Asianet News TeluguAsianet News Telugu

రియల్ ‘సింగం’.. కత్తులతో బెదిరించి చోరీ చేసి... పారిపోతున్న దొంగలను ఛేజ్ చేసి పట్టుకున్న ఎస్పీ..

సాళవన్ ప్రాంతానికి చెందిన కిశోర్, అతడి ఇద్దరి స్నేహితులు కత్తులతో బెదిరించి సతీశ్ వద్ద ఉన్న సొమ్మును కాజేశారు. అనంతరం బైక్ మీద పరారయ్యారు. అదే సమయంలో అటుగా వాహనంలో వెల్తున్న జిల్లా ఎస్పీ సెల్వకుమార్ కంట పడ్డారు. నిందితులను చూసిన ఎస్పీ వారి వాహనాన్ని అడ్డగించాలని డ్రైవర్ ను ఆదేశించాడు.

sp chased thief who trying to attack with knife and run in tamilnadu
Author
Hyderabad, First Published Nov 26, 2021, 1:47 PM IST

తమిళనాడు. చోరీ చేసి పారిపోతున్న దొంగలను District SPనే స్వయంగా ఛేజ్ చేసి మరీ పట్టుకున్నారు. ‘సింగం’ సినిమాను తలపించే ఈ ఘటన 
Tamil Nadu రాష్ట్రంలోని వెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో Social mediaలో వైరల్ గా మారంది. పల్లికొండకు చెందిన సతీశ్ వెల్లూరు గ్రీన్ సర్కిల్ వద్ద టాటూ వ్యాపారం చేస్తుంటాడు. 

సాళవన్ ప్రాంతానికి చెందిన కిశోర్, అతడి ఇద్దరి స్నేహితులు కత్తులతో బెదిరించి సతీశ్ వద్ద ఉన్న సొమ్మును కాజేశారు. అనంతరం బైక్ మీద పరారయ్యారు. అదే సమయంలో అటుగా వాహనంలో వెల్తున్న జిల్లా ఎస్పీ సెల్వకుమార్ కంట పడ్డారు. నిందితులను చూసిన ఎస్పీ వారి వాహనాన్ని అడ్డగించాలని డ్రైవర్ ను ఆదేశించాడు.

అయితే Police vehicleని చూసిన నిందితులు వేగంగా వెళ్లే క్రమంలో అదుపుతప్పి బోల్తా పడ్డారు. ఒకడు బైక్ మీద ఉడాయించగా, ఇద్దరు నిందితులు పరుగందుకున్నారు. ఎస్పీనే స్వయంగా వెంబడించి నిందితులను పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ. 1,200 నగదు, సెల్ ఫోన్, కత్తి, కొడవలిని స్వాధీనం చేసుకున్నారు. 

తప్పించుకున్న మరో నిందితుడిని ఘటన జరిగిన గంటలోపే పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను అరెస్ట్ చేయడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్పీతో సహా పోలీసు సిబ్బందిని ప్రజలు అభినందించారు. నిందితులంతా మైనర్లే కావడం గమనార్హం. 

ఇదిలా ఉండగా, గతవారంలో తమిళనాడులో దొంగల చేతుల్లో ఇద్దరు పోలీసు అధికారులు హతమయ్యారు. మొదట మేకల దొంగల చేతుల్లో ఎస్ఐ హత్యకు గురైన ఘటన మరువక ముందే రెండు రోజుల తేడాతో తమిళనాడులో అలాంటిదే మరో ఘటన చోటు చేసుకుంది. తనిఖీల్లో ఉన్న Motor Vehicle Inspector (ఎంవీఐ)ను వాహనంతో ఢీ కొట్టి హతమార్చిన ఘటన కరూర్ లో సోమవారం ఉదయం జరిగింది. సీసీ కెమెరాల ఆధారంగా వాహనాన్ని గుర్తంచిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.

26/11 Mumbai Attacks: మారణకాండకు 13ఏళ్లు.. దక్కని న్యాయం.. పాకిస్తాన్ కుట్రే అని తేల్చే ఆధారాలివే

కరూర్ రీజనల్ ట్రాన్స్ పోర్ట్ కార్యాలయంలో ఇన్ స్పెక్టర్ గాKanakaraj పనిచేస్తున్నారు. సోమవారం ఉదయం కరూర్ బైపాస్ రోడ్డులోని పుత్తాం పుదుర్ వద్ద Inspection of vehiclesలు చేస్తున్నారు. ఆ సమయంలో అటుగా వచ్చిన ఓ వాహనం ఆయన్ని ఢీ కొట్టి వెళ్లి పోయింది. మొదట దీనిని Accidentగా భావించారు. 

గాయపడ్డ ఆయన్ను ఆస్పత్రికి తరలించగా చికిత్స తీసుకుంటూ మరణించారు. రంగంలోకి దిగిన కరూర్ పోలీసులు సీసీ కెమెరాల్లోని దృశ్యాల ఆధారంగా విచారణ చేశారు. ఓ వ్యాన్ మహిళలను ఎక్కించుకుని అతి వేగంగా వెళ్లడాన్ని గుర్తించారు. ఎలాంటి అనుమతులు పొందకుండా ఓ Textile companyకు చెందిన వ్యాన్ అధిక లోడింగ్ తో వెళ్తూ, ఆపేందుకు యత్నించిన కనకరాజ్ ను ఢీ కొట్టి వెళ్లినట్టు తేలింది. 

వ్యాన్ ను పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న Driver కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనను సీఎం ఎంకే స్టాలిన్ తీవ్రంగా పరిగణించారు. నిందితులను అరెస్ట్ చేయాలని ఆదేశించారు. మృతుడి కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ప్రకటించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios