Asianet News TeluguAsianet News Telugu

భారత్ జోడో యాత్రలో తొక్కిసలాట.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కేసీ వేణుగోపాల్ కు గాయాలు

భారత్ జోడో యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. రాహుల్ గాంధీని చూసేందుకు మధ్యప్రదేశ్ రాజధాని ఇండోర్ లో ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో కేసీ వేణుగోపాల్ కు గాయాలు అయ్యాయి. 

Stampede in Bharat Jodo Yatra. Senior Congress leader KC Venugopal injured
Author
First Published Nov 28, 2022, 9:31 AM IST

భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్‌లో కొనసాగుతోంది. ఆ యాత్ర ఆదివారం ఇండోల్ నిర్వహిస్తుండగా అపశృతి చోటు చేసుకుంది. ఒక్క సారిగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇందులో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గాయపడ్డారు. తొక్కిసలాటలో చిక్కుకోవడంతో చేతికి, మోకాలికి గాయాలయ్యాయి.

అన్నంలో చీమలు ఉన్నాయని గొడవ.. భర్తను స్కార్ప్ తో గొంతు నులిమి చంపిన భార్య..

వివరాలు ఇలా ఉన్నాయి. ఇండోర్ లో ఆదివారం యాత్ర మొదలుపెట్టిన తరువాత రాహుల్ గాంధీని కలిసేందుకు ఆయన అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో రద్దీ ఏర్పడింది. అయితే దీనిని పోలీసులు కూడా జనాన్ని నియంత్రించలేకపోయారు. ఇది తొక్కిసలాటకు దారితీసింది. ఇందులో కేసీ వేణుగోపాల్ తో పాటు పలువురి గాయాలు అయ్యాయి. దీంతో ఆయనకు శిబిరంలో ఏర్పాటు చేసిన ప్రాథమిక చికిత్స కేంద్రంలో చికిత్స అందించారు. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

జీఎస్టీ, అవినీతి, నోట్ల రద్దుపై మాట్లాడేందుకు ప్రయత్నించినప్పుడల్లా మైక్‌లు కట్ చేశారు.. : రాహుల్ గాంధీ

కాగా.. గత వారాంతంలో కేసీ వేణుగోపాల్ బీజేపీపై ఆరోపణలు చేశారు. భారత్ జోడో యాత్రకు వ్యతిరేకంగా ఏదో కనిపెట్టి, పాదయాత్ర పరువు తీయాలని ప్రయత్నిస్తోందని అన్నారు. పాదయాత్ర ఫలితాన్ని చూసి బీజేపీ భయపడిపోతోందని అన్నారు. భారత్ జోడో యాత్రలో ప్రజలు ‘పాకిస్థాన్ జిందాబాద్’ నినాదాలు చేస్తున్నారని ఆరోపణలు రావడంతో ఆయన ఈ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

‘భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ లేవనెత్తిన అంశాలను అందరూ అంగీకరిస్తున్నారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ద్వేషం వంటి సమస్యలన్నింటినీ ప్రజలు  సీరియస్‌గా తీసుకుంటున్నారు. రాహుల్ గాంధీ చేస్తున్న త్యాగాన్ని మొదటి రోజు నుంచే ప్రజలు గుర్తిస్తున్నారు. గత కొన్నేళ్లుగా రాహుల్ గాంధీ ప్రతిష్టను దిగజార్చడంలో బీజేపీ బిజీగా ఉంది. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ అసలు ముఖాన్ని ప్రజలు చూస్తున్నారు. ఆయన విద్యావంతుడు, కరుణామయుడు, ఒక స్టాండ్ తీసుకుంటాడు ’’ అని కేసీ వేణుగోపాల్ వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’తో అన్నారు.

స్కూల్ టాయిలెట్‌లో బిడ్డకు జన్మనిచ్చిన మైనర్.. బంధువు అత్యాచారంతోనే..

బీజేపీ మొదటి రోజు నుంచే ఈ యాత్రకు వ్యతిరేకంగా ఏదో కనిపెట్టడానికి ప్రయత్నిస్తోందని కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. వారు యాత్రలో అల్లర్లు చేయడానికి కొందరిని నియమించారని అన్నారు. ఈ యాత్ర అసలు ఫలితం వారికి తెలుసని అన్నారు. కానీ ప్రజలు వాటిని నమ్మడం లేదని చెప్పారు. తాము విమర్శలకు పెద్దగా విలువ ఇవ్వడం లేదని తెలిపారు. ఇది చాలా అరుదని, ప్రమాదకరమని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios