Asianet News TeluguAsianet News Telugu

అతిక్ అహ్మద్ హత్య.. యూపీ డీజీపీ, ప్రయాగ్ రాజ్ పోలీస్ కమిషనర్ కు జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు

దుండగుల కాల్పుల్లో అతిక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ మరణించడంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ఈ హత్యలపై నివేదిక అందించాలని ఉత్తరప్రదేశ్ డీజీపీ, ప్రయాగ్ రాజ్ పోలీస్ కమిషనర్ కు నోటీసులు జారీ చేశారు. 

Atiq Ahmed's murder.. National Human Rights Commission notices to UP DGP, Prayagraj Police Commissioner..ISR
Author
First Published Apr 19, 2023, 10:45 AM IST

పోలీసు కస్టడీలో ఉన్న సమయంలో అతిక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ లను ముగ్గురు యువకులు హత్య చేయడంపై నివేదికలు ఇవ్వాలని కోరుతూ జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ ఆర్ సీ) ఉత్తరప్రదేశ్ డీజీపీ, ప్రయాగ్రాజ్ పోలీస్ కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ జిల్లాలో శనివారం రాత్రి మీడియా సమక్షంలో ఇద్దరు సోదరులను దుండగులు హత్య చేశారంటూ వచ్చిన ఫిర్యాదులపై ఎన్ హెచ్ ఆర్సీ విచారణ చేపట్టింది. నాలుగు వారాల్లోగా తమకు నివేదిక సమర్పించాలని డీజీపీ, కమిషనర్ కు అందించిన నోటీసుల్లో ఆదేశించింది.

జీన్స్, టీ-షర్ట్ ధరించి ఆఫీసుకు రావొద్దు - ఉద్యోగులకు బీహార్ లోని సరన్ జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాలు.. ఎందుకంటే

ఎన్ హెచ్ ఆర్సీ కోరిన వివరాలు.. 
మరణానికి దారితీసే అన్ని అంశాలను కవర్ చేసే వివరణాత్మక నివేదిక ఇవ్వాలని ఎన్ హెచ్ ఆర్సీ తన నోటీసుల్లో పేర్కొంది. అందులో మరణం సంభవించిన సమయం, ప్రదేశం, అరెస్టు  నిర్బంధానికి కారణం కూడా ఉండాలని పేర్కొంది. మృతుడిపై నమోదైన ఫిర్యాదు, ఎఫ్ఐఆర్ కాపీ అలాగే అరెస్టు మెమో, తనిఖీ మెమో కాపీ ఇవ్వాలని కోరింది.

హైదరాబాద్‌ మాజీ క్రికెటర్‌ అబ్దుల్‌ అజీమ్‌ ఇక లేరు..

అరెస్టు సమాచారం కుటుంబ సభ్యులు లేదా బంధువులకు ఇచ్చారా అని నోటీసుల్లో ఎన్ హెచ్ ఆర్సీ ప్రశ్నించింది. మృతుడి మూర్ఛ మెమో, రికవరీ మెమో కాపీ తమకు సమర్పిచాలని ఆదేశించింది. వీటితో పాటు మృతుడి మెడికల్ లీగల్ సర్టిఫికేట్ కాపీ, సంబంధిత జీడీ ఎక్స్ ట్రాక్ట్స్ కాపీల్లో అన్నీ స్పష్టంగా వివరాలు ఉండాలని, వాటిని ఇంగ్లీష్ లేదా హిందీలో అనువదించి అందించాలని పేర్కొంది. విచారణ నివేదిక, పోస్ట్ మార్టం రిపోర్ట్ (ఇందులో పీఎంఆర్ టైప్ చేసిన కాపీ, ముఖ్యంగా గాయాలు వివరణను అందించాలి), పోస్టుమార్టం పరీక్ష వీడియో సీడీ ఇవ్వాలని ఆదేశించింది. అన్ని వివరాలను తెలియజేసే ఘటనా స్థలం సైట్ ప్లాన్, విస్సెరా రసాయన, హిస్టోపాథాలజీ పరీక్ష, ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఆధారంగా మరణానికి తుది కారణం, మెజిస్టీరియల్ ఎంక్వైరీ రిపోర్ట్ అందించాలని పేర్కొంది.

నారాయణపేటలో విషాదం.. చెరువులో పడి ముగ్గురు చిన్నారులు మృతి.. వారిని కాపాడేందుకు వెళ్లిన మహిళ కూడా..

ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ జిల్లాలోని కొల్విన్ హాస్పిటల్ వెలుపల శనివారం రాత్రి అతిక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ లను కాల్చి చంపారు. వారిద్దరినీ వైద్య పరీక్షలకు తీసుకెళ్తుండగా ఈ హత్యలు జరిగాయి. జర్నలిస్టుల వేషంలో జై శ్రీరామ్ నినాదాలు చేస్తున్న ముగ్గురు యువకులు పాయింట్ బ్లాంక్ రేంజ్ లో సోదరులను కాల్చిచంపడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. గత వారం ఝాన్సీలో యూపీ పోలీసులు జరిపిన ఎన్ కౌంటర్ లో అతిక్ కుమారుడు అసద్ హతమయ్యాడు.

Follow Us:
Download App:
  • android
  • ios