Asianet News TeluguAsianet News Telugu

ఆ జాబితాలో ఆప్ టాప్.. కాంగ్రెస్, బీజేపీలు ఆ తర్వత స్థానాల్లో.. 

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు: కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ (బిజెపి) మరియు ఆప్ నుండి 96 మంది సహా మొత్తం 192 మంది అభ్యర్థులపై హత్య, అత్యాచారం,హత్యాయత్నానికి సంబంధించిన తీవ్రమైన నేరాల కింద కేసు నమోదు చేయబడ్డాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక వెల్లడించింది. 
 

Most Gujarat Poll Candidates With Criminal Record From AAP, BJP: Report
Author
First Published Nov 29, 2022, 2:47 PM IST

సార్వత్రిక ఎన్నికలకు సెమి ఫైనల్ గా భావిస్తున్న గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కు సమయం దగ్గర పడుతోంది. ఎలాగైనా అధికారం చేపట్టాలనే  లక్ష్యంతో బీజేపీ, కాంగ్రెస్, ఆప్ లు ప్రణాళికలు సిద్దం చేస్తున్నాయి. మరోసారి సీఎం పీఠాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తుండగా.. ఎలాగైనా  అధికార పగ్గాలను దక్కించుకోవాలని ఆప్, కాంగ్రెస్ లు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఈ క్రమంలో పార్టీ తమ తమ గెలుపు గుర్రాలను బరిలోకి దించారు. ప్రణాళికలకు తగ్గట్టుగా పార్టీలు తమ అభ్యర్థుల పేర్లను వెల్లడించాయి. 

అయితే.. డిసెంబరు 1న జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్తులను పరిశీలిస్తే.. గతంలో కంటే ఎక్కువ మంది అభ్యర్థులు నేర చరిత్ర ఉన్నవారేనని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్)  తన నివేదికలో వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 1,621 మంది అభ్యర్థుల్లో 330 మంది అంటే దాదాపు 20 శాతం అభ్యర్థులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయని వెల్లడించింది. ఆ జాబితాలో అత్యధిక మంది(61) నేర చరిత్ర ఉన్న వారు ఆమ్ ఆద్మి పార్టీ ఉండే ఉన్నారని తెలిపింది,  గతంతో పోల్చితే.. బీజేపీ అభ్యర్థుల్లో నేర చరిత్ర ఉన్నవారి సంఖ్య తగ్గిందని,  కాంగ్రెస్‌లో మాత్రం ఎలాంటి మార్పూ లేదని నివేదిక వివరించింది.

 2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్థుల సంఖ్య 238 గా ఉందని వివరించింది. తొలి విడత ఎన్నికల్లో పోటీ చేస్తున్న 788 అభ్యర్ధుల్లో 170 మంది వరకూ నేరచరితులు గలవారు ఉన్నారనీ, వీరంతా క్రిమినల్ కేసులున్నాయనీ.వీరిలో 100 మందిపై అత్యాచారం,హత్య వంటి అతి తీవ్ర నేరాలు కూడా నమోదై ఉన్నాయని నివేదిక పేర్కొంది. పార్టీల పరంగా పరిశీలిస్తే.. తొలివిడతలో ఆమ్ ఆద్మీ పార్టీ 89 సీట్లకు గానూ 88 సీట్లలో పోటీ చేస్తున్నది. ఇందులో దాదాపు 30 శాతం అభ్యర్థులపై  హత్య, రేప్, దౌర్జన్యం, కిడ్నాప్ కేసు నమోదయ్యాయని ఏడీఆర్ తెలిపింది.

ఆ తర్వాత స్ధానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉందనీ, తొలివిడతలో పోటీ చేసే వారిలో 20 శాతం కాంగ్రెస్ అభ్యర్ధుల్లో నేరచరిత్ర గలవారే ఉన్నారని తెలిపింది. అలాగే అధికార బీజేపీ తొలి విడుదలలో అన్ని సీట్లలో పోటీ చేస్తుంది. వారిలో12 శాతం అభ్యర్తులపై క్రిమినల్ కేసులున్నాయని. ఈ జాబితాలో ఆప్ టాప్ లో నిలిచిందని నివేదిక పేర్కొంది. 

రెండు దశల అభ్యర్థుల సర్వే అనంతరం ఏడీఆర్ సోమవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం.. అత్యధిక మంది(61) నేర చరిత్ర ఉన్న వారు ఆమ్ ఆద్మి పార్టీ ఉండే ఉన్నారని తెలిపింది. కాంగ్రెస్‌కు చెందిన 60 మంది అభ్యర్థులపై, అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి చెందిన 32 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. మొత్తం 192 మంది అభ్యర్థులపై హత్య, అత్యాచారం, హత్యాయత్నానికి సంబంధించిన తీవ్రమైన నేరాల కింద కేసులు నమోదు ఉన్నాయని తెలిపింది.

రెండు విడతల్లో తీవ్రమైన నేరాలకు పాల్పడిన అభ్యర్థుల విషయానికొస్తే.. ఆప్ 43 మందితో అగ్రస్థానంలో ఉండగా.. కాంగ్రెస్ 28,  బీజేపీ 25 మందితో రెండు, మూడు స్థానంలో నిలిచాయి.ఆప్, కాంగ్రెస్ ,బీజేపీ నుండి వరుసగా 181, 179 మరియు 182 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.  

తీవ్రమైన నేరాలను నాన్-బెయిలబుల్ నేరాలుగా నిర్వచిస్తున్నట్లు ADR తెలిపింది. అంటే.. గరిష్టంగా ఐదేళ్లు మరియు అంతకంటే ఎక్కువ శిక్ష పడిన వారు. దాడి, హత్య, కిడ్నాప్, అత్యాచారం, అలాగే మహిళలపై నేరాలు మరియు అవినీతి కేసులకు సంబంధించిన నేరాలకు సంబంధించిన నాన్ బెయిలబుల్ నేరాలుగా పరిగణిస్తారు. 18 మంది అభ్యర్థులు మహిళలపై నేరాలకు పాల్పడగా, ఒక అభ్యర్థిపై అత్యాచారం ఆరోపణలున్నాయి.ఐదుగురిపై హత్య ఆరోపణలు  ఉండగా.. మరో 20 మందిపై హత్యకు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

అహ్మదాబాద్ జిల్లాలోని దస్క్రోయ్ స్థానం నుంచి ఆప్ టికెట్‌పై పోటీ చేస్తున్న కిరణ్ పటేల్‌పై హత్య కేసు నమోదైంది. పటాన్ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్థి కిరీట్ పటేల్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేయగా, పంచమహల్ జిల్లాలోని షెహ్రా స్థానం నుండి పోటీ చేస్తున్న బిజెపికి చెందిన జెథా భర్వాద్ పై అత్యాచారం,అపహరణ,దోపిడీ,రెచ్చగొట్టడం వంటి అభియోగాలు మోపబడ్డాయి. అభ్యర్థుల ఎంపిక చేసే విషయంలో రాజకీయ పార్టీలు ..సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించలేదని ఏడీఆర్ తన నివేదికలో పేర్కొంది.

Follow Us:
Download App:
  • android
  • ios