Asianet News TeluguAsianet News Telugu

బెంగళూరులో దారుణం.. తల్లిదండ్రులను చంపి, ఇంటికి తాళం వేసి పారిపోయిన కొడుకు..

వృద్ధులైన తల్లిదండ్రులను అతి దారుణంగా హత్య చేశాడో కొడుకు. ఆ తరువాత ఇంటికి తాళం వేసి పారిపోయాడు. ఈ ఘటన బెంగళూరులో వెలుగు చూసింది. 

Son killed his parents, locked house and ran away in Bengaluru - bsb
Author
First Published Jul 19, 2023, 11:24 AM IST

బెంగళూరు : కర్నాటకలోని బెంగళూరులో సభ్యసమాజం తలదించుకునే హేయమైన ఘటన వెలుగు చూసింది. బెంగళూరు నగరంలో 27 ఏళ్ల యువకుడు తన వృద్ధ తల్లిదండ్రులను నరికి చంపాడు. ఆ తరువాత ఇంటికి బయటి నుంచి తాళం వేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ మేరకు పోలీసులు మంగళవారం తెలిపారు.

సోమవారం రాత్రి 8:30 నుంచి 9 గంటల మధ్య హత్యలు జరిగి ఉండవచ్చని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (నార్త్ ఈస్ట్ బెంగళూరు) బీఎం లక్ష్మీ ప్రసాద్ తెలిపారు. కొడుకు మీద హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ప్రియురాలి భర్తను చంపి, 6 ముక్కలు చేసి, పాతిపెట్టిన చోట మామిడి మొక్కలు నాటిన ప్రియుడు..

బెంగళూరులోని కొడిగేహళ్లిలో సోమవారం రాత్రి తల్లిదండ్రులు భాస్కర్ (61), శాంత (60)లను హత్య చేసిన నిందితుడు శరత్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కొడుకు దాడి సమయంలో సెక్సాజనేరియన్ జంట సహాయం కోసం అరిచినట్లు తెలుస్తోంది.  అయితే అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు ఇది సాధారణ గొడవగా భావించారు. దీంతో పట్టించుకోలేదు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, శరత్ తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. అతని అన్నయ్య సాజిత్ సమీపంలోని తిండ్లులో ఉంటాడు. మంగళవారం రోజు సాజిత్ తల్లిదండ్రులకు ఫోన్ చేసినా స్పందించలేదు. వెంటనే ఇంటికి వెళ్లి చూడగా ఇంటికి బయట నుంచి తాళం వేసి ఉండటాన్ని గుర్తించారు. 

సాజిత్ తలుపులు బద్దలు కొట్టి చూడగా అతని తల్లిదండ్రులు రక్తపు మడుగులో పడి ఉన్నారు. అలా విషయం వెలుగులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు.  శాంత పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగి అని, భాస్కర్ ప్రభుత్వ కార్యాలయ సముదాయం ఖనిజా భవన్‌లోని క్యాంటీన్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు.

దక్షిణ కన్నడ జిల్లాలోని ఉల్లాల్‌కు చెందిన ఈ కుటుంబం, పిల్లలతో కలిసి 12 సంవత్సరాల క్రితం బెంగళూరుకు వచ్చిందని, శరత్, అతని తల్లిదండ్రుల మధ్య తరచుగా గొడవలు జరిగేవని పోలీసులు తెలిపారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios