Asianet News TeluguAsianet News Telugu

మతి స్థిమితం లేని సోదరి నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్లూచేతులు కట్టేసి హత్య.. గుట్టుచప్పుడు కాకుండా పూడ్చిపెట్టి.

మతి స్థిమితంలేని మహిళ వల్ల పరువు పోతోందని భావించిన సోదరి, ఆమె భర్త దారుణంగా హత్య చేశారు. ఆ తరువాత విషయం బైటికి పొక్కకుండా గుట్టు చప్పుడు కాకుండా పాతిపెట్టారు. రెండేళ్ల తరువాత విషయం వెలుగులోకి వచ్చింది. 

sister and her husband assassinated woman over her mental illness in karnataka
Author
First Published Nov 12, 2022, 10:01 AM IST

మైసూరు : మానసిక స్థితి సరిగాలేని మహిళను ఆమె సోదరి దంపతులు హతమార్చారు. సుమారు రెండు సంవత్సరాల తర్వాత ఈ ఘోరం వెలుగు చూసింది. చామరాజనగర్ కు చెందిన లక్ష్మిని ఆమె సోదరి రూపా, భర్త సిద్ధరాజు తో కలిసి హత్య చేసింది.  వివరాల ప్రకారం.. హేమ కుమార్తె అయిన లక్ష్మిని తమిళనాడులోని తిరువణ్ణామలైకి చెందిన రాజేష్ కు ఇచ్చి పెళ్లి చేశారు. ఆమెకు  ఏడేళ్ల  ప్రీతం అనే కుమారుడు కూడా ఉన్నాడు. గత ఐదు సంవత్సరాల నుంచి లక్ష్మి మానసిక అస్వస్థతకు గురి కావడంతో భర్త ఆమెను పుట్టింట్లోనే వదిలిపెట్టాడు.

అక్కడ రాయన హుండీ గ్రామంలో ఆమె సోదరి రూపా ఇంట్లో ఉండేది. రెండేళ్ల క్రితం లక్ష్మీ మతిస్థిమితం పూర్తిగా కోల్పోయింది. దీంతో ఉద్రేకంగా ప్రవర్తించ సాగింది. ఆమె ప్రవర్తనతో నలుగురిలో తమ మర్యాద పోతుంది అని.. ఆగ్రహంతో లక్ష్మీ కాళ్లు చేతులు కట్టి వేసి.. నోట్లో బట్టలు కుక్కారు రూపా, ఆమె భర్త సిద్ధరాజు. ఆ తరువాత ఇద్దరూ కలిసి ఇంటికి తాళం వేసి పనిమీద బయటికి వెళ్ళిపోయారు. 

‘ఇక నుంచి నువ్వు నా భార్యవు’.. తోటి విద్యార్థినిని బెదిరించి, తాళికట్టి.. అత్యాచారం...

ఆ తరువాత, సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా లక్ష్మీ ఊపిరి ఆడక చనిపోయి కనించింది. దీంతో ఏం చేయాలో పాలుపోలేదు. విషయం బైటికి తెలిస్తే.. తమనే తప్పుపడతారనుకున్నారు. అంతే గుట్టుగా ఇంటి వెనకాల అర్ధరాత్రి గుంత తీసి పూడ్చిపెట్టారు. మతిస్థిమితం లేదు కాబట్టి.. ఇంట్లోనుంచి ఎక్కడికో వెళ్లి పోయిందని బంధువులకు చెప్పారు. అయితే, తల్లికి మాత్రం అనుమానం వచ్చింది. దీంతో, ఇటీవల తల్లి గట్టిగా నిలదీయడంతో రూప అసలు విషయం చెప్పింది. తల్లి వరుణా పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. 

ఇదిలా ఉండగా, తమ కుమారుడిని హతమార్చిన యువకుడిని అంతమొందించేందుకు ఆ తల్లిదండ్రులు రెండేళ్లుగా వెయిట్ చేశారు. అదను చూసి గొడ్డలతో వేటాడి ప్రతీకార హత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణలోని, సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం చిన్న చెల్మెడకు చెందిన బేగరి ఆనంద్.. అదే గ్రామానికి చెందిన తలారి ప్రవీణ్ ను 2020 అక్టోబర్ లో హత్య చేశాడు. జూదం ఆడుతుండగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ గొడవలో మాటా మాటా పెరిగింది. దీంతో ఆవేశంతో హత్య చేయడంతో ఈ ఘటనకు దారితీసింది. ఈ కేసులో ఆనంద్ ఏడాది జైలు జీవితం గడిపి ఇటీవలే బయటికి వచ్చాడు.

సంగారెడ్డిలోనే ఉంటూ ఓ ప్రైవేట్ పరిశ్రమలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నెల 9న చిన్న చెల్మెడలోని బంధువుల ఇంట్లో శుభకార్యం ఉంటే వెళ్ళాడు. శుక్రవారం ఉదయం బయటకు వచ్చిన ఆనంద్ ను గమనించిన ప్రవీణ్ తండ్రి అంబయ్య, తల్లి స్వరూప, సోదరుడు ప్రభుదాస్ గొడ్డళ్లతో ఆనంద్ ను గొడ్డళ్లతో వెంబడించారు. వెంట తెచ్చుకున్న కారం కళ్ళలో కొట్టారు. చిన్న చల్మెడ గ్రామ కూడలిలో తల, చేతులను నరికి వేసి.. దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత నిందితులు బుధేరా పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. సదాశివపేట గ్రామీణ సీఐ సంతోష్ కుమార్, మునిపల్లి ఎస్సై రాజశేఖర్ ఘటనా స్థలానికి, చేరుకుని వివరాలు సేకరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios