కాలుష్య ఉద్గారాల కారణంగా తమ ఆరోగ్యం దెబ్బ తింటోందంటూ తూత్తుకుడిలోని స్టెరిలైట్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ప్రజలు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. నాడు జరిగిన అల్లర్లలో నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో 13 మంది ప్రాణాలు కోల్పోగా.. 100 మందికి పైగా గాయపడ్డారు. దీంతో ప్రభుత్వం సదరు స్టెరిలైట్ ఫ్యాక్టరీని శాశ్వతంగా మూసివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది కూడా.

ఇప్పుడు ఆ వివాదాస్పద ఫ్యాక్టరీ యాజమాన్య సంస్థ వేదాంత గ్రూప్ ఇవాళ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. ఫ్యాక్టరీని నిర్వహించేందుకు అవసరమైన కనీస సిబ్బందితో పాటు తగినంత విద్యుత్ సౌకర్యం కల్పించాలనిన కోరుతూ పిటిషన్ వేసింది. ఈ నెల 18 నుంచి ప్రారంభమైన ప్లాంటులో సల్ఫ్యూరిక్ యాసిడ్ లీకేజీని సరిదిద్దగల అధికారిక సిబ్బందితో పాటు కనీస విద్యుత్ సౌకర్యాన్ని కల్పించాలని పిటిషన్‌లో కోరింది.