విచిత్రం..చనిపోయాడని చెప్పిన డాక్టర్లు..పోస్టుమార్టం చేసేందుకు సిద్ధమవుతుండగా మార్చురీలో కాళ్లు ఊపుతూ, సజీవంగా
కర్ణాటకలో విచిత్రం చోటు చేసుకుంది. చనిపోయాడని డాక్టర్లు ప్రకటించిన తరువాత ఓ వ్యక్తి బతికాడు. పోస్టుమార్టం చేసేందుకు ఓ వైపు డాక్టర్లు సిద్ధమవుతుండగా.. మార్చరీలో ఆయన కాళ్లు, చేతులు కదలించాడు.
డాక్టర్లు చనిపోయాడని నిర్దారించి, మార్చురీకి తరలించిన తరువాత ఓ వ్యక్తి సజీవంగా కాళ్లు ఊపుతూ కనిపించాడు. వెంటనే అతడిని చికిత్స కోసం మరో హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. ఈ విషయం ప్రస్తుతం వైరల్ గా మారింది. వివరాలు ఇలా ఉన్నాయి.
ఎమ్మెల్యే కాన్వాయ్ పై మావోయిస్టుల దాడి.. ఆకస్మిక కాల్పులు.. ఎక్కడంటే ?
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సిబ్బందికి శిక్షణ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగి అయిన జగదీష్ చామరాజనగర్ జిల్లా హనూర్ పట్టణంలోని వివేకానంద పాఠశాలలో నిర్వహించిన శిక్షణా శిబిరానికి ఆయన హాజరయ్యారు. అయితే ఉదయం 10 గంటల సమయంలో మెట్లు ఎక్కుతుండగా ఒక్క సారిగా కిందపడిపోయారు. తలకు గాయమై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.
అతిక్ అహ్మద్ హత్య.. యూపీ డీజీపీ, ప్రయాగ్ రాజ్ పోలీస్ కమిషనర్ కు జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు
ఎన్నికల విధుల్లో ఉన్న ఇతర అధికారులు వెంటనే అతన్ని సమీపంలోని హోలీక్రాస్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అతడిని పరీక్షించారు. అప్పటికే మరణించినట్లు ప్రకటించారు. విషయం తెలుసుకున్న చామరాజనగర్ డిప్యూటీ కమిషనర్ డీఎస్ రమేష్ ఆసుపత్రికి చేరుకుని సిబ్బంది నుంచి వివరాలు తీసుకున్నారు. అనంతరం అపస్మారక స్థితిలో ఉన్న జగదీష్ ను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రి మార్చురీకి తరలించారు.
మరణ వార్త వినగానే జగదీశ్ తల్లి కూడా హాస్పిటల్ కు చేరుకున్నారు. ఆమె కన్నీరు మున్నీరవుతూ కుమారుడి చేతిని తాకింది. అయితే ఆ సమయంలో జగదీశ్ కాళ్లు, చేతులు కదిలించినట్టు ఆమెకు అనిపించింది. ఈ విషయాన్ని వెంటనే వైద్యులకు తెలియజేసింది. అక్కడున్న డాక్టర్లు మళ్లీ పరీక్షించి ఆయన ప్రాణాలతో ఉన్నారని గుర్తించారు. వెంటనే ఆయనను మైసూరులోని అపోలో ఆస్పత్రికి తరలించారు.
నారాయణపేటలో విషాదం.. చెరువులో పడి ముగ్గురు చిన్నారులు మృతి.. వారిని కాపాడేందుకు వెళ్లిన మహిళ కూడా..
జగదీష్ కిందపడి తలకు గాయమైందని, మధ్యాహ్నం వరకు స్పృహలోకి రాలేదని అక్కడ విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ ప్రకాశ్ విలేకరులకు తెలిపారు. మార్చురీకి తరలించగా ఆయన ప్రాణాలతో బయటపడటంతో వెంటనే అపోలో ఆస్పత్రికి తరలించామని చెప్పారు. ఈ ఘటనపై స్థానిక తహసీల్దార్ స్పందించారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని దర్యాప్తు చేస్తామని తెలిపారు.