MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • ప్రియురాలి భర్తను చంపి, 6 ముక్కలు చేసి, పాతిపెట్టిన చోట మామిడి మొక్కలు నాటిన ప్రియుడు..

ప్రియురాలి భర్తను చంపి, 6 ముక్కలు చేసి, పాతిపెట్టిన చోట మామిడి మొక్కలు నాటిన ప్రియుడు..

వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి ఆమె భర్తను హత్య చేశాడు. శరీరాన్ని 6 ముక్కలుగా నరికి, వివిధ ప్రాంతాల్లో పాతిపెట్టాడు. ఆ ప్రదేశంలో మామిడిమొక్కలు నాటాడు. 

Bukka Sumabala | Published : Jul 19 2023, 10:45 AM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
17
Asianet Image

రాజస్థాన్‌ : రాజస్థాన్ లో వివాహేతర సంబంధం నేపథ్యంలో దారుణ ఘటన వెలుగు చూసింది. రాజస్థాన్ లోని పాలిలో 33 ఏళ్ల వ్యక్తిని అతని భార్య ప్రేమికుడు హత్య చేసి, మృతదేహాన్ని ఆరు ముక్కలుగా నరికి, వేర్వేరు ప్రదేశాల్లో పాతిపెట్టాడు. శరీరభాగాలను ఖననం చేసిన స్థలంలో నిందితుడు మామిడి మొక్కను నాటినట్లు పోలీసులు తెలిపారు.

27
Asianet Image

ఈ ఘటనలో నిందితుడు మదన్‌లాల్ గా పోలీసులు గుర్తించారు. అతను జోగేంద్ర అనే వ్యక్తిని హత్య చేసి, మొండెంను సమీపంలోని అడవిలో పాతిపెట్టాడు. ఇంటికి 100 మీటర్ల దూరంలో ఉన్న తోటలో తల, చేతులు, కాళ్లు పాతి పెట్టాడు. వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

37
Asianet Image

అతని హత్య విషయం వెలుగులోకి రాగా, విచారణ చేపట్టిన పోలీసులు మంగళవారం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు జోగేంద్ర శరీర భాగాలను ఖననం చేసిన స్థలంలో మామిడి మొక్కను నాటినట్లు పోలీసులు వెల్లడించారు.

47
Asianet Image

జూలై 13న జోగేంద్ర కనిపించడం లేదంటూ తండ్రి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మదన్ లాల్ ను పోలీసులు అరెస్టు చేశారు. జోగేంద్ర తండ్రి ఫిర్యాదు మేరకు జూలై 11న జోగేంద్ర ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. 

57
Asianet Image

కొడుకు కనిపించకుండా పోవడంలో మదన్‌లాల్ ప్రమేయం ఉందని అనుమానాలు వ్యక్తం చేశాడు. "నా కొడుకును చంపడంలో మరికొంత మంది ప్రమేయం కూడా ఉందని నేను నమ్ముతున్నాను" అని మృతుడి తండ్రి మిశ్రలాల్ మేఘ్వాల్ అన్నారు. 

67
Asianet Image

అతని ఫిర్యాదు మేరకు పోలీసులు వెంటనే విచారణ చేపట్టారు. మదన్‌లాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో, జోగేంద్ర భార్యతో తనకు సంబంధం ఉందని మదన్ లాల్ ఒప్పుకున్నాడు.

77
Asianet Image

దీనికి అడ్డుగా ఉన్నాడనే అతన్ని హత్య చేసినట్లు మదన్‌లాల్ అంగీకరించాడు. నేరం ఎలా చేశాడనే వివరాలను కూడా చెప్పాడు.

Bukka Sumabala
About the Author
Bukka Sumabala
 
Recommended Stories
Top Stories