కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ గ్యాస్ సమస్యతో మరోసారి ఢిల్లీ గంగారాం ఆస్పత్రిలో చేరారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఆరోగ్య సమస్యలతో ఆమె జూన్ 15వ తేదీన ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రిలో చేరారు. గ్యాస్ సమస్యలతో బాధపడుతున్న ఆమెను వైద్యులు గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగంలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
ఆమె ప్రస్తుతానికి బాగానే ఉన్నారని వైద్యులు స్పష్టం చేశారు. అయితే పూర్తి విశ్రాంతి అవసరమని పేర్కొన్నారు. సోనియాను డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచినట్టు సమాచారం.సోనియా గాంధీ ఇలా ఆసుపత్రిలో చేరడం ఇది మొదటిసారి కాదు. గతంలో జూన్ 7న హిమాచల్ ప్రదేశ్‌లోని శిమ్లా ప్రాంతంలోని ఇందిరా గాంధీ మెడికల్ కళాశాలలోనూ ఆమె చికిత్స పొందారు.
ఆ సమయంలోనూ ఆరోగ్య సమస్యలే కారణమయ్యాయి. అలాగే ఫిబ్రవరిలో కూడా ఆమె ఢిల్లీలో గంగారాం ఆస్పత్రిలో గ్యాస్ట్రిక్ సమస్యలతో చేరినట్లు తెలుస్తుంది.తాజాగా మళ్లీ ఆసుపత్రిలో చేరడం కాంగ్రెస్ వర్గాల్లో ఆందోళనకు దారితీసింది. అయినప్పటికీ, ఆమె ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారన్న సమాచారం ద్వారా ఊరట కలిగింది. ప్రస్తుతం ఆమెను పూర్తిగా విశ్రాంతి తీసుకునేలా చేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.


