Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర.. పాల్గొన్న సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ..

ఢిల్లీలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్రలో కాాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పాల్గొన్నారు. అలాగే ఆమె కూతురు ప్రియాంక గాంధీ, అల్లుడు వాద్రా కూడా ఇందులో పాల్గొని, రాహుల్ గాంధీతో కలిసి నడిచారు. 

Sonia Gandhi and Priyanka Gandhi participated in the ongoing Bharat Jodo Yatra in Delhi.
Author
First Published Dec 24, 2022, 12:13 PM IST

భారత్ జోడో యాత్ర శనివారం ఢిల్లీలోకి అడుగుపెట్టింది. అయితే ఈ యాత్రలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, ఆమె భర్త వాద్రా పాల్గొన్నారు. రాహుల్ గాంధీతో కలిసి నడిచారు. కాగా.. అంతకు ముందు కర్ణాటకలో ఈ పాదయాత్ర కొనసాగుతున్న సమయంలో కూడా సోనియా గాంధీ పాల్గొన్నారు. రాజస్థాన్ లో ఈ యాత్ర ముగిసిన తరువాత ఈ వారం ప్రారంభంలో రాహుల్ గాంధీ బీజేపీ పాలిత రాష్ట్రమైన హర్యానాలోకి అడుగుపెట్టారు. 

మీ విద్వేష బజార్‌లో ప్రేమ దుకాణం తెరవడానికి వచ్చాం.. : బీజేపీ, ఆరెస్సెస్ లపై రాహుల్ గాంధీ ఫైర్

తమిళనాడు రాష్ట్రంలో సెప్టెంబరు 7వ తేదీన కన్యాకుమారి నుంచి ప్రారంభమైన భారత్ జోడో యాత్ర యాత్ర ఇప్పటివరకు తొమ్మిది రాష్ట్రాల్లో సాగింది. జనవరి చివరి నాటికి రాహుల్ యాత్ర జమ్మూ కాశ్మీర్‌లో ముగియనుంది. రాహుల్ యాత్ర ఇప్పటివరకు తమిళనాడు, కేరళ, కర్ణాటక,  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానాలోని తొమ్మిది రాష్ట్రాల్లోని 46 జిల్లాల్లో దాదాపు 3,000 కిలోమీటర్ల మేర సాగింది. ఈ యాత్ర కొనసాగుతున్న అనేక రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో జనాలు పాల్గొంటున్నారు.

భారత్ జోడో యాత్ర దక్షిణాన కన్యాకుమారి నుండి ఉత్తరాన కాశ్మీర్ వరకు దాదాపు ఐదు నెలల వ్యవధిలో 3,570 కిలో మీటర్లు నడవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే భారతదేశ చరిత్రలో ఏ భారతీయ రాజకీయ నాయకుడు ఇన్ని కిలో మీటర్లు పాదయాత్ర చేపట్టలేదని కాంగ్రెస్ పేర్కొంది. సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో ప్రారంభమైన పాదయాత్ర వచ్చే ఏడాది కాశ్మీర్‌లో ముగియనుంది.

క్రిస్మస్ వేడుకల సందర్భంగా మతమార్పిడులు జరగకూడదు - అధికారులకు యూపీ సీఎం యోగి ఆదేశాలు

ఈ యాత్ర పలు రాష్ట్రాల గుండా కొనసాగే సమయంలో సమయంలో ఆయా రాష్ట్రాల్లో ఉండే ప్రముఖులు, సినీ నటులు, ఇతర రంగాలకు చెందిన వ్యక్తులు రాహుల్ గాంధీతో కలిసి నడుస్తున్నారు. ఇప్పటి వరకు పూజా భట్, రియా సేన్, సుశాంత్ సింగ్, స్వరా భాస్కర్, రష్మీ దేశాయ్, ఆకాంక్ష పూరి, అమోల్ పాలేకర్ వంటి సినీ, టీవీ ప్రముఖులు ఇందులో పాల్గొన్నారు.

మాజీ నేవీ చీఫ్ అడ్మిరల్ ఎల్ రాందాస్, శివసేనకు చెందిన ఆదిత్య థాకరే, ఎన్‌సీపీకి చెందిన సుప్రియా సూలే వంటి ప్రతిపక్ష నాయకులు, మహాత్మా గాంధీ ముని మనవడు తుషార్ గాంధీ, ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్‌తో పాటు రచయితలు వివిధ ప్రాంతాలలో ఈ మార్చ్ లో చేరారు. ప్రస్తుత హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ సుఖు, డిప్యూటీ ముఖేష్ అగ్నిహోత్రి, ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ప్రతిభా సింగ్ రాహుల్ గాంధీతో కలిసి నడిచారు.

పోర్న్ స్టార్ బ్లాక్ మెయిల్ చేస్తోంది.. వీడియో తీసుకుని ఫ్యామిలీ ఆత్మహత్యాయత్నం, పరిస్తితి విషమం..

కాగా.. కరోనా వైర‌స్ ప్రోటోకాల్స్ పాటించకపోతే భారత్ జోడో యాత్రను నిలిపివేయడం లేదా వాయిదా వేయడం గురించి ఆలోచించాలని కోరుతూ కాంగ్రెస్ నాయ‌కుడు రాహుల్ గాంధీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌లకు  ఇటీవల కేంద్ర ఆరోగ్య మంత్రి మాన్సుఖ్ మాండ‌వీయ లేఖ రాశారు. అయితే దీనిపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో మండిపడుతుంది. భారత్ జోడో యాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం కోవిడ్ నిబంధలన పేరుతో డ్రామా ఆడుతోందని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ అన్నారు. భారత్ జోడో యాత్ర ముగిసిన తరువాత జనవరి 26 నుండి యువతతో కనెక్ట్ అయ్యేందుకు ‘హత్ సే హాత్‘ జోడోను ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది.

Follow Us:
Download App:
  • android
  • ios