Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీలో దారుణ హత్య.. ప్రేయసిని 35 ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్‌లో దాచి.. 18 రోజులపాటు బయట పడేశాడు: పోలీసులు

లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న కపుల్ వారి సంబంధాన్ని పెద్దలు వ్యతిరేకిస్తున్నారని చెప్పాపెట్టకుండా ఢిల్లీకి పారిపోయారు. అక్కడ పెళ్లి గురించి మొదలైన గొడవతో ప్రేయసిని ప్రియుడు అత్యంత దారుణంగా హతమార్చాడు. ఆమె డెడ్ బాడీని 35 ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్‌లో దాచాడు. ఆ తర్వాత ప్రతి రోజు రాత్రి సుమారు 2 గంటల ప్రాంతంలో వాటిని సమీప అడవిలో పడేశాడు.
 

spine chilling delhi murder, partner killed and kept body in 35 pieces in fridge
Author
First Published Nov 14, 2022, 11:08 PM IST

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తనతో లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉంటున్న ప్రేయసిని ఆ ప్రియుడు అమానుషంగా చంపేశాడు. గొంతు నులిమి హత్య చేసి ఆ తర్వాత ఆమె బాడీని 35 ముక్కలుగా నరికేశాడు. ఆ బాడీ కుళ్లిపోయి దుర్వాసన రాకుండా ఉండటానికి 300 లీటర్ల ఫ్రిడ్జ్‌ను కొనుక్కొచ్చాడు. అందులో ఆ డెడ్ బాడీ ముక్కలను ఉంచి 18 రోజులపాటు బయట పడేశాడు. రోజు రాత్రి సుమారు 2 గంటల సమయంలో ఆ బాడీ పార్టులను సంచిలో తీసుకెళ్లి వేర్వేరు చోట్ల పడేసి వచ్చాడు. ఇంత కిరాతకంగా ప్రియురాలిని హతమార్చి కూడా సుమారు ఐదు ఆరు నెలలుగా స్వేచ్ఛగా తిరిగాడు. ఈ రోజు ఢిల్లీ పోలీసులు ఈ హంతకుడిని అరెస్టు చేశారు. ఐదు రోజుల పోలీసు కస్టడీలో ఇప్పుడు ఆ నిందితుడు ఉన్నాడు.

28 ఏళ్ల అఫ్తాబ్ అమీన్ పూనావాలా, 26 ఏళ్ల శ్రద్ధలు ముంబయిలో ఒకరికి ఒకరు పరిచయం అయ్యారు. శ్రద్ధ ఓ మల్టీ నేషనల్ కంపెనీ కాల్ సెంటర్‌లో పని చేసేది. అదే సమయంలో ఆమెకు పూనావాలా పరిచయం అయ్యాడు. కొన్నాళ్లు డేటింగ్ చేశారు. కానీ, వారి మధ్య సంబంధాన్ని పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో ఎవరికీ చెప్పా పెట్టకుండా ఏప్రిల్ చివరలో లేదా మే తొలి వారంలో ఇద్దరూ ఢిల్లీకి పారిపోయారు. మెహ్రౌలీలో ఓ ఫ్లాట్‌లో జీవించడం మొదలు పెట్టారు.

Also Read: మతి స్థిమితం లేని సోదరి నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్లూచేతులు కట్టేసి హత్య.. గుట్టుచప్పుడు కాకుండా పూడ్చి పెట్టి.

ఢిల్లీలో నివాసం ఉంటున్నప్పుడు వారిద్దరి మధ్య పెళ్లి విషయమై తరుచూ గొడవలు జరిగేవి. మే మధ్యలో ఈ గొడవలు పతాకస్థాయికి చేరాయి. మే 18వ తేదీన ఇలాంటి గొడవలోనే అఫ్తాబ్ ఆమె గొంతు నులిమి చంపేశాడు. ఆమె డెడ్ బాడీని ఫ్రిడ్జ్‌లో నిల్వ చేశాడని దక్షిణ ఢిల్లీ డీసీపీ1 అంకిత్ చౌహాన్ తెలిపారు.

కొన్నాళ్లుగా శ్రద్ధ గురించిన వివరాలేమీ అందలేవు. ఆమె సోషల్ మీడియా యాక్టివిటీలు, ఫోన్ నెంబర్లూ కూడా నిలిచిపోయాయి. దీంతో ఆమె తండ్రి వికాస్ మదన్ వాకర్ తన కుమార్తె కనిపించడం లేదని ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారి ప్రాథమిక దర్యాప్తులో చివరి లొకేషన్‌ ఢిల్లీలో చూపెట్టింది. దీంతో ఆయన ఢిల్లీకి వెళ్లి ఫ్లాట్‌ను చూస్తే.. తాళం వేసి ఉన్నది. దీంతో ఆయన మెహ్రౌలీ పోలీసు స్టేషన్‌లో తన కుమార్తెను కిడ్నాప్ చేశారని కంప్లైంట్ చేశాడు. అఫ్తాబ్‌తో సంబంధాన్నీ వివరించాడు. దీంతో ఆయనపై పోలీసులు ఫోకస్ పెట్టడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

Also Read: గొడ్డళ్లతో వేటాడి, కంట్లో కారం కొట్టి యువకుడి హత్య.. కొడుకును చంపిన వ్యక్తిపై ప్రతీకారం..

అప్థాబ్ తాను హత్య చేసింది.. ఎలా డిస్పోజ్ చేసిందీ అన్నీ పోలీసులకు వివరించాడు. పోలీసులు ఇప్పుడు పూనావాలాపై మర్డర్ కేసు పెట్టారు. ఆయన చెప్పినట్టు మెహ్రౌలీలోని ఫారెస్ట్ ఏరియాలో బాడీ పార్టులను పోలీసులు వెతికి పట్టుకున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios