Asianet News TeluguAsianet News Telugu

మీ విద్వేష బజార్‌లో ప్రేమ దుకాణం తెరవడానికి వచ్చాం.. : బీజేపీ, ఆరెస్సెస్ లపై రాహుల్ గాంధీ ఫైర్

New Delhi: కాంగ్రెస్ నాయ‌కుడు రాహుల్ గాంధీ భార‌త్ జోడో యాత్ర దేశ రాజ‌ధాని ఢిల్లీకి చేరుకుంది. ప్రస్తుతం ఉన్న 'నఫ్రత్ కా బజార్' (విద్వేష మార్కెట్) మధ్య 'మొహబ్బత్ కీ దుకాన్' (ప్రేమ దుకాణం) ను తెరవడమే తన యాత్ర ఉద్దేశ్యమని రాహుల్ గాంధీ పార్టీ కార్యకర్తలు, నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ పునరుద్ఘాటించారు.
 

New Delhi: We have come to open a shop of love in your hate bazaar.. : Rahul Gandhi fires on BJP and RSS
Author
First Published Dec 24, 2022, 11:50 AM IST

Congress Bharat Jodo Yatra: కాంగ్రెస్ మాజీ అధ్య‌క్షుడు, వ‌య‌నాడ్ పార్లమెంట్ స‌భ్యులు రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్ర శనివారం తెల్లవారుజామున దేశ రాజధాని ఢిల్లీలోకి ప్రవేశించింది. ఢిల్లీ యూనిట్ చీఫ్ అనిల్ చౌదరి, పార్టీ శ్రేణులు ఆయ‌న‌కు ఘన‌స్వాగతం పలికారు. కాంగ్రెస్‌ భారత్‌ జోడో యాత్ర శనివారం తెల్లవారుజామున దేశ రాజధానిలో ప్రవేశించిన సందర్భంగా రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ మార్కెట్‌లో ప్రేమ దుకాణం తెరవడానికే వచ్చానని అన్నారు. "కొందరు విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారు, కాని దేశంలోని సామాన్యులు ఇప్పుడు ప్రేమ గురించి మాట్లాడుతున్నారు. ప్రతి రాష్ట్రంలో లక్షలాది మంది భార‌త్ జోడో యాత్రలో చేరారు.. మేము ఆర్‌ఎస్‌ఎస్-బీజేపీ లో చెప్పాను అదేంటంటే.. మీ విద్వేష బజార్ లో ప్రేమ దుకాణం తెర‌వ‌డానికి మేము వ‌చ్చాము" అని రాహుల్ గాంధీ అన్నారు.

 

ప్రస్తుతం ఉన్న 'నఫ్రత్ కా బజార్' (విద్వేష మార్కెట్) మధ్య 'మొహబ్బత్ కీ దుకాన్' (ప్రేమ దుకాణం) ను తెరవడమే తన యాత్ర ఉద్దేశ్యమని ఆయ‌న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ పునరుద్ఘాటించారు. "బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ల విధానాలు భయాన్ని, విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయనీ, దానిని మేము అనుమతించబోమనీ, ద్వేషపూరిత మార్కెట్‌లో ప్రేమ దుకాణాన్ని తెరిచాన‌ని" రాహుల్ గాంధీ అన్నారు. ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అనిల్ చౌదరి నేతృత్వంలో ఢిల్లీ కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బదర్పూర్ లోని ఢిల్లీ సరిహద్దు వద్ద రాహుల్ గాంధీకి, భార‌త్ జోడో యాత్రికులకు స్వాగతం పలికారు. హర్యానాలోని ఫరీదాబాద్ వైపు నుండి యాత్ర ఢిల్లీలోకి ప్రవేశించింది. రాహుల్ వెంట హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా, కుమారి సెల్జా, రణదీప్ సుర్జేవాలా, శక్తిసిన్హ్ గోహిల్ తదితరులు ఉన్నారు.

"ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ద్వేషాన్ని తొలగించాలి. భారతదేశం ఈ స్వరాన్ని మోస్తూ, మేము 'రాజు' సింహాసనం మీదకు వచ్చాము.. మేము దేశ రాజ‌ధానిఢిల్లీకి వచ్చాము. దీన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లడానికి రాజధానిలో మాతో కలిసి రండి' అని కాంగ్రెస్ ట్వీట్ చేసింది. భారత్ జోడో యాత్ర 108వ రోజుకు చేరుకుందని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ట్వీట్ చేశారు. 'గత కొన్ని రోజులుగా అక్కడ తీవ్ర అశాంతి నెలకొంది. కానీ, ఏ శక్తీ ఈ ప్రయాణాన్ని ఆపజాలదని చెప్పిన రాహుల్ గాంధీని గుర్తు చేసుకోండి' అని ఆయన అన్నారు.

కాగా, భార‌త్ జోడో యాత్ర శ‌నివారం ఉదయం 11 గంటలకు దేశ రాజధానిలో ఆశ్రమ చౌక్ వద్ద ఆగి, మధ్యాహ్నం 1 గంటలకు తన ప్రయాణాన్ని తిరిగి ప్రారంభిస్తుంది. మధుర రోడ్డు, ఇండియా గేట్, ITO గుండా ప్రయాణించిన తర్వాత, ఎర్రకోట దగ్గర ఆగుతుంది. న్యూఇయ‌ర్ నేప‌థ్యంలో విరామం తీసుకుని మ‌ళ్లీ జనవరి 3న ఢిల్లీ నుండి భార‌త్ జోడో యాత్ర ప్రారంభమవుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios