త్వరలోనే ‘కింగ్ పిన్’ కూడా జైలులో ఉంటారు - కేజ్రీవాల్ ను ఉద్దేశించి అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో ‘కింగ్ పిన్’ ప్రస్తుతానికి బయటే ఉన్నారని, త్వరలోనే ఆయన కూడా జైలుకు వెళ్తారని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఉద్దేశించి అన్నారు. కేజ్రీవాల్ నిజాయితీ సర్టిఫికెట్ ఇచ్చిన వారంతా ప్రస్తుతం జైలులోనే ఉన్నారని తెలిపారు.

ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత, ఎంపీ సంజయ్ సింగ్ బుధవారం సాయంత్రం అరెస్టు అయ్యారు. సుమారు 10 గంటల పాటు విచారించిన తరువాత ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆయనను అదుపులోకి తీసుకుంది. ఈ అరెస్టు నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వంపై కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ గురువారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అలాగే సీఎం కేజ్రీవాల్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఈ కేసులో ‘కింగ్ పిన్’ కూడా జైలులో ఉంటారని అన్నారు.
రెడ్ సిగ్నల్ జంప్ చేసి, వేగంగా కారును ఢీకొట్టిన బస్సు.. 10 మందికి గాయాలు.. వీడియో వైరల్
కేజ్రీవాల్ నిజాయితీ సర్టిఫికెట్ ఇచ్చిన వారు జైల్లో ఉన్నారని, ఆయన కూడా త్వరలోనే జైలులో ఉంటారని విమర్శించారు. ‘‘అరవింద్ కేజ్రీవాల్ ను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. ఆయన ముఖంలో టెన్షన్ కనిపిస్తోంది. డిప్యూటీ సీఎం జైల్లో ఉన్నారు. ఆరోగ్య మంత్రి జైల్లో ఉన్నారు, ఇండియాలో అవినీతికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు వచ్చిన వారే ఇప్పుడు అవినీతికి పాల్పడుతున్నారు’’ అని అనురాగ్ ఠాకూర్ అన్నారు.
మణిపూర్ లో మళ్లీ చెలరేగిన హింస.. ఇంఫాల్ లో రెండు ఇళ్లు దహనం, కాల్పుల మోత
ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఇతరులు జైలుకు వెళ్లారని, ఇక ఇప్పుడు బయట ఉన్న దాని ‘కింగ్ పిన్’ వంతు వచ్చిందని తెలిపారు. ‘‘అతడి నెంబర్ కూడా వస్తుంది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. అరవింద్ కేజ్రీవాల్ నిజాయితీ సర్టిఫికెట్ ఇచ్చిన వారంతా ఏడాది పాటు జైల్లోనే ఉన్నారు’’ అని కేంద్ర మంత్రి విమర్శించారు. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధికారంలోకి వచ్చిందని ఆయన అన్నారు. కానీ రెండు నెలల్లోనే అవినీతి కారణంగా రాష్ట్ర ఆరోగ్య మంత్రి పదవి నుండి వైదొలగవలసి వచ్చిందని అనురాగ్ ఠాకూర్ విమర్శించారు.
ఇదిలా ఉండగా.. ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఎంపీ సంజయ్ సింగ్ అరెస్టును ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఖండించారు. ‘‘సంజయ్ సింగ్ అరెస్టు పూర్తిగా చట్టవిరుద్ధం. ఇది మోడీ భయాన్ని తెలియజేస్తోంది. ఎన్నికల వరకు ఇంకా చాలా మంది ప్రతిపక్ష నేతలను అరెస్టు చేస్తారు’’ అని కేజ్రీవాల్ అన్నారు.
వందే భారత్ రైళ్లకు ఆరెంజ్ కలర్.. దీని వెనక రాజకీయ కారణముందా ? కేంద్ర రైల్వే మంత్రి ఏం చెప్పారంటే ?
కాగా.. సంజయ్ సింగ్ ఢిల్లీలోని ఆయన నివాసంలో గంటల తరబడి సోదాలు నిర్వహించిన అనంతరం ఆయనను అరెస్టు చేశారు. ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ ల తర్వాత ఆయనకు సంబంధం ఉన్న నాలుగు కంపెనీల ద్వారా మనీలాండరింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈ అరెస్టు జరిగింది. రద్దు అయిన ఢిల్లీ మద్యం విధానాన్ని రూపొందించడంలో, అమలు చేయడంలో సంజయ్ సింగ్ కీలక పాత్ర పోషించారని, ఇది కొంతమంది మద్యం తయారీదారులు, హోల్సేల్ వ్యాపారులు, రిటైలర్లకు ప్రయోజనం చేకూర్చిందని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది.