లీ : ఒడిశాలో వీధికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. స్కూటీ మీద వెడుతున్న ఓ మహిళను వీధికుక్కలు వెంబడించాయి. స్కూటీ నడుపుతున్న మహిళతో పాటు ఓ చిన్నారి.. వెనుక మరో మహిళ కూర్చుని ఉన్నారు. రోడ్డు మీద వెడుతున్న వీరిని 2,3 వీధికుక్కలు వెంబడించాయి. వాటినుంచి తప్పించే క్రమంలో స్కూటీని వేగంగా నడుపుతూ.. ముందు పార్క్ చేసి ఉన్న కారును గుద్దేసింది ఆ మహిళ.
దీంతో బండి మీద ఉన్న ముగ్గురూ అతి దారుణంగా కింద పడ్డారు. అది చూసిన కుక్కలు తోక ముడుచుకుని అక్కడినుంచి పరుగందుకున్నాయి. పీటీఐ ప్రకారం, ప్రమాదంలో మహిళ, ఆమె బిడ్డ ఇద్దరికీ అనేక గాయాలు అయ్యాయి. దేశవ్యాప్తంగా ఉత్తరప్రదేశ్ తర్వాత ఒడిశాలోనే వీధికుక్కలు ఎక్కువగా ఉన్నాయి.
సిద్దిపేట కలెక్టరేట్ లో కుక్కల స్వైరవిహారం.. అదనపు కలెక్టర్ కాలి పిక్కలు పీకేసి.. బీభత్సం..
ఫిషరీస్, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ చేసిన గణన ప్రకారం, ఒడిశాలో 2012లో వీధికుక్కల సంఖ్య 8.62 లక్షలుగా ఉంది, అది 2019 నాటికి 17.34 లక్షలకు పెరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో, ఒడిశా ప్రభుత్వం అన్ని చీఫ్ డిస్ట్రిక్ట్ వెటర్నరీ ఆఫీసర్లను అప్రమత్తంగా ఉండాలని, రాష్ట్రంలోని వీధుల నుండి వీధికుక్కలను తరమాలని ఆదేశించింది.
హైదరాబాద్‌లో నాలుగేళ్ల బాలుడిని వీధికుక్కలు కరిచి చంపిన వీడియోను చూసిన తర్వాత ఈ సూచన పంపినట్లు జంతు వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రణేంద్ర ప్రతాప్ స్వైన్ తెలిపారు. ‘‘ఆ వీడియో చూశాను.. హైదరాబాద్‌లో నాలుగేళ్ల చిన్నారిని వీధికుక్కలు పొట్టన పెట్టుకుంటున్నాయి.. మన రాష్ట్రంలో కూడా ఎక్కడికక్కడ వీధికుక్కలు ఉన్నాయి.. అందుకే సీడీవోలందరికీ, నా డిపార్ట్‌మెంట్‌కు ఓ నోట్ జారీ చేశాను. ఒడిశాలో అలాంటి సంఘటన జరగకుండా వారు అప్రమత్తంగా ఉండాలి" అని చెప్పారు.
