Asianet News TeluguAsianet News Telugu

24 మంది భారత జాలర్లను అరెస్టు చేసిన శ్రీలంక నేవీ.. ఐదు ట్రాలర్ల సీజ్..

తమిళనాడుకు చెందిన 24 మంది మత్స్యకారులను శ్రీలంక నేవీ అదుపులోకి తీసుకుంది. అలాగే వారి ట్రాలర్లను కూడా అదుపులోకి తీసుకుంది. తమ దేశ జలాల్లోకి అక్రమంగా చేపలు పడుతున్నారనే కారణంగా ఆ దేశ నేవీ ఈ చర్యకు పూనుకున్నారు. 

Sri Lankan Navy arrested 24 Indian fishermen.. Seized five trawlers..
Author
First Published Nov 29, 2022, 2:57 PM IST

తమ దేశ ప్రాదేశిక జలాల్లోకి వచ్చి వేటాడుతున్నారనే కారణంతో 24 మంది భారత జాలర్లను శ్రీలంక నేవి అరెస్టు చేసింది. వారి వద్ద నుంచి ఐదు ట్రాలర్లను స్వాధీనం చేసుకొని సీజ్ చేసింది. ఉత్తర జాఫ్నా ద్వీపకల్పంలోని కరైనగర్ తీరంలో సోమవారం సాయంత్రం శ్రీలంక నేవీ, ఆ దేశ కోస్ట్ గార్డ్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ లో ఈ పరిణామం చోటు చేసుకుంది.

ఆ జాబితాలో ఆప్ టాప్.. కాంగ్రెస్, బీజేపీలు ఆ తర్వత స్థానాల్లో..

మత్స్యకారులను అరెస్టు చేసిన తరువాత వారిని కంకేసంతురై నౌకాశ్రయానికి తీసుకెళ్లారు. అనంతరం వారిని తదుపరి చర్యల కోసం ఫిషింగ్ ఇన్స్ పెక్టరేట్ కు అప్పగించినట్టు ఆ దేశ నేవీ తెలిపింది. కాగా.. శ్రీలంక జలాల్లో వేటకు పాల్పడినందుకు ఈ ఏడాది ఇప్పటివరకు మొత్తం 252 మంది భారతీయ జాలర్లను అరెస్టు చేసినట్లు నేవీ తెలిపింది.

భారత్, శ్రీలంక మధ్య సంబంధాలలో మత్స్యకారుల సమస్య వివాదాస్పదంగానే ఉంది. శ్రీలంక నేవీ పాక్ జలసంధిలో భారతీయ మత్స్యకారులపై కాల్పులు జరిపిన ఘటనలు ఉన్నాయి. శ్రీలంక ప్రాదేశిక జలాల్లోకి అక్రమంగా ప్రవేశించిన అనేక సందర్భాల్లో వారి పడవలను స్వాధీనం చేసుకున్నారు. ఈ పాక్ జలసంధి తమిళనాడును శ్రీలంక ను వేరు చేస్తుంది. ఈ ఇరుకైన జలసంధి ఇరు దేశాల మత్స్యకారులకు చేపలు పట్టుకునేందుకు అనువైన ప్రదేశం. ఈ అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖను దాటి పొరపాటున శ్రీలంక జలాల్లో చేపలు పట్టిన అనేక సందర్భాల్లో భారతీయ మత్స్యకారులను అక్కడి అధికారులు అరెస్టు చేస్తున్నారు. 

టీకాలు థర్డ్ పార్టీలు తయారు చేశాయ్.. మరణాలకు ప్రభుత్వం బాధ్యత వహించదు: సుప్రీంకోర్టులో కేంద్రం

కాగా.. ఇలా అరెస్టయి శ్రీలంక దేశంలో ఉన్న భారతీయ మత్స్యకారులను, అలాగే అక్కడి నేవి స్వాధీనం చేసుకున్న పడవలను విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వానికి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సోమవారం విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన భారత విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ కు లేఖ రాశారు. ఈ ఏడాదిలో 221 మంది తమిళనాడు మత్స్యకారులను శ్రీలంక నేవీ అరెస్టు చేసిందని అందులో పేర్కొన్నారు.

ఇంటికి వెళ్లేందుకు ర్యాపిడో బుక్ చేసుకుంటే.. స్నేహితుడితో కలిసి అత్యాచారం చేసిన రైడర్..

‘‘ శ్రీలంక నావికాదళం పదేపదే అరెస్టులు చేయడం వల్ల తమిళనాడులోని మత్స్యకారుల సమాజంలో తీవ్రమైన ఒత్తిడి, వేదన కలుగుతోంది. వారు కేవలం చేపలు పట్టడంపై ఆధారపడి జీవిస్తున్నారు. ప్రస్తుతం తమిళనాడుకు చెందిన 105 ఫిషింగ్ బోట్లు శ్రీలంక ఆధీనంలో ఉన్నాయి. ప్రభుత్వం నిరంతర కృషి కారణంగా గతంలో పట్టుబడిన మత్స్యకారులను శ్రీలంక విడుదల చేసింది ’’ అని అన్నారు. కాబట్టి శ్రీలంక నావికాదళం భారత మత్స్యకారులను పట్టుకోకుండా నిరోధించడానికి అవసరమైన దౌత్యపరమైన చర్యలు తీసుకోవాలని, శ్రీలంక అదుపులో ఉన్న మత్స్యకారులు, వారి ఫిషింగ్ బోట్లను త్వరగా విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వాన్ని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కోరారు.  

Follow Us:
Download App:
  • android
  • ios