Asianet News TeluguAsianet News Telugu

ఎమ్మెల్యే కాన్వాయ్ పై మావోయిస్టుల దాడి.. ఆకస్మిక కాల్పులు.. ఎక్కడంటే ?

ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని బీజాపూర్ ఎమ్మెల్యే కాన్వాయ్ పై మావోయిస్టులు ఆకస్మికంగా దాడి చేశారు. బుల్లెట్ల వర్షం కురిపించారు. అయితే భద్రతా సిబ్బంది అప్రమత్తమై ఎమ్మెల్యేను సురక్షితంగా అక్కడి నుంచి తరలించారు. 

Maoist attack on MLA's convoy.. Sudden firing.. Where?..ISR
Author
First Published Apr 19, 2023, 11:29 AM IST

ఛత్తీస్ ఘడ్ బీజాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే విక్రమ్ మాండవి కాన్వాయ్ పై అనుమానిత మావోయిస్టులు మంగళవారం దాడి చేశారు. రాయ్ పూర్ కు దక్షిణాన 350 కిలోమీటర్ల దూరంలోని గంగలూరులో ఓ బహిరంగ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా ఒక్క సారిగా కాల్పులు జరిపారు. అయితే ఈ ఘటనలో ఎమ్మెల్యే సురక్షితంగా బయటపడ్డారు.

అతిక్ అహ్మద్ హత్య.. యూపీ డీజీపీ, ప్రయాగ్ రాజ్ పోలీస్ కమిషనర్ కు జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు

కాల్పులు జరిపిన అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. కారులో ఉన్నవారు తృటిలో తప్పించుకోగా ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ‘‘బీజాపూర్ ఎమ్మెల్యే, బీజాపూర్ జిల్లా పంచాయతీ సభ్యురాలు పార్వతి కశ్యప్, అతడి వెంట ఉన్న ప్రజాప్రతినిధి (కాన్వాయ్ లో) సురక్షితంగా ఉన్నారు. భద్రంగా జిల్లా కేంద్రానికి తిరిగి వచ్చారు’’ అని బస్తర్ రేంజ్ ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుందర్ రాజ్ పి ‘ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్’ తెలిపారు.

జీన్స్, టీ-షర్ట్ ధరించి ఆఫీసుకు రావొద్దు - ఉద్యోగులకు బీహార్ లోని సరన్ జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాలు.. ఎందుకంటే

ఈ ఘటనపై ఎమ్మెల్యే విక్రమ్ మాండవి స్పందించారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన నుక్కడ్ సభకు హాజరయ్యేందుకు గంగాపూర్ లోని స్థానిక హాత్ బజార్ కు వెళ్లామని తెలిపారు. అయితే తిరిగి వస్తుండగా తమ కాన్వాయ్ పై అకస్మాత్తుగా కాల్పులు జరిగాయని చెప్పారు. భద్రతా సిబ్బంది ప్రోటోకాల్ ప్రకారం తమకు రక్షణ కల్పించారని, కానీ భద్రతలో ఏదైనా లోపం ఉందో లేదో తాను చెప్పలేనని అన్నారు. 

కాగా.. 2013 మే 25న బస్తర్ లోని జిరామ్ లోయలో 29 మందిని మావోయిస్టులు పొట్టనబెట్టుకున్నారు. ఈ దాడిలో  కాంగ్రెస్ అగ్రనేతలు కూడా హతమయ్యారు. దాదాపు 10 సంవత్సరాల తరువాత, దాడి వెనుక ఉన్న కథ, నిజం ఇప్పటికీ  మిస్టరీగానే ఉంది. 

నారాయణపేటలో విషాదం.. చెరువులో పడి ముగ్గురు చిన్నారులు మృతి.. వారిని కాపాడేందుకు వెళ్లిన మహిళ కూడా..

మంగళవారం ఇదే జిల్లాలోని అటవీప్రాంతంలో మంగళవారం భద్రతా సిబ్బందితో జరిగిన కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. ఎన్‌కౌంటర్ తర్వాత ఇద్దరు మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరి గాయాలతో ఉన్నారు. రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌కు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న నైమెడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కచ్లవారి గ్రామ సమీపంలో ఉదయం 8 గంటలకు జిల్లా రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ) బృందం సెర్చింగ్ ఆపరేషన్‌లో ఉన్నప్పుడు ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయని బీజాపూర్ పోలీసు సూపరింటెండెంట్ ఆంజనేయ వర్ష్నే తెలిపారు.

హైదరాబాద్‌ మాజీ క్రికెటర్‌ అబ్దుల్‌ అజీమ్‌ ఇక లేరు..

మావోయిస్టు భైరామ్‌గఢ్ ఏరియా కమిటీ సీనియర్ నాయకులు ఆ ప్రాంతలో ఉన్నారనే ఇన్‌పుట్స్‌తో భద్రతా సిబ్బంది రెడ్డి క్యాంపు నుంచి పెట్రోలింగ్ ప్రారంభించినట్లు ఆయన చెప్పారు. ఎదురుకాల్పులు ఆగిన తర్వాత ఘటనా స్థలం నుంచి ఒక మావోయిస్టు మృతదేహాన్ని భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా, ఇద్దరు మావోయిస్టులను అదుపులోకి తీసుకోగా.. వారిలో ఒకరు గాయపడిన స్థితిలో ఉన్నారని పోలీసులు చెప్పారు. గాయపడిన మావోయిస్టును ఆస్పత్రికి తరలిస్తున్నట్లు తెలిపారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios